NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Kathi Karrthika Goud: కాంగ్రెస్ పార్టీకి బిగ్ ఝలక్ ఇచ్చిన కత్తి కార్తీక .. బీఆర్ఎస్ కండువా కప్పుకుని రేవంత్ పై తీవ్ర వ్యాఖ్యలు..

Share

Kathi Karrthika Goud: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు పలువురు నేతలు షాక్ లు ఇస్తున్నారు. టికెట్ లు అశించి భంగపడిన నేతలు ఆ పార్టీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పక్క పార్టీలో చేరిపోతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిలోనూ ఈ పరిస్థితి నెలకొంది. టికెట్ వచ్చినా రాకున్నా పార్టీ కోసం పని చేస్తామని చెప్పిన నేతలు కూడా టికెట్ దక్కకపోవడంతో మరో పార్టీలో చేరి ఆ పార్టీ నాయకత్వంపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు.

తాజాగా  దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక ఆ పార్టీకి బిగ్ ఝులక్ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ చేతుల మీదుగా ఇవేళ గులాబీ కండువా కప్పుకున్న కత్తి కార్తీక గౌడ్ .. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన పెద్ద శని రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఆడ బిడ్డను కంట తడి పెట్టేలా రేవంత్ రెడ్డి చేశారని, అడపిల్ల ఉసురు రేవంత్ రెడ్డికి కచ్చితంగా తాకుతుందని అన్నారు. తనకు రోషం, కసి ఎక్కువ అని, దుబ్బాకలో అసలు కాంగ్రెస్ లేదనీ, అలాంటి దుబ్బాకలో కాంగ్రెస్ జెండా మోసి పార్టీని కాపాడితే తనకు అన్యాయం చేశారని మండిపడ్డారు. గౌరవం లేని చూట తాను ఉండనని అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరినట్లు తెలిపారు.

రేడియో జాకీగా, ఆ తర్వాత టీవీ యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న కత్తి కార్తీక గౌడ్ .. 2020 నవంబర్ లో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో మొదట స్వతంత్ర అభ్యర్దిగా ప్రచారం ప్రారంభించి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్ధి పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు కార్తీక. గత ఏడాది జూన్ 16న గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రలో చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ లో మంచి గుర్తింపు సాధించారు. దీంతో ఈ ఏడాది జూలై లో టీ పీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహక కమిటీలో సభ్యురాలిగా నియమించింది పార్టీ.

గత నెల 31న దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో .. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని వ్యాఖ్యానించిన కార్తీక .. తాను దుబ్బాక గడ్డను, కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని చెప్పారు. దుబ్బాక పట్టణంలోనే ఇల్లు నిర్మించుకుని ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తన వంతు సేవలు అందిస్తానని, దుబ్బాక టికెట్ తనకు రాకున్నా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తానని నాడు చెప్పుకొచ్చారు.

అయితే 2020 ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన చెరుకు శ్రీనివాస్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో టికెట్ ఆశించి భంగపడిన కార్తీక గౌడ్ ఇవేళ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అభ్యర్ధి విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. దుబ్బాక ఎన్నికల బరిలో బీజేపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం రఘునందనరావు బరిలో ఉండగా, బీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి పోటీలో ఉన్నారు.

TDP vs Janasena: జగ్గంపేటలోనూ పిఠాపురం సీన్ .. టీడీపీ – జనసేన ఆత్మీయ సమావేశంలో నేతల మధ్య రగడ


Share

Related posts

బిగ్ బాస్ 4: అభినాష్ గంగవ్వ చేసిన పనికి నాగార్జున కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే..!!

sekhar

Nimmagadda : ‘ఆ పాయింట్ మీద’ భయపడిన నిమ్మగడ్డ ? అందుకే సంచలన నిర్ణయం ?

somaraju sharma

ఒన్ షో రెండుమ్యాచ్‌లు అవుట్ ?

Siva Prasad