Madhuranagarilo November 15 2023 Episode 210: ఏంటండీ రుక్మిణి అల్లుడుగారు భార్యగా ఒప్పుకున్న తర్వాత కూడా అతన్ని టార్చర్ పెడతాను వదిలిపెట్టను అని అంటుంది అని మురళి వాళ్ళ భార్య అంటుంది. పోనీ రుక్మిణికి రాధని పెళ్లి చేసుకున్నది నీ భర్త అని చెప్పేస్తే బాగుంటుందా అని మురళి అంటాడు. రుక్మిణికి చెప్పినా రాధకు చెప్పిన బాగోదండి పోనీ అల్లుడు గారికి చెపుదామా అని వాళ్ళ ఆవిడ అంటుంది. అల్లుడికి చెప్తే అసలు అర్థం చేసుకోడు వాళ్ళ అమ్మానాన్నకు చెబుదాము నా ఇద్దరి కూతుర్ల మెడలో నీ కొడుకు తాళి కట్టాడు ఇప్పుడు ఏం చేయమంటారు అని వాళ్ళని అడుగుదాము పద అని మురళి అంటాడు. కట్ చేస్తే, ఏంటండీ వీడు సడన్గా ఫారన్ కి వెళ్ళిపోతాను అంటున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం అండి అని మధుర అంటుంది. అత్తయ్య ఆ విషయం గురించి పక్కన పెట్టండి మేము ఎక్కడికి వెళ్ళము ఇక్కడే ఉంటాము అని ఒప్పిస్తానని మీకు రాత్రి చెప్పాను కదా, టిఫిన్ చేయండి టాబ్లెట్ వేసుకోవాలి టైంకి తిని టాబ్లెట్ వేసుకోపోతే మీ ఆరోగ్యం బాగోదు కదా అని రాధ అంటుంది.

ఇంకెక్కడి ఆరోగ్యం రాధ వాడు ఫారన్ కి వెళ్తాను అనగానే ఆరోగ్యం అంత అప్పుడే పాడైపోయింది మానసికంగా కృంగిపోతున్నాను అని మధుర అంటుంది. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా మురళి వాళ్ళ ఆవిడ ఇంటికి వస్తారు. రండి బావగారు ఇప్పుడేనా మీరు రావడం అని ధనుంజయ్ అంటాడు. రాధ మీ అమ్మా నాన్నకి మన ఇంట్లో జరిగే విషయాల గురించి చెప్పకు అని ధనంజయ్ అంటాడు. ఇంతలో ఆఫీసు నుంచి ఒక అతను వచ్చి సార్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. శ్యామ్ నిన్ను ఎందుకు ఇంటికి రమ్మన్నాడు అని ధనంజయ్ అడుగుతాడు. ఏదో ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలంట అందుకే రమ్మన్నాడు సార్ అని అతను అంటాడు. సరే పైన ఉన్నాడు వెళ్ళండి అని ధనంజయ్ చెప్తాడు. అతను శ్యామ్ దగ్గరికి వెళ్లిపోతాడు. ఏంటి రాధ మీరు పారన్ వెళ్తున్నట్టు మాకు ఒక్క మాటైనా చెప్పలేదే అని వాళ్ళ అమ్మ అడుగుతుంది.

అంటే అమ్మ వెళ్తున్నట్టు మాకు ఇప్పుడే తెలిసింది అందుకే మీకు చెప్పలేదు అని రాధ అంటుంది. ఇంత సడన్గా ఫారన్ కి వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చిందమ్మా అల్లుడుగారు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని మురళి అంటాడు. ఏదో పని పడి ఉంటుంది అందుకే వెళ్దాం అంటున్నాడు అల్లుడుగారు తన విషయాలు మనకేం తెలుస్తాయి చెప్పండి అని వాళ్ళ అమ్మ అంటుంది. కట్ చేస్తే, రాధ కాఫీ తీసుకొని శ్యామ్ దగ్గరికి వెళుతుంది. ఏవండీ కాఫీ తీసుకోండి అని అంటుంది రాధ . నాకేమీ అక్కర్లేదు అతనికి ఇవ్వు అని శ్యామ్ అంటాడు. అతను కాఫీ తాగి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే ఏంటండీ మీరు ఇలా చేస్తున్నారు అత్తయ్య మామయ్య గురించి ఆలోచించాల్సిన పనిలేదా నా గురించి ఆలోచించకండి కానీ పండు గురించి పండు ఆరోగ్యం గురించి ఆలోచించాలి కదా, మనం ఇక్కడి నుంచి ఫారన్ కి వెళ్ళిపోతే పండు ఆరోగ్యం ఎలా కుదుటపడుతుంది మా బావ ఎలా దొరుకుతాడు అని రాధ అంటుంది.

