BrahmaMudi November 17 2023 Episode 256: నిన్నటి ఎపిసోడ్ లో, రాహుల్ రుద్రాణి కలిసి వేసిన ప్లాన్ లో భాగంగా స్వప్నని అందరి ముందు దోషిని చేసి ఇంట్లో నుంచి పంపించాలి అని అనుకుంటారు. అందుకు ఆయుధంగా స్వప్న మాజీ ప్రియుడిని వాడుకోవాలి అని అనుకుంటారు. రాహుల్ అరుణ్ తో డీల్ కుదిరించుకుంటాడు. స్వప్న తో నువ్వు ఇప్పుడు క్లోజ్ గా ఉండాలి. అలా చేస్తే,నీకు రావాల్సిన పర్మిషన్స్ నేను ఇప్పిస్తాను అని డీల్ మాట్లాడుకుంటాడు. దానికి అరుణ్ ఒప్పుకుంటాడు. వెంటనే స్వప్న ఇంటికి అరుణ్ ఫోటోలను పంపిస్తాడు. ఆ పార్సిల్ ఇంట్లో ఎవరు చూసినా బాంబు బ్లాస్ట్ అవుతుందని రుద్రాణి రాహుల్ సంబరపడుతూ ఉంటారు. కానీ అవి ఇందిరాదేవి చేతిలో పడతాయి. దాంతో రాహుల్ రుద్రాణి మరో ప్లాన్ వేస్తారు. అప్పు ప్రేమ గురించి కనకం తెలుసుకొని అప్పుని బాగా కొడుతుంది.

ఈరోజు 256 వ ఎపిసోడ్ లో అప్పు నీ కనకం బాగా కొడుతుంది అప్పుడు మీద అరుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కృష్ణమూర్తి వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు కానీ నిజం చెప్పకుండా కనకం కృష్ణమూర్తి దగ్గర దాచిపెడుతుంది. ఏంటి నీ మొఖం అలా ఉంది అని అడుగుతాడు కృష్ణమూర్తి నా మొఖం అట్లనే ఉంటుందిలే అని అంటుంది ఏంటి అదోలా మాట్లాడుతున్నావ్ అని అంటాడు.ఏదో ఒక విధంగా కవర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది కనుకమ్. అప్పు ని కొట్టినందుకు కనకం కూడా బాధపడుతుంది.

స్వప్న కంగారు తెలుసుకున్న రుద్రాణి..
ఇక కావ్య అందరికీ డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డిస్తూ ఉంటుంది. అందరూ అప్పటికే వచ్చి కూర్చుంటారు స్వప్న అదే టైంకి కిందకి వస్తుంది. స్వప్న రుద్రాణి రాహుల్ ఇందిరా దేవిని చూసి కంగారు పడుతుంది. స్వప్న కంగారు రుద్రాణి రాహుల్ ఇద్దరూ గమనిస్తారు. స్వప్న వాళ్ళ ముందు కూర్చోడానికి కాస్త ఇబ్బందిగా అనిపించి తర్వాత తిందాంలే వీళ్ళందరూ తిన్న తర్వాత అని లోపలికి వెళ్ళబోతూ ఉంటుంది. రుద్రాణి రాహుల్ ఇద్దరు కావాలనే స్వప్న ఇరికించాలని స్వప్న వచ్చి కూర్చో అని అంటారు. ఇక ఇందిరాదేవి స్వప్నను, గమనిస్తూ ఉంటుంది. వామ్మో ఈమేంటి నన్నే చూస్తుంది కొంపతీసి ఏమన్నా అడుగుతుందా ఏంటి అని అంటుంది స్వప్న.వెంటనే రుద్రాణి నా కోడలు ఏమైనా అడగాలా అమ్మ అని అంటుంది. అదేం లేదు, అని అంటుందిఇందిరా దేవి. స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నీ కోడలు అమ్మమ్మని చూసి భయపడుతుంది అమ్మ అని అంటాడు రాహుల్.

రాజ్ నటన..
ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి అప్పుడే రాజ్ వస్తాడు. మనసులో నువ్వే నాటకం ఆడావు కదా నేను ఆడితే ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు చూపిస్తాను కళావతి అని అనుకుంటాడు. ఇక కావాలనే రాజ్ కళావతి నాకు టిఫిన్ వడ్డించవా అని అంటాడు. కావ్యకు అర్థమవుతుంది నాటకం మొదలుపెట్టాడు అని, ఇక కావ్య రాజ్ కు టిఫిన్ పెడుతుంది. అన్నీ ఇక్కడే ఉన్నాయి పెట్టుకోవచ్చు కదా అని అంటుంది. నీ భర్తకి నువ్వే టిఫిన్ పెట్టాలని కూడా తెలీదా అని అంటాడు. వీళ్ళందరూ అంటే పెద్దవాళ్లు అన్ని అక్కడే ఉన్నాయి మీరే వడ్డించుకోండి అని అంటుంది కావ్య. అంటే వాళ్ళు ముసలి వాళ్ళ లాగా ఉన్నారని నువ్వు డైరెక్టుగా అంటున్నావా అంటాడు రాజ్ సుభాష్ కోడలి మీనింగ్ అది కాదురా అని, అది నీ ఫీలింగ్ అని చెప్పు అని అంటాడు. ఇక ధాన్యలక్ష్మి రాజ్ నీతోనే టిఫిన్ పెట్టించుకోవాలి అని అనుకుంటున్నాడు కావ్య అదంతా పక్కన పెట్టేసి వచ్చి టిఫిన్ వడ్డించు రాజ్ కి అని అంటుంది. సరే అని కావ్య టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది రాజ్ కి, ధాన్యలక్ష్మి మేం ఇంతమంది ఉన్నాం కదా నీకు కావ్య వడ్డించాలా ఏంటి అని అంటుంది. నా భార్యతో నేను వడ్డించమని చెప్తే తప్పేంటి అని అంటాడు రాజ్ ఇక దానికి సీతారామయ్య ఇందిరా దేవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదంతా రుద్రాణి గమనిస్తూ ఉంటుంది నాకు ఏదో డౌట్ గా ఉంది అని రాహుల్ తో అంటుంది. వెంటనే రుద్రాణి మీరిద్దరూ అన్యోన్యంగా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు కోపంతో ఒకరి మీద ఒక రివెంజ్ తీయించుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. భార్యాభర్తలను తర్వాత అలానే ఉంటారు అని ఇందిరాదేవి అంటుంది. కోపాలు అలకలు, గొడవలు అన్నీ సహజం అని ఇందిరాదేవి కవర్ చేస్తుంది.

BrahmaMudi:అందరి ముందు తన మనసులో మాట బయట పెట్టిన రాహుల్..
న్యాప్కిన్ వద్దు నీ చీర కొంగే బెస్ట్..
ఇక రాజ్ కావ్యాలు నాటకాలు ఆడుతున్నారు అనిరుద్రానికి అనుమానం వస్తుంది. ధాన్యలక్ష్మి రుద్రాణి అనే మాటలకు, నీ భర్తతో నువ్వు లేవు కదా అందుకనే భార్యాభర్తల బంధం గురించి తెలియదు అని అంటుంది. ఆ మాటకి వెంటనే రుద్రాణి ఎటు వెళ్లినా నా భర్త దగ్గరికి తీసుకు వస్తారు అని కోపంగా లేచి వెళ్ళిపోతుంది. తను టిఫిన్ చేస్తుంటే ఎందుకు మధ్యలో నుంచి లేపావు అని అంటుంది. ప్లేట్లో పెట్టి టిఫిన్ తినేసే వెళ్లింది లే అమ్మ నువ్వు ఊరుకో అని అంటాడు సుభాష్. మీరు తినండి అని అంటుంది కావ్య. నాతోనే ఆడుకోవాలని చూస్తారా ఇప్పుడు నా యాక్టింగ్ చూడండి అనే రాజ్ కి మాత్రమే వినబడేటట్టు మాట్లాడుతుంది. చట్నీ కావాలండి అని అంటుంది. చూస్తావేంటి వడ్డించు అని అంటాడు రాజ్ అయినా ఇడ్లీ ఒకటే పెట్టావే దోస కూడా పెట్టు అని అంటాడు. ఏమండీ ఇదిగో దోస అని అంటుంది. చూస్తావే వెయ్ అని అంటాడు రాజ్. దోస బాగుందా వడ బాగుందా అని అడుగుతాడు. మీ ఆవిడ చేస్తే ఏదైనా బాగుంటుంది అని అంటుంది ఇందిరాదేవి. నాకు దోసొద్దు వడ వెయ్ అని అంటాడు. మీకోసం ఏదైనా వడ్డిస్తానండి మీరు తినడమే నాకు ఇంపార్టెంట్ అని అంటుంది కావ్య. వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ ఉంటుంది అపర్ణ. పర్ఫామెన్స్ లో అసలు తగ్గట్లేదు అని అంటాడు రాజ్. ఈ మాత్రం ఉండాలిలెండి అని అంటుంది కావ్య. అందరి ముందు ఇద్దరు నటిస్తూ ఉంటారు. అవును కళావతి నువ్వు తిన్నావా అని అంటాడు. భర్త తిన్నాక భారతినాలి కదండీ మీరు తిన్నాక నేను తింటాను అని అంటుంది. ఆ మాటలకి అపర్ణ కోపంగా రాజ్ వైపు చూస్తుంది. రాజ్ వెంటనే టిఫిన్ ముగించుకుని అక్కడి నుంచి చేయి వాష్ చేసుకోవడానికి వెళ్తాడు. కావ్య కూడా కావాలనే రాజ్ దగ్గరికి వెళుతుంది. న్యాప్కిన్ బదులు చీర కొంగిస్తుంది. అయ్యో ఏంటండీ ఇక్కడ మ్యాప్కిని ఇస్తున్నాను కదా నా చీర కొంగు తోనే తుడుచుకోవాలా ఏంటి అని అంటుంది అందరికీ వినబడేటట్టు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్లినా నా చీర కొంగు నుంచి సాంబార్ స్మెల్ చట్నీ స్మెల్ వస్తుంది. చిన్నప్పుడు వాడు వాళ్ళ అమ్మ కొంగుకు అలానే తుడిచేవాడమ్మా ఇప్పుడు నువ్వు వచ్చావు కదా అందుకే నీ చీర కొంగుకు తుడుస్తున్నాడు. అని అంటాడు సుభాష్. అత్తయ్య గారు స్థానం నాకు ఇచ్చారా అండి అబ్బో అని అంటుంది కావ్య కావాలనే, భలే ఇరికించావు కదే అని అంటాడు రాజ్. అట్టుంటది మన తోటి అని అంటుంది కావ్య. రాజ్ కోపంగా నాప్కిన్ తీసుకొని వెళ్ళిపోతాడు.

అరుణ్ కి ఫోన్ చేసిన స్వప్న..
అక్కడ అందరి ముందు అమ్మమ్మ చూసే చూపు తట్టుకోలేకపోతున్నాను ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ తో చచ్చిపోతున్నాను. అసలు దీనంతటికీ కారణమైన అరుణ్ గాడు, వాడికి ఫోన్ చేయాలి అని ఫోన్ చేస్తుంది. ఎంతసేపు ఫోను లిఫ్ట్ చేయకుండా అరుణ్ అలానే చూస్తూ ఉంటాడు. స్వప్న ఎన్నిసార్లు ట్రై చేసినా గాని కట్ చేస్తాడు. ఏదో జరుగుతుంది అదేంటో అర్థం కావట్లేదు అని స్వప్న అనుకుంటుంది. వెంటనే అరుణ్ రాహుల్ కి ఫోన్ చేస్తాడు. సార్ స్వప్న చాలాసేపటినుండి నాకు కాల్ చేస్తుంది లిఫ్ట్ చేసి మాట్లాడమంటారా అని అంటాడు. నీకు హాస్పిటల్ పెట్టుకోవాలని అనిపించట్లేదా ఏంటి? అని రాహుల్ అంటాడు ఏంటి సార్ మీరు చెప్పినట్లే చేశాను కదా అని అంటాడు అరుణ్. మరి నేను చెప్పినట్లు చేస్తే నేను చెప్పకుండా స్వప్నతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నావు అంటాడు రాహుల్. అంటే పాపం చాలాసార్లు ఫోన్ చేస్తుంది కదా అని అంటాడు. పాపం అని అనకూడదు రా అని అంటాడు రాహుల్. సరే సార్ మీరు చెప్పినప్పుడే మాట్లాడుతాను అని రాహుల్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక రాహుల్ ఇందిరాదేవి చూసేటట్లు నాటకం ఆడటం స్టార్ట్ చేస్తాడు.
రాజ్ కి చెప్పాలనుకున్న ఇందిరా దేవి..
ఇక రాహుల్ తన నటనతో ఇందిరాదేవిని పడేస్తాడు. కావాలనే ఇందిరాదేవి వచ్చే టైం చూసుకొని, స్వప్న అరుణ్ లో ఉన్న ఫోటోని చూసి తను బాధపడుతున్నట్టు నటించి ఆ ఫోటోని కింద పడేస్తాడు. అక్కడినుంచి వెళ్ళిపోతాడు ఇదంతా ఇందిరా దేవి చూస్తుంది వెంటనే వచ్చి ఆ ఫోటో ఏంటో అని చూస్తుంది అరుణ్ బైక్ పై స్వప్న కూర్చొని ఉంటుంది రాహుల్ కు ఈ విషయం తెలిసిపోయింది. తొందరగా ఈ విషయం రాజుకి చెప్పేయాలి ముందు అసలు ఇతను ఎవరో కనిపెట్టమని, అని కంగారుగా ఇందిరా దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదంతా రాహుల్ రుద్రాణి చూసి సంతోషిస్తారు మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుంది అని సంబరపడతారు. ఇప్పుడు అమ్మమ్మ వెళ్లి రాజిని కనుక్కోమని చెప్తుంది ఈ లోపు మనం అసలు రాజ్ కి స్వప్న అరుణ్తో మాట్లాడుతుందన్నట్లు అనుమానం వచ్చేలా చేయాలి అని అంటుంది రుద్రాణి ఇద్దరు సరే అనుకుంటారు.
అప్పు బాధ
ఇక అప్పు ఒక్కతే బాధగా కూర్చుని ఉంటుంది అక్కడికి వచ్చిన కనకం అప్పుని కొట్టిన విషయం గుర్తు చేసుకొని తన చేతుల్ని తానే చూసుకుంటూ అనవసరంగా కూతురిని కొట్టాను అని బాధపడుతూ ఉంటుంది. కూతురు దగ్గరికి వెళ్లి పక్కనే కూర్చుని ప్రేమగా కన్నీళ్లు తుడుస్తుంది. అప్పు నేనెప్పుడూ కొడతాను అని బెదిరించడమే గాని ఏ రోజు నిన్ను చెయ్యెత్తి కొట్టలేదు అని అంటుంది కనుకమ్ బాధగా, వెంటనే అప్పు అప్పటికే చాలా బాధగా చేతులు నొప్పి ఎడుతున్నాయా ఏంటి అని అంటుంది. మనసే నొప్పిగా ఉంది అని అంటుంది కనుక ఎందుకమ్మా అని అంటుంది. ఎందుకు నీ మనసు బాధపడుతుంది అని అడుగుతుంది అప్పు. నువ్వు మాత్రం ఆ తప్పు ఎందుకు చేసావే అని అంటుంది కనకం బాధగా తెలీదమ్మా అని అంటుంది అప్పు ఏంటి అని అంటుంది కనుక నిజంగానే తెలియదమ్మా ఆ బద్మాష్ గారితో ఎన్ని రోజులు తిరిగాను ఎప్పుడూ నాకు ఏమీ అనిపించలేదు మంచోడు అమాయకుడు అనుకున్నాను కానీ వాడి మీద నాకు మనసు అవుతుంది అని నేను ఏ రోజు ఊహించలేదు ముందే నా మనసుకు తెలిస్తే నేను అప్పుడే దూరం పెట్టేసేవాన్ని కదా అమ్మ వాడిని అని అప్పు బాధగా, అంటూ ఉంటుంది అదేంటి అని కనకం అయోమయంగా చూస్తూ అప్పు మాటల్ని వింటూ ఉంటుంది అదేనమ్మా ప్రేమంటే దగ్గరున్నప్పుడు దాని విలువ తెలీదు. దూరం పెట్టినప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది వాడు నాకేం దూరం కాలేదు ముందు నన్ను పట్టించుకోవడం లేదనుకున్నాను. కోపం తెచ్చుకున్నాను. వాడి మీద కూడా చాలాసార్లు కోప్పడ్డాను ఒక ఆడపిల్ల మనసు ఇట్లా ఉంటుందని నా ముఖానికి కూడా ప్రేమ అనేది ఒకటి ఉంటుందని నా మనసు నాకు చెప్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అప్పు బాధగా కనకం ఒడిలో పడుకొని ఏడుస్తూ ఉంటుంది కనకం ఓదారుస్తుంది భుజం మీద చేయి వేసి బాధపడకు అని అంటుంది లేకపోతే ఏంటమ్మా కావ్య అక్క ఇంట్లో పడే కష్టాలు కూడా, ఆ ఇంట్లో వాళ్లు,మనల్ని మనుషులు లెక్క చూడరని తెలిసి కూడా నేనెందుకు వాళ్లింట్లోనే అబ్బాయిని ప్రేమించాను అయినా కోరి కోరి ఆ ఇంటి కోడలు కావాలని ఏ ఆడపిల్ల అయినా కోరుకుంటుందా? ఏంటో ఆడపిల్ల అనే పదం ఈ అప్పుకి కొత్తగా అనిపిస్తుంది అదేంటో అంటూ అప్పు బాధగా ఉంటుంది. కనకం ఓదారుస్తూ ఉంటుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది అందరికీ ఏడుపు తెప్పించేస్తుంది అప్పు.
కావ్య నాటకం..
కావ్యా రూంలో పడుకొని పుస్తకం చదువుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రాజ్ వస్తాడు. అప్పుడే కావ్య కావాలని పుస్తకంలో ఉన్నది పైకి చదవడం మొదలు పెడుతుంది. అప్పుడే రాజు పన్నీర్ తో స్నానం చేసి అత్తరు పరిమళం పూసుకొని రాని ఉన్న అంతపురం లోనికి అడుగు పెట్టాడు. అప్పుడు రాని మల్లెపూలు పెట్టుకొని తెల్ల చీర కట్టుకొని హంస తూలిక తలపం మీద వయ్యారంగా బోర్లా పడుకొని శృంగార నిషేధం అనే పుస్తకం చదువుతూ ఉంటుంది. రాజ్ వైపు చూస్తూ ఉంటుంది. కావ్య కావాలనే రొమాంటిక్ స్టోరీ చదువుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది.
రేపటి ఎపిసోడ్ లో, స్వప్నకు అరుణ్ కాల్ చేస్తాడు. స్వప్న చాలా కోపంగా అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు ఎందుకు మా ఇంటికి ఫోటోలు పంపించావు అని అడుగుతుంది అప్పటికే రాత్రి అయి ఉంటుంది. నేను మీ ఇంటి దగ్గరే ఉన్నాను నువ్వు బయటికి వస్తే నీకు ఒక విషయం చెప్తాను అని అంటాడు. అరుణ్ అన్న మాటలకు స్వప్న గబగబా బయటికి వెళ్తూ ఉంటుంది ఇదంతా రాహుల్ రుద్రాణి గమనిస్తూ ఉంటారు. అరుణ్ తో బయటికి వెళ్లి స్వప్న పక్కకు తీసుకువెళ్లి మాట్లాడుతుంది. అరుణ్ చెయ్యి పట్టుకోవడం స్వప్న విదిలించుకోవడం ఇదంతా రాజ్ కావ్యలు కూడా వేరువేరుగా నిలబడి చూస్తూ ఉంటారు. ఇక ఇంట్లో అందరికీ ఆల్మోస్ట్ స్వప్న గురించి తెలిసిపోయినట్టే, స్వప్న గురించి తెలుసుకొని రాజ్ ఏం చేయనున్నాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం..