BrahmaMudi November 16 Episode 255: నిన్నటి ఎపిసోడ్ లో,రాహుల్ రుద్రాణి కలిసి స్వప్న ఇంట్లో నుంచి పంపించడానికి మంచి ప్లాన్ వేస్తారు. దాన్ని అమలు చేయడానికి రాహుల్ అరుణ్ దగ్గరికి వెళ్తాడు. అరుణ్ తో రాహుల్, డీల్ మాట్లాడుకుంటాడు. రాహుల్ చెప్పిందానికి అరుణ్ ఒప్పుకుంటాడు. కళ్యాణ్ అనామికల పెళ్లి గురించి తెలిసి అప్పు చాలా బాధపడుతుంది ఇంటికి వచ్చి, కళ్యాణ్ ఫోటోలు తీసుకొని, దాన్ని చూస్తూ, కళ్యాణ్ తో ఉన్న గతాన్ని గుర్తుచేసుకొని బాధపడుతూ ఉంటుంది. కావ్య రాజ్ తో చెప్పినట్టుగా నాటకం అడ్డం స్టార్ట్ చేస్తుంది. కావాలనే సారీ కళావతి అనే బోర్డు ఇంట్లో పెట్టి, రాజ్ ను కుటుంబ సభ్యుల ముందు ఇరికిస్తుంది. తప్పించుకునే వీలు లేక రాజ్ అల్లాడిపోతాడు. ఇక ఇంట్లో అందరి ముందు తనని ఇబ్బంది పెట్టినందుకు కళావతికి క్లాస్ పీకాలనుకుంటాడు రాజ్.

ఈరోజు255 వ ఎపిసోడ్ లో, కళావతి ఎప్పుడు రూమ్ లోకి వస్తుందా, అని ఎదురు చూస్తూ ఉంటాడు రాజ్. అప్పుడే కళావతి ఏమీ తెలియనట్టు రూమ్ లోకి వస్తుంది. ఏం చేస్తున్నావ్ నువ్వు తెలుస్తుందా అని అంటాడు రాజ్. ఎందుకు తెలియదు ఇప్పుడే ఉల్లిపాయలు కట్ చేశాను సాంబార్ లోకి, వడియాలు వేయించి వస్తున్నాను ఇదే నేను చేసిన పని నాకెందుకు తెలియదు అని అంటుంది.స్మార్ట్ గా మాట్లాడు మాకు అని అంటాడు రాజ్. స్మార్ట్ గా ఉంటానని అందరూ అంటుంటారు అలా మాట్లాడుతున్నానని మీరు కూడా అంటున్నారు రోజురోజుకీ నాలో మంచి క్వాలిటీస్ పెరిగిపోతూ ఉన్నాయి అని సిగ్గుపడుతుంది కావ్య. నేను నీకు సారీ చెప్తాను అని అనుకున్నావా అని అంటాడు. మీరు చెప్పకపోతే ఎవరు చెప్తారు అని అంటుంది కావ్య. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు సారీ అని బోర్డు పెట్టి,ఇంట్లో అందరి ముందు ఇలా చేస్తానని అనుకున్నావా అని అంటాడు. ఎలా చేశారండీ నాకు అదే అర్థం కావట్లేదు రాత్రంతా పశ్చాతాపంతో, ఆలోచించి కృంగిపోయి నలిగిపోయిన ప్రేమ గురించి అర్థం చేసుకొని సారీ అని నేను లేచేసరికి బోర్డు పెట్టారా అని అంటుంది. ఓవరాక్షన్ చేసావంటే చంపేస్తాను అని అంటాడు ఆ తర్వాత నా సమాధి దగ్గర సారీ అని బోర్డు పెడతారా అని అంటుంది.

నాటకం అని తేల్చిన కావ్య..