చూడు రాధ మనం ఫారన్ కి వెళ్ళినా మీ బావని హైదరాబాదులో వెతకడానికి మనుషులు పెడతాను పండుని ఎందుకు వదిలేస్తాను చెప్పు అక్కడికి వెళ్ళాక కూడా పండు ఆరోగ్యం కుదుటపడేలా చేసుకోవచ్చు అని అంటాడు. అది కాదండి నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి అని రాధ అంటుంది. ఇంక నేను ఏమీ వినను రాధ నా భార్యగా నువ్వు నా వెంట వస్తున్నావు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా వెనకాల రా నేను గంగలో దూకితే నువ్వు దూకు భార్యగా నీ బాధ్యత అని శ్యామ్ గట్టిగా అరిచి చెప్తాడు. శ్యామ్ అలా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటే పైకి వాళ్ళందరూ వస్తారు. ఏంట్రా శ్యామ్ రాధని గంగుల దూకమంటున్నవ్ పెళ్లి చేసుకున్నంత మాత్రాన నీ వెనకాల వచ్చి నువ్వు చెప్పినట్టు నిప్పుల్లో దూకాలా అని మధుర అడుగుతుంది.

నేను నిప్పుల్లో దూకమంట లేదమ్మా నా వెనకాల రమ్మంటున్నాను ఫారన్ కి వెళ్తే అందరం ఆనందంగా ఉంటాము అందుకే నిర్ణయం తీసుకున్నాను అని శ్యామ్ కోపంగా వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, ఏంటండీ వీడు ఇలా మాట్లాడుతున్నాడు రాధ వాళ్ళ అమ్మ నాన్నలు ఉన్నారని కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నాడు రాధని ఇంతలా బాధ పెడుతున్నాడు అసలేమైందండీ వీడికి అని మధుర అంటుంది. ఇంతలో మురళి వాళ్ళ ఆవిడ వచ్చి చూడమ్మా అల్లుడుగారు ఫారన్ కి వెళ్లాలి అంటున్నాడు అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది అదేంటో తెలుసుకుంటే సమస్య తీరిపోతుంది కదా అని ఆవిడ అంటుంది. తెలుసండి వాడు ఎందుకు అలా బాధపడుతున్నాడు ఎందుకు అలా చేయాలనుకుంటున్నాడో తెలుసు ఎందుకంటే వాడి మొదటి భార్యను వాడు చూశాడు తన జీవితంలోకి వస్తానని అంటుందంట అందుకే వాడు అంతలా భయపడిపోయి పండుని రాధని తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాడు,వద్దనుకున్న ఆ మహాతల్లి మళ్లీ వీడి జీవితంలోకి ఎందుకు వస్తుందో ఏమో ఆ మహాతల్లి నా కంటపడితే చంపి పారేస్తాను అని మధుర అంటుంది.

అమ్మో ఇంకా రుక్మిణి నా పెద్ద కూతురు అని చెప్పలేదు లేకుంటే ఏం చేసేదో ఏమో అని మురళి తన మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే,గిఫ్ట్ కొన్నానని ఆ సుందరానికి ఫోన్ చేసి చెప్తాను అని రుక్మిణి శ్యామ్ కి ఫోన్ చేస్తుంది. శ్యామ్ ఈ రాక్షసి మళ్లీ ఫోన్ చేస్తుంది ఏంటి అని ఫోన్ కట్ చేస్తాడు.ఫోన్ ఎత్తుతావా డైరెక్ట్ గా ఇంటికి రమ్మంటావా అని మెసేజ్ పెడుతుంది రుక్మిణి. అది చదువుకున్న శ్యామ్ తన ఫోను ఎత్తుతాడు. ఏంటి సుందరం ఫోన్ కట్ చేస్తున్నావ్ అని రుక్మిణి అడుగుతుంది. ఏయ్ ఎందుకు నాకు చీటికిమాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నావు అసలు నీకేం కావాలి అని శ్యామ్ అంటాడు. నీ జీవితంలోకి నేను మళ్ళీ రావాలి నువ్వు నన్ను భార్యగా స్వీకరించాలి అని అంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.