Gunde Ninda Gudigantalu Today Episode November 15 2023 Episode 31: బాలు ఇదిగో అమ్మ ప్రభావతమ్మ మా నాన్నగారు చద్ది కూడు తినవలసిన అవసరం లేదు ఇదిగో నాన్న మనకోసం చికెన్ పలావ్ తెచ్చాను రండి నాన్న తినండి సత్యం పెట్టరా త్వరగా ఆకలి వేస్తుంది బాలు ఇదిగో నాన్న తినేసేయ్ సత్యం వావ్ వాసన అదిరిపోయింది బాలు నాన్న నిరాహార దీక్ష నిమ్మరసంతోనే కాదు చికెన్ పలావ్ తో కూడా విరమించవచ్చు ప్రభావతి నువ్వేం నాకు చెప్పనవసరం లేదు సత్యం అలా కోపగించుకోకపోతే బాలు అన్నట్టు వచ్చి ఈ పలావుని తిని చూడు చాలా అదిరిపోయింది ప్రభావతి రా నీవు కూడా తిను అంటాడు సత్యం అప్పుడు ప్రభావతి ఏమి అవసరం లేదు మీరు నా నిరాహార దీక్ష ఒప్పుకుంటేనే విరమిస్తాను బాలు వావ్ చికెన్ అదిరిపోయింది నాన్న అంటూ తినబోతుండగా ప్రభావతి ఇక చాలు ఆపుతారా అని వంటింట్లోకి వెళ్లి చద్దన్నం తీసుకువచ్చి బాలుకు ఇస్తుంది బాలుఇదేంటి నేను చికెన్ పలావ్ తెచ్చుకున్నాను

ఈ చద్దన్నం నాకు వద్దు అంటాడు బాలు ప్రభావతి రాత్రంతా జ్వరంతో పడుకొని రోగం తెచ్చుకొని ఇప్పుడు చికెన్ తింటావా పత్యం చేయాలి నువ్వు ఈ పెరుగు ఉల్లిపాయ నంచుకుని తిను టాబ్లెట్లు వేసుకో అని చెప్పి వెళ్లి మళ్లీ నిరాహార దీక్షలు కూర్చుంటుంది ప్రభావతి సత్యం తల్లికి కొడుకు మీద కొడుకు తల్లి మీద ప్రేమ బాగానే ఉందే కానీ మా అందరి ముందు పిల్లి ఎలుకలాగా కనిపిస్తారు సరే ప్రభావతి బాలు నీకోసమే తెచ్చాడు వచ్చి తిను అంటాడు సత్యం ప్రభావతి నా మాటకి మీరు ఒప్పుకుంటేనే తింటాను సత్యం సరే ఒప్పుకుంటాను కానీ నీ పెద్ద కొడుకు మనోజ్ ఈ పెళ్లికి ఒప్పుకుంటే అప్పుడు మనోజ్ నేనుఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను నాన్న అంటాడు సత్యం అందుకు షాక్ అయి మనోజ్ ఏంట్రా ఏమన్నావ్ నిజంగానా ఈ పెళ్ళికి నువ్వు ఒప్పుకుంటున్నావా? చాలా సంతోషంగా ఉంది రా అంటాడు

మనోజ్ కానీ ఒక కండిషన్ నేను ఆ పెళ్లి చేసుకోవాలంటే నీకు వచ్చే రిటైర్మెంట్ డబ్బులు మొత్తం నా బిజినెస్ లో పెట్టాలి అలా అయితేనే నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అంటాడు మనోజ్ సత్యం అలాగే రా అని అంటాడు ప్రభావతి అదేంట్రా మనోజ్ నీకోసమే కదా నేను ఈ నిరాహార దీక్ష చేసేది నువ్వు ఇంత ఈజీగా ఎలా ఒప్పుకున్నావురా వద్దురా మనోజ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు రా అని అంటుంది ప్రభావతి మనోజ్ అమ్మ నాకోసం నువ్వు ఇక నిరాహార దీక్ష చేయనవసరం లేదు నేను ఈ పెళ్లి చేసుకుంటాను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పెళ్లి చేసుకుంటాను బాలు నేను ఒప్పుకోను సత్యం ఏంట్రా బాలు మళ్లీ నీకేమైంది బాలు ఉన్న డబ్బంతా మీరు వాడి బిజినెస్ లు పెడితే తర్వాత మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతాడు బాలు సత్యం అవున్రా మనోజ్ ఉన్న డబ్బంతా నీ ఒక్కడికి ఇచ్చేస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? మనోజ్ నాన్న అలా ఆలోచించకండి నా బిజినెస్ డెవలప్ అయినాక మీరు వాళ్లకి ఇచ్చే వాటా కంటే పది రెట్లు వాటా నేను ఇస్తాను బాలు ఉన్న డబ్బంతా నీ బిజినెస్ లో పెడితే ఆఖరికి అది దివాలా తీస్తే పరిస్థితి ఏంటి? నేను ఒప్పుకోను అంటే ఒప్పుకోను అంటాడు బాలు మనోజ్ నీ నోటి నుంచి ఎప్పటికీ మంచి మాటలు రావారా అమ్మ అన్నట్లే నువ్వు నష్ట జాతకుడువి రా అంటాడు బాలు

ఆవిడ అంటుందని నేను పడుతున్నానని ఇంకా వేరే ఎవరైనా అదే మాట అనాలని చూస్తే ఊరుకునేది లేదు అంటూ మనోజ్ మీదికి వెళతాడు బాలు సత్యం బాలుని ఆపి ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకు వచ్చే డబ్బు మొత్తం మనోజ్ కి ఇచ్చేస్తాను అంటాడు బాలు ఏమి మాట్లాడకుండా వెళ్లి రూమ్ లో పడుకుంటాడు సత్యం మళ్ళీ బాలు దగ్గరికి వెళ్లి బాలు ఏంట్రా నాన్న అలా నా మాటకి ఎదురు చెప్పావు అంటాడు బాలు అది కాదు నాన్న ఉన్న డబ్బంతా బిజినెస్ లో పెడితే ఆఖరికి బిజినెస్ నష్టమైతే ఏం చేసేది పరిస్థితి ఏంటి నేను ఆలోచించేది నాకోసం కాదు నా వాటా తీస్తే అది రేపటి రోజున మీకు ఉపయోగపడుతుంది కదా మీకోసమని ఆలోచించాను అంటాడు బాలు అందుకు సత్యం సంతోషపడి నాకు నువ్వు ఉన్నావు కదా బాలు అంటాడు. కట్ చేస్తే సత్యం రంగయ్య మీనా ఇంటికి వెళ్లి అమ్మ మేము మళ్ళీ వచ్చామని కోప్పడకండి నేను చెప్పేది కాస్త వినండి అంటారు మీనా తల్లి పార్వతి ఇంకా ఏం చెప్పడానికి ఎవరిని చంపడానికి వచ్చారు దయచేసి మీరు వెళ్లిపోండి ఇకనుంచి ఎప్పుడు ఈ ఇంటి వైపు రా వద్దని చెప్పేసాం కదా మళ్లీ ఎందుకు పదేపదే మా ఇంటికి వస్తున్నారు అంటుంది.

సత్యం అమ్మ పార్వతి తోడ పుట్టకపోయినా నేను నీ సొంత అన్న అనుకునే నేను ఈ ఇంటికి వస్తున్నాను ఏమీ లేదమ్మా ఒక ఇంటికి పెద్ద దిక్కు లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు మీనా మంచి గుణం కూడా నాకు తెలుసు ఇలాంటి మంచి మనసున్న అమ్మాయి నా ఇంటి కోడలుగా రావాలని నా ఆశ అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదమ్మా కాబట్టి మీనా ని నా పెద్ద కొడుకు ఇచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చాను తల్లి అంటాడు సత్యం నా కొడుకు పెద్ద చదువులు చదివాడు తాను సాఫ్ట్వేర్ బిజినెస్ పెట్టుకోవాలని చూస్తున్నాడు నాకు వచ్చే రిటైర్మెంట్ డబ్బులు మొత్తం వాడికి ఇచ్చేస్తాను వాడు బిజినెస్ పెట్టుకుంటాడు నీ కూతుర్ని చాలా బాగా చూసుకుంటాడు ఇంటికి మొగదిక్కు ఉన్నట్టు ఉంటుంది అందుకనే నా మాట విను నీ కూతురికి నా కొడుక్కి పెళ్లి చేద్దామని అంటాడు సత్యం పార్వతి సంతోషపడుతూ వెళ్లబోతుండగా మీనా అమ్మ ఆగు తొందరపడకు అంటూ మాకు ఏ సానుభూతి ఏమీ అవసరం లేదండి మీ మంచితనం మీ దగ్గర పెట్టుకోండి మీ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి మాకు ఏ మగదిక్కుగా తోడు అవసరం లేదు

నా ఇంటికి నా తోడు మాత్రమే అవసరం ఉంది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు మీరు ఇంకోసారి ఇంటి వైపు రావద్దు ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి అంటుంది మీనా రంగయ్య అది కాదమ్మా ఒక్కసారి ఆలోచించండి ఆలోచించుకొని మాకు చెప్పండి వెళ్ళొస్తామంటూ వెళ్ళిపోతారు కట్ చేస్తే కామాక్షి దగ్గర సాంబయ్య తీసుకున్న చీటీ పైసల గురించి సాంబయ్య ఇంటికి బయలుదేరుతుంది దారిలో బాలు కలిసి ఏంటి కామాక్షిత ఎటు వెళ్తున్నావ్ అని అడుగుతాడు కామాక్షి ఎటు లేదు బాలు ఇదిగో గుడికి వెళుతున్నాను అంటుంది నేను డ్రాప్ చేస్తాను రా అత్త అంటాడు కామాక్షి బాలు ఆటోలు ఎక్కి వెళ్తుంది