Paluke Bangaramayenaa Today Episode November 17 2023 Episode 76: అలా తీసుకువస్తే ఇంటికి అరిష్టం కాదా అని చందన అంటుంది. ఏదే అరిష్టం నువ్వు పెళ్లి అయిన మా ఇంట్లో పడి ఉంటున్నావు ఇది కాదా అరిష్టం అని వాళ్ళ బామ్మ అంటుంది. చూడు చందన కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి కానీ ఇలా మాటలతో హింసించ కూడదు వాళ్లు పండగ చేసుకోకూడదు కానీ మన ఇంటికి వచ్చి ఉండొచ్చు దాంట్లో ఎవరికి ఏ నష్టము జరగదు ఏ అరిష్టము జరగదు అని యశోద అంటుంది. ఏంటి అభి స్వరని తీసుకొస్తున్నట్టు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అభి కి స్వర మీద జాలి ఉంది కానీ ఆ జాలి ఎక్కువయి స్వరకి దగ్గర అయితే నాకు ఎక్కడ దూరం అయిపోతాడు అని భయం వేస్తుంది, నా మనసులో మాట చెబుదాము అంటే ఏమనుకుంటాడో అనిపిస్తుంది చెప్పకపోతే దూరమైపోతాడు ఎలా అని ఝాన్సీ అనుకుంటుంది. కట్ చేస్తే వైజయంతి జై జై అని జై కొడుతూ ఉంటారు పార్టీ కార్యకర్తలు.

బావ ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను అంటే నీకు చెడ్డ పేరు రాకూడదనే బావ నన్ను అర్థం చేసుకో వాళ్ళకు స్వీట్లు ఇచ్చేయ్ బావ అని వైజయంతి అంటుంది. నేను ఇవ్వను అని నాయుడు అంటాడు.మరి నేను ఇవ్వనా బావ అని వైజయంతి అంటుంది. ఎలాగూ ఇద్దామని డిసైడ్ అయ్యావు కదా ఇవ్వు అని నాయుడు అంటాడు.వైజయంతి అందరికీ స్వీట్లు పంచి పెడుతుంది. ఇందుకే వైజయంతి నీ మీద రోజు రోజుకి ప్రేమ తగ్గిపోతుంది నాకంటే నీకు పార్టీ నే ఎక్కువ ఇప్పుడే నిన్ను అర్థం చేసుకుంటున్నాను ఇన్ని రోజులు నిన్న నేను ప్రేమగా చూసుకున్నది అని నాయుడు మనసులో అనుకుంటాడు. నాయుడు ఇప్పుడే లాయర్ తో మాట్లాడాను రెండు రోజుల్లో వస్తాడంట కానీ రోజుకి కోటి రూపాయలు అడుగుతున్నాడు అని రంగరాజు అంటాడు. ఆయన వచ్చి కేసు గెలిపిస్తే చాలు ఐదు కోట్లు ఇస్తానని చెప్పు అని నాయుడు అంటాడు. కట్ చేస్తే ఏంటి ఝాన్సీ ఒంటరిగా నిలబడి ఏదో ఆలోచిస్తున్నావు అని అభిషేక్ అంటాడు.

ఏమీ లేదు అభి అని ఝాన్సీ అంటుంది. ఇంతలో కీర్తి బట్టలు తీసుకొని వస్తుంది. ఎక్కడికి వెళ్లావు కీర్తి అని ఝాన్సీ అడుగుతుంది. స్వరకి బట్టలు లేవని అన్నయ్య చీర తీసుకురమ్మన్నాడు మనమందరం కొత్త డ్రస్సులు వేసుకున్నాం స్వర పాత డ్రెస్ వేసుకుంది కదా అని కీర్తి అంటుంది. అయ్యో సార్ ఇప్పుడు నాకు బట్టలు ఎందుకు తెప్పించారు అని స్వర అంటుంది. పర్వాలేదు స్వర వెళ్లి చీర కట్టుకొని రా అని అభిషేక్ అంటాడు. స్వర కట్టుకొని రా అని కీర్తి చీరను ఇస్తుంది. కట్ చేస్తే,స్వర చీర కట్టుకునే కిందికి వస్తుంది. ఝాన్సీ ఏంటి రెడీ అయ్యి ఇక్కడే ఉన్నావు పూజ దగ్గరికి రా అని చందన అంటుంది. ఝాన్సీ వచ్చి అభిషేక్ పక్కన కూర్చుంటుంది. అభిషేక్ కి స్వర అంటే అభిమానం అని తెలుసు కానీ స్వర అభిషేక్ ని ఇష్టపడుతుందా ఏంటి అని ఝాన్సీ అనుకుంటుంది. స్వర నువ్వు కూడా పూజలో కూర్చో స్వర అని కీర్తి అంటుంది. అయ్యో నేను కూర్చోకూడదు అని స్వర అంటుంది. నువ్వేమీ పూజ చెయ్యట్లేదు కదా అమ్మ వచ్చి కూర్చో పర్వాలేదు అని యశోద అంటుంది.