ఏంటే ఇదంతా అని అంటాడు రాజ్. నాటకం ప్రేమ నాటకం నేను నటిస్తే ఎలా ఉంటుందో నమూనా ఈ విధంగా ఉంటుంది అని తెలియడానికే ఇలా చేశాను. నిన్న మొన్నటి దాకా కత్తులు లేకుండా మాటలు యుద్ధం చేసుకున్న బాణాలు లేకుండా అస్త్రాలు సంధించుకున్నాం. కత్తులు లేకుండా తానులో గుడ్డ ముక్కలు కత్తిరించినట్టు, మన ప్రేమని కత్తిరించుకుంటూ వెళ్ళాం. చివరికి మా అక్క చేసిన పనికి మీ దృష్టిలో నేను దోషిగా మిగిలిపోయాను. లోపలికి అడుగు పెట్టడమే తప్ప బయటకి రావడం తెలియని అభిమన్యుడిలాగా మిగిలి పోవాల్సిందే, కొత్తగా పెళ్లయి అత్తింటికి వచ్చిన ఆడపిల్ల పరిస్థితి, కురుక్షేత్రంలో చిక్కుకున్న అభిమన్యుడు లాంటిదే అని అంటుంది. ఎటు నుంచి ఏ బాణాలు వస్తాయో తెలియక నలిగి పోవాల్సిందే అని అంటుంది కావ్య. మీరు ఏ గజదొళంగా మీదకు వస్తారో తెలియదు, మీ అత్త లాంటివాళ్ళు, రాహుల్ లాంటివాళ్ళు, మా అక్కని, ఇబ్బంది పెడుతుంటే, ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియని, కర్ణుడు లాగా సహాయం చేయడానికి, కుంగిపోయిన రధాన్ని పైకి లేపడానికి, ఎవరు వస్తారా అని ఎదురు చూస్తుంటే, ఒక ఆడపిల్ల పడే బాధని, మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అని అంటుంది కావ్య. అత్తారింట్లో అడుగుపెట్టిన ఎన్ని రోజులు నా కాపురం కురుక్షేత్రం అయింది యుద్ధమే చేస్తున్నాను ఇంటికోడలికి ఏకవచాలు ఉండవు, సునీతమైన హృదయం మాత్రమే ఉంటుంది ఏ మాట పడ్డ గుండెను చీలుస్తూనే ఉంటుంది ప్రతి మాటకి సమాధానం చెప్పలేను కన్నీళ్లు పాదరసం లాగా అట్టడుగునే ఉండాలి. మాట పెదవి చాటునే ఉండాలి. బయటపడితే ఈ సమాజం ఏమంటుందో అని, నా వ్యక్తిత్వాన్ని నా ఉనికిని నా ఆశల్ని నా కోరికల్ని, ఏ తప్పు చేయలేదు నేను ఒక నిజం దాచాను. అది మీ దృష్టిలో తప్పు మీ అమ్మగారి దృష్టిలో నేరం, ఇప్పుడు నాకు నేనే కవచం కావాలి నాకు నేను నాతో నేను నా ఉనికి కోసం నేను, యుద్ధం మొదలు పెట్టాలి. ఈ ఇంట్లో ఈ ఇంటి పెద్ద కు పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది అందరూ ఆయన్ని సంతోషంగా ఉంచాల్సిన సమయం వచ్చింది. అందుకే మీకు నా మీద ప్రేమ ఉన్నట్టు మీతో పాటు నేను కూడా నటించాల్సిన అవసరం వచ్చింది మీ ప్రేమేయం లేకుండా సారీ రాసినందుకు సారీ. అని కావ్య చెప్పగానే షాక్ అయి చూస్తాడు రాజ్, చెప్పేసి వెళ్లిపోయిన తర్వాత, కావ్య మాట్లాడిన మాటలు ఒక్కటి కూడా అర్థం కావు, రాజ్ కి, ఇది నన్నొక్కన్నే తిట్టిందా అందరిని విమర్శించిందా, దాని బాధ చెప్పుకుందాం నా బుర్ర గిరగిరా తిరిగేలా చేసిందా, ఏం మాయ చేసి పోయింది. వామ్మో దీని గురించి అర్థం చేసుకోవడం కొంచెం కష్టమ్. అయినా అత్తగారు కోడలు అనే కురుక్షేత్రం దాకా తీసుకెళ్ళింది. చెప్పిన మాటలు ఒక ముక్క అర్థం కాలేదు అని రాజ్ అనుకుంటాడు.

రాహుల్ ప్లాన్ సక్సెస్..
ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరు పార్సిల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏంట్రా నువ్వు అసలు కరెక్ట్ గానే చేస్తున్నావా అని అంటుంది రుద్ర అని ఏమైంది మమ్మీ ఇప్పుడు అంటాడు రాహుల్. పార్సిల్ వస్తుందన్నావ్ ఇంతవరకు రాలేదు అంటాడు కనుక్కుంటాను మమ్మీ అని ఫోన్ చేస్తాడు. అప్పటికే, అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసి పంపించేశానండి అని చెప్తాడు. వచ్చేస్తే మమ్మీ అని అంటాడు రాహుల్ అప్పుడే కొరియర్ బాయ్ వచ్చి పార్సిల్ అని అంటాడు. ధాన్యలక్ష్మీ పార్సిల్ తీసుకోవడానికి వెళుతుంది. అప్పుడే పైనుంచి రాహుల్ రుద్రాణి చూసి, మనం వేసిన ప్లాన్ సక్సెస్ మమ్మీ అని అనుకుంటారు. ఇక దానిలక్ష్మి ఎవరి కోసం అని అడుగుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ కోసం అని చెప్తాడు కొరియర్ బాయ్. అది తీసుకొని అపర్ణ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. పక్కనే ఇందిరా దేవి కూడా ఉంటుంది. ఫ్రమ్ అడ్రస్ లేదేంటి అని అంటుంది అపర్ణ. ఏమో ఎవరి కోసం వచ్చాయో అని ఓపెన్ చేయబోతూ ఉంటుంది. అప్పుడే వంటింట్లో సౌండ్ రావడంతో అపర్ణ చేతిలో పెట్టి వెళ్ళిపోతుంది. ఇకపై నుంచి రుద్రాణి రాహుల్ ఇద్దరు ఎవరు ఓపెన్ చేస్తారు బాంబు ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. పార్సిల్ అందుకున్న అపర్ణ ఓపెన్ చేద్దాం అని అనుకుంటూ ఉంటుంది. అసలు ఫ్రెండ్ అడ్రస్ లేకుండా ఎవరు పంపించారు అత్తయ్య మనకి అని అంటూ ఉంటుంది. అప్పుడే సుభాష్ అపర్ణ అని పిలుస్తాడు. ఇక పార్సిల్ అపర్ణ కూడా ఓపెన్ చేయదు రుద్రాణి రాహుల్ చాలా టెన్షన్ గా చూస్తూ ఉంటారు. చివరకు పార్సిల్ ఇందిరా దేవి చేతిలో పడుతుంది. ఇక ఏందిరా దేవి అసలు ఈ పార్సిల్ ఎవరు పంపించారు అని ఓపెన్ చేస్తుంది.

స్వప్న షాక్..
పార్సిల్ ఓపెన్ చేసిన ఇందిరా దేవి, చూసి షాక్ అవుతుంది. అందులోస్వప్న,అరుణ్ తో దిగిన ఫోటోలు ఉంటాయి. ఇక పైనుంచి రాహుల్ రుద్రాణి ఫొటోస్ మొత్తానికి బయటపడే అని అనుకుంటారు. కాలేజీ రోజుల్లో స్వప్న అరుణ్ కలిసి దిగిన ఫోటోలు అవన్నీ, అవన్నీ ఇందిరా దేవి చూసి చాలా టెన్షన్ పడుతుంది. ఇంట్లో వాళ్లకి ఇప్పుడే చెప్పొద్దు విషయం ఏంటో తెలుసుకున్నాక ఇంట్లో వాళ్లకు చెబుదామని అటు ఇటు చూస్తుంది ఎవరూ చూడరు ఇంతలో, అపర్ణా వస్తుంది, వెంటనే ఇందిరా దేవి, ఆ ఫొటోస్ ని మళ్లీ పార్సిల్ లో పెట్టేస్తుంది. కొరియర్ ఏమొచ్చింది అత్తయ్య అని అడుగుతుంది. ఏం లేదు మీ మామయ్య గారి కోసం మందులు తెప్పించాను అని అంటుంది ఇందిరాదేవి. ఇదేంటి మమ్మీ, మనం ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని రాహుల్ రుద్ర నీతో అంటాడు. నువ్వేం టెన్షన్ పడకు మా అమ్మే ఊరుకోదు స్వప్న గదిలోకి వెళ్తుంది. ఇక్కడ పేలాల్సింది బాంబు స్వప్న గదిలో పేలుతుంది వెళ్లి చూద్దాం పద అంటుంది. ఇక ఇందిరా దేవి ఫొటోస్ పట్టుకొని స్వప్న గదిలోనికి వెళుతుంది స్వప్న అని పిలుస్తుంది ఏంటి అమ్మమ్మ గారు మీరు పైకి వచ్చారు కావ్యతో కబుర్లు చేస్తే నేనే కిందకు వచ్చేదాని కదా అంటుంది స్వప్న. కొన్ని విషయాలు నలుగురిలో మాట్లాడుకోవడమే మంచిది అని అంటుంది ఇందిరా దేవి. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంటుంది స్వప్న. బాంబు ఎలా బ్లాస్ట్ అవుతుందా అని రాహుల్, రుద్రాణి ఇద్దరు గది బయటే నుంచొని చూస్తూ ఉంటారు. ఇప్పుడు మా అమ్మ చూపించే ఫోటోకి దాని మొహం ఎన్ని రంగులు మారుతాయో చూడు అంటుంది రుద్రాణి రాహుల్ తో, అప్పుడే ఇందిరాదేవి పార్సిలో ఉన్న ఫొటోస్ చూపిస్తుంది స్వప్నకి, స్వప్న షాక్ అవుతుంది. అమ్మ మా అరుణ్ ఫోటో చూపిస్తుంది ఏంటి అని, స్వప్న మనసులో అనుకుంటుంది. ఈ అబ్బాయి ఎవరు ఈ అబ్బాయి తో నీకు పరిచయం ఉందా అని అడుగుతుంది. ఇందిరా దేవి. ఇదే ప్రశ్న అందరి ముందు కూడా అడగొచ్చు కానీ విషయం ఏంటో తెలుసా అప్పుడు అడగొచ్చు. ఇప్పుడు నిజం నాకు చెప్పు అని అంటుంది ఇందిరా దేవి. స్వప్న ఈ అబ్బాయి ఎవరు, నిజం చెప్పు అంటుంది ఇందిరా దేవి. చూసావా మమ్మీ పాయసం తిన్నంత సులువుగా అబద్ధం ఎలా చెప్తుందో అని అంటాడు రాహుల్. ఈ అబ్బాయి ఎవరో నీకు నిజంగా తెలియదా అని మళ్లీ అడుగుతుంది ఇందిరా దేవి నిజంగా తెలియదా మమ్మీ గారు ఎవరి అబ్బాయి అని అంటుంది స్వప్న. అయినా నాకెందుకు చూపిస్తున్నారు అని అంటుంది సరే ఏం లేదులే అని అక్కడ నుంచి ఇందిరా దేవి సైలెంట్ గా బయటికి వస్తుంది స్వప్న ఈ అరుణ్ గాడు వాడి ఫోటోలు మా ఇంటికి ఎందుకు పంపించాడు అని కోపంగా అరుణ్ కి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. ఇందిరా దేవి గదిలో నుంచి బయటికి వచ్చి స్వప్న అబద్ధం చెప్తుందా లేక ఈ ఫోటోలో అబద్ధమా తేల్చేయాలి అని అనుకుంటుంది. రాహుల్ ఏంటి మమ్మీ మనం ఒకటి అనుకుంటే ఇంకోలా జరుగుతుంది అమ్మ మా బాబు బ్లాక్ చేస్తుందనుకుంటే సైలెంట్గా అబద్ధం తెలుసుకోవడం వెళ్ళిపోతుంది అని అంటాడు. మా అమ్మకి అంతా తెలుసు రా స్వప్న చెప్పింది అబద్ధమని మా అమ్మ కూడా అనుకుంటుంది ఇప్పుడు తాతయ్య గదిలోనికి వెళ్లి, ఆలోచిస్తుంది ఎందుకంటే తాతయ్య ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇలాంటి విషయాలు బయటపడటం మంచిది కాదు అని అనుకుంటుంది.ఆ తర్వాత రాజ్ కి చెబుతుంది. రాజ్ విషయం ఏంటని కనుక్కొని లోపే,అనుమానం వచ్చేలా మనం చేయాలి అని అంటుంది రుద్రాణి రాహుల్తో, ఇద్దరూ సరే అనుకుంటారు.

అప్పు ప్రేమ గురించి తెలుసుకున్న కనకం..
ఇక కనకం రూమ్స్ అద్దుతూ ఉంటుంది అప్పుడే అప్పు రూమ్ లో కళ్యాణ్ ఫోటో చూస్తుంది. దానిమీద ఐ లవ్ యు అని రాసి ఉంటుంది. అది చూసి కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే అప్పుతో గొడవ పడడానికి బయటకు వస్తుంది. అప్పుని బాగా కొడుతుంది. అడ్డుగా అప్పు పెద్దమ్మ నుంచుంటుంది. ఇప్పుడు ఏం తప్పు చేసిందని దాన్ని అలా కొడుతున్నావు అని అంటుంది అప్పు పెద్దమ్మ అన్నపూర్ణ. నీకేం తెలియదు అక్క నువ్వు పక్కకు తప్పుకో అంటుంది. ఏం చేసిందో చెప్పు అని అంటుంది అన్నపూర్ణ ఇది ఆ కళ్యాణ్ అని ఆగి, లోపలికి వెళ్లి ఫోటో తీసుకొచ్చి, ఇప్పుడు చూడు అక్క ఏం చేసిందో నీకే తెలుస్తుంది అని అంటుంది. ఆ ఫోటో చూసి అన్నపూర్ణ అప్పు ఇద్దరు షాక్ అవుతారు. ఇక అప్పు కి అర్థం అయిపోతుంది. అన్నపూర్ణ ఈ విషయం గురించి నాకు తెలుసు అని అంటుంది. ఆ మాటకి కనకం షాక్ అవుతుంది. నీకు తెలుసా అక్క నీకు తెలిసే ఇదంతా జరిగిందా అని అంటుంది. ఇందులో ఏముంది ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అని అంటుంది అన్నపూర్ణ. రేపు తెలిస్తే ఏమవుతుందో నీకు తెలుసా అక్క ఇప్పటికే ఆ ఇంట్లో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరిని ఆ ఇంటికి కోడలని చేసామని నా కూతుళ్ళని నన్ను ఇప్పటికీ వాళ్లు నానా మాటలు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా వాళ్ళ చిన్నబ్బాయిని ప్రేమించిందని తెలిస్తే వాళ్ళు ఎన్ని మాటలు అంటారు. అసలు దాని గురించి ఏమన్నా ఆలోచించారా మీరు అని అంటుంది. వాళ్లకు తెలిసినప్పుడు చూద్దాంలే అని అంటుంది అన్నపూర్ణ అసలు దీన్ని ఏం చేసినా పాపం లేదు అక్క దీనికి అంతా తెలిసి కూడా ఆ అబ్బాయిని ప్రేమించిందంటే ఏమనాలి అని దగ్గరికి వెళ్లి అప్పుని కొట్టబోతుండగా అప్పుడు కృష్ణమూర్తి వస్తాడు. గొడవంతా ఏం జరిగిందో కృష్ణమూర్తికి తెలియదు ఏంటి అని అడుగుతాడు. వెంటనే కనకం కవర్ చేసి ఏం లేదండి ఇది ఏదో గొడవ చేసింది అన్నం తినను అంటుంటే మందలిస్తున్నాను అని అంటుంది. మీరిద్దరూ ఇకనుంచి కళ్ళు తుడుచుకొని లోపలికి వెళ్ళండి నేను ఏదో ఒకటి చెప్తాను అని కనకం అప్పు అని అన్నపూర్ణని అక్కడి నుంచి పంపించేస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో స్వప్న అరుణ్ కి ఫోన్ చేస్తుంది. మనం దిగిన ఫోటోలు నీ దగ్గర మాత్రమే ఉన్నాయని నాకు తెలుసు. ఇప్పుడు వాటిని మా ఇంటికి ఎందుకు పంపించావు అని అడుగుతుంది అప్పుడు అరుణ్ నేను మీ ఇంటి ముందే ఉన్నాను నీతో ఒక మాట మాట్లాడాలి అని చెప్తాడు. నీతో మాట్లాడి విషయం నీకు అర్థం అయ్యేలా చెబుదామని ఇక్కడికి వచ్చాను అని అంటాడు. ఇప్పుడే అసలు ట్విస్ట్ ఉంటుంది. అరుణ్ తో స్వప్న మాట్లాడడం రుద్రణి,రాహుల్, రాజ్, కావ్య అందరూ చూస్తారు. కానీ ఒకరు చూస్తున్నట్టు ఒకరికి తెలియదు. చూడాలి రేపు ఎంత గొడవ జరుగుతుందో..