రాస్వరా అని కీర్తి స్వరని తీసుకువచ్చి అభిషేక్ పక్కన కూర్చోబెడుతుంది.అమ్మ దుర్గమ్మ వచ్చే సంవత్సరం కెల్లా అమ్మ అన్నయ్యకి స్వరకి పెళ్లి అయితే మా నాయనమ్మ చేత నెల రోజులు ఉపవాసం చేయిస్తాను అని కీర్తి మొక్కుకుంటుంది. యశోద పూజ చేసి హారతి ఇస్తుంది. కట్ చేస్తే, ఏంటి బావ పార్టీ కార్యకర్తలతో మాట్లాడకుండా బాధపడుతున్నావు ఇలా ఉండకు బావ అని వైజయంతి అంటుంది. ఇంతలో కళ్యాణి విశాల్ వస్తారు. నమస్తే మామయ్య గారు నమస్తే అత్తయ్య అని విశాల్ వంగి వంగి దండాలు పెడతాడు. ఏంటి కళ్యాణి ఇలా వచ్చారు అని వైజయంతి అంటుంది. ఏమీ లేదు వదిన గారు ఈరోజు పండుగ కదా మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను కానీ ఏంటి ఇల్లంతా సందడిగా ఉంది, పార్టీ నిన్ను ఎమ్మెల్యేగా ప్రకటించిందా అని కళ్యాణి అంటుంది. ఏంటి విశాల్ తొంగి చూస్తున్నావు అని వైజయంతి అడుగుతుంది. స్వర ఎక్కడ ఉంది ఆంటీ అని విశాల్ అంటాడు. ఆర్యతో కలిసి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది అని వైజయంతి అంటుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడో చెప్పండి ఆంటీ నేను వెళ్లి అక్కడ మాట్లాడుతాను స్వరతో అని విశాల్ అంటాడు.

నా కూతుర్ని వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి పలకరిస్తే నా పర్వం కావాలి ఇంటికి వచ్చాక మాత్రమే మాట్లాడు అని నాయుడు అంటాడు. హ్యాపీ దీవాలి మామయ్య అని విశాల్ సెకండ్ ఇస్తాడు. నాయుడు కోపంగా చూస్తాడు. విశాల్ ఏమీ మాట్లాడకుండా వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు.కట్ చేస్తే ఏంటి ఈ రోజు పండగ లాగా లేదు ఇల్లంతా సైలెంట్ గా ఉంది అని కీర్తి అంటుంది. ఏం చేయమంటావే అని యశోద అంటుంది. ఏదైనా ఆట ఆడొచ్చు కదా అని కీర్తి అంటుంది. దాగుడుమూతలు ఆడుదామా అని అభిషేక్ అంటాడు.

నాయనమ్మ ఎక్కడపడితే అక్కడ సందులో పట్టదు వేరే ఆట ఆడదామని చందన అంటుంది. లావు గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి అని వాళ్ళ బామ్మ అంటుంది. అంత్యాక్షరి ఆడదామా అని చందన వాళ్ళ ఆయన అంటాడు. వద్దు వేరే ఆట ఆడదాము అని అభిషేక్ అంటాడు. ఆర్య నువ్వు చెప్పు ఏదైనా ఆట అని కీర్తి అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది