Brahmamudi అక్టోబర్ 2 ఎపిసోడ్ 232: నిన్నటి ఎపిసోడ్ లో కావ్య రాజ్ కలిసిబయటికి వెళ్లి రావడం,ఇంట్లో అందరూ రాజ్ ని ఆటపట్టించడం జరుగుతుంది.కొడుకు చేసిన పనికి అపర్ణాదేవికి కోపం రావడం, అసలు విషయం దాచి పెట్టి రాజ్ కావ్య తప్పించుకోవడంజరుగుతుంది. ఇక అప్పు వాళ్ళ ఇంటికి కళ్యాణ్ వెళ్లడం. కళ్యాణ్ కనకం వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంట్లో వాళ్లకు అబద్ధం చెప్పి అప్పు ని బయటికి తీసుకు వెళ్లడం జరుగుతుంది.

ఈరోజు 232 వఎపిసోడ్ లో అప్పు కళ్యాణ్ తో పాటు బయటకు వచ్చి చూసేసరికి కారులో అనామిక ఉంటుంది. ఇదేంటి నువ్వు ఎక్కడున్నావ్ అని అంటుంది అప్పు. చిన్న షాపింగ్ చేద్దామని వచ్చాము. నువ్వు కూడా మాతో వస్తే మా షాపింగ్ చాలా తొందరగా అయిపోతుందని అంటుంది అనామిక. కళ్యాణ్ వైపు కోపంగా చూస్తుంది అప్పు. అంటే నువ్వు నిజం చెప్తే రావేమోనని అలా చెప్పాను అని అంటాడు కళ్యాణ్. కానీ నిన్ను రమ్మంది మాత్రం మీ అమ్మకు చీరలు ఇవ్వడానికే మీ అమ్మ నిజంగా చీరలు తీసుకొని రమ్మంది ముందు షాపింగ్ కి వెళ్దాము తర్వాత నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను మీ అమ్మకు చీరలు ఇవ్వడానికే వెళ్దాం మనం అని అంటాడు. నువ్వు షాపింగ్ కి వస్తే నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అని అంటుంది అనామిక.నాక్కూడా చాలా సపోర్ట్ గా ఉంటుంది అంటాడు కళ్యాణ్ అప్పు కోపంగా చూస్తుంది అంటే షాపింగ్ కి సపోర్ట్ గా ఉంటుందని నా ఉద్దేశం, పద వెళ్దాం అని అంటాడు లోపలికి ఎక్కుతుంటే ముందు సీట్లో కూర్చో అప్పు అంటాడు కళ్యాణ్ అక్కడ రా మీ మధ్యలో నేను ఎందుకు కూర్చోండి అని అప్పుడు కోపంగా వెనుక సీట్ లో కూర్చుంటుంది. ఏదైతేనేమి నువ్వు అనుకున్నట్లు మన ప్లాన్ మీద అప్పు ని బయటికి తీసుకొచ్చావు అంటుంది అనామిక కళ్యాణ్తో ఇప్పుడు ఆ ప్లాన్ గురించి అవసరమా అంటాడు కళ్యాణ్.
Brahmamudi అక్టోబర్ 19 ఎపిసోడ్ 231: రాహుల్ ని బెదిరించిన మైఖేల్.. రాహుల్ దొంగతనం.. స్వప్న అనుమానం..

కోడల్నిమీద మాట పడనివ్వని మామగారు..
ఇక దుగ్గిరాల ఫ్యామిలీలో అందరూ ఇంట్లో కూర్చొని ఉంటారు హాల్లో, ఇక కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటేకావ్య డ్రెస్ చేంజ్ చేసుకొని చీర కట్టుకొని వచ్చి అందరికీ కాఫీ ఇస్తూ సారీ అత్తయ్య కాఫీ లేట్ అయింది అని అంటుంది. వెంటనే అపర్ణ ముందు తప్పు చేయడం ఎందుకు తర్వాత సారీ చెప్పడం ఎందుకు అని అంటుంది. వెంటనే సుభాష్ తప్పు చేసింది నీ కోడలు కాదు నీ కొడుకు ముందు అది తెలుసుకో అని అంటాడు. కోడల్ని మాత్రం ఒక్క మాట కూడా అన్ని బడి వదిన అన్నయ్య అని అంటుంది రుద్రాణి. అపర్ణాదేవి కాఫీ తీసుకుంటుంది అందరికీ కాఫీలు టీలు ఇచ్చి చకచకా పనిచేస్తూ ఉంటుంది కావ్య. కావ్య చేసే పని చూసిఇందిరా దేవి మురిసిపోతూ ఉంటుంది. సీతారామయ్య కావి చూడు ఎంత చక్కగా పనిచేస్తుందో అని అంటాడు. ఇక అందరూ ఒక లుక్కు కావ్య వైపే వేస్తారు కావ్య ఒక చేత్తో వంట చేస్తూ మరొక చేత్తో కాఫీ పెడుతూ కూరలు కట్ చేస్తూ చాలా హడావిడిగా వంటింట్లో అన్నీ తానే చేస్తున్నట్టుగా ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ సోఫాలో కూర్చొని కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తను రావడం గమనించినా కావ్య కాఫీ తొందరగా పెట్టాలి అని అనుకుంటుంది. అది చూసి సీతారామయ్య నువ్వు పెళ్లి అయిన కొత్తల్లో వచ్చినపుడు ఎలా అయితే ఉన్నావో ఇప్పుడు నా మనవరాలు కూడా అలానే అనిపిస్తుంది అని అంటాడు. అదంతా చూసి రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు.ఇక రాజ్ కావ్య పని చకచకా చేయడం చూసి అమ్మమ్మ వారి వాళ్ళు అంటున్నది నిజమే అన్నట్టుగా కావ్య వైపు చూస్తూ ఉంటాడు.
Nuvvu Nenu Prema: అపాయం నుండి బయటపడ్డ అరవింద.. పద్మావతి కి థాంక్స్ చెప్పినా అరవింద..

స్వప్న డబ్బులు అడిగిన రాహుల్..
ఇక కావ్య పని చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి కనకం వస్తుంది. వాళ్ళ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అన్నట్టుగా కావ్య దగ్గర నుండి కొన్ని ప్లేట్స్ తీసుకొని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది.వెంటనే అపర్ణాదేవి కనకం ఈ ఇంట్లో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి వాటిని నువ్వు పాడు చేయకు అని అంటుంది. ఇప్పుడు తనేం చేసింది వాళ్ళ అమ్మాయికి హెల్ప్ చేసింది అంతే కదా అంటుంది. మేమంతా హెల్ప్ చేయలేక నేను ఇక్కడ కూర్చుంది తను పనిచేస్తే తనకి ఇంట్లో లోటు పాట్లు ఏంటో అర్థం అవుతాయి. అంతేకానీ ఇవాళ నువ్వు హెల్ప్ చేస్తావ్ రేపు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి హెల్ప్ ఎవరు చేస్తారు అయినా నువ్వు స్వప్నం చూసుకోవడానికి వచ్చావు ఆ పనే చెయ్యి అని అంటుంది అపర్ణాదేవి కనకం సరే మీకు ఇష్టం లేకపోతే నేను చేయనులెండి అని అక్కడి నుంచి పైకి వెళ్తుంది. ఇక రాహుల్ ఫోన్లో లాయర్ తో మాట్లాడతాడు. బెయిల్ ఇప్పించాలి మైఖేల్ కి అని అంటాడు. దానికి చాలా ఖర్చవుతుంది అని అంటాడు ఎంత ఖర్చవుతుంది అంటే పది లక్షలు దాకా అవుతాయి మీరు డబ్బులు పంపిస్తే నేను బెయిల్ ఏర్పాట్లు చేస్తాను. సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను డబ్బులు అరేంజ్ చేస్తాను అంటాడు రాహుల్. స్వప్న దగ్గరికి వెళ్లి ఒక పది లక్షలు కావాలి అని అడుగుతాడు. మళ్లీ నా పని అయిపోగానే నీకు ఇచ్చేస్తాను ఒక రెండు రోజుల్లో ఇవ్వమని అడుగుతాడు మళ్ళీ ఏం తప్పు చేస్తున్నావ్ రాహుల్ అని అంటుంది స్వప్న.ఎప్పుడూ తప్పు చేస్తానని ఎలా అనుకుంటావు నాకు అవసరం కావాలి మళ్లీ ఈ నగలు ఇవ్వు తాకట్టు పెట్టి మళ్ళీ ఇస్తాను అంటాడు నకలు ఇస్తే రేపు శ్రీమంతానికి ఇబ్బంది అవుతుంది నేను ఇవ్వను అంటుంది.అయినా నువ్వు అంత డబ్బు అడుగుతున్నావు అంటే కచ్చితంగా ఏదో తప్పు చేయడానికి నేను మాత్రం ఈ నగలు ఇవ్వను అని లోపల పెట్టేసుకొని వెళ్ళిపోతుంది.
Krishna Mukunda Murari: మురారిని చంపేసిన ముకుంద వాళ్ళ అన్నయ్య.. కానీ, ఊహించని సూపర్ ట్విస్ట్..

రాహుల్ దొంగతనం బయటపడడం..
ఇగ రాహుల్ స్వప్న వెళ్ళిపోయిన తర్వాత ఆ నగలు అన్నిటిని బ్యాగ్ లో పెట్టుకొని స్వప్నకు తెలియకుండా కిందకు తీసుకొని వస్తూ ఉంటాడు. ఫోన్ మాట్లాడుకుంటూ రాజ్ రాహుల్ కి ఎదురవుతాడు. రాహుల్ వెంటనే రాజ్ ని చూసి కంగారు పడతాడు. రాజ్ రాహుల్ నువ్వు ఏంటి అలా ఉన్నావు అయినా ఆఫీస్ కి సరిగా వెళ్లట్లేదు అంట ఏంటి అని అంటాడు ఇంట్లో అందరూ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు. రాహుల్ అదేం లేదు నేను కొంచెం డిస్టర్బ్ గా ఉన్నాను వెళ్తాను అని అంటాడు మనం ఎలా ఉన్నా ఆఫీసులో పనులు ఆగవు కదా వెళ్లాలి అంటాడు రాజ్. ఇక సరే అని రాహుల్ తప్పించుకున్నాను అని అనుకొని కొంచెం ముందుకు రాగానే హాల్లో అందరి ముందు ఏమీ తెలియనట్టు ఆ నగల బ్యాగు తీసుకుని వెళుతూ ఉంటే రాజ్ మళ్లీ ఆపుతాడు.రాహుల్ ఒక్క నిమిషం అని అంటాడు ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరుగుతాడు రాహుల్ నీ చేతిలో ఆ బ్యాగ్ ఏంటి అని అంటాడు అయ్యా గుర్తుపట్టేశాడు అని అనుకుంటాడు.వెంటనే ప్రకాష్ రాహుల్ కొత్త డిజైన్స్ తీసుకొని వెళ్తున్నాడేమో లే అని అంటాడు. బతికించాడు దేవుడా అనుకొని అవును అన్నట్లుగా తల ఊపుతాడు రాహుల్ వెంటనే రుద్రాణి ఏంటి ఈ వీడియోలో దాస్తున్నట్టున్నాడు కంగారు పడుతున్నాడు ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏమున్నాయో అని అనుకుంటుంది మనసులో, అయితే కొత్త డిజైన్స్ ఒకసారి చూద్దాము మళ్లీ అట్లానే పెట్టేస్తాను ఇటు ఇవ్వు అని ప్రకాష్ రాహుల్ చేతిలో బ్యాగ్ లాక్కునే టైం లో అవి కింద పడిపోతాయి. ఇక ఇంట్లో అందరూ రాహుల్ ముందుకు వచ్చేస్తారు. ఏంటి ఈ నగలని ఎక్కడికి తీసుకు వెళుతున్నావ్ అని అంటాడు ప్రకాష్. దొరికిపోయాను అని రాహుల్భయపడుతూ కంగారుగా చూస్తూ ఉంటాడు.రాజ్ చూసి ఏంటి ఈ నగలన్నీ ఎక్కడివి అని అంటాడు. అక్కడే ఉన్న అపర్ణాదేవి ఇవన్నీ స్వప్నకి మామయ్య గారు ఇచ్చిన నగలు కదా అని అంటుంది. అందరూ అన్ని మాట్లాడుతున్నా కానీ రాహుల్ సైలెంట్ గా ఉంటాడు. ఇలా సైలెంట్ గా ఉన్నాడు అంటే అర్థం ఏంటి అని అంటుంది అపర్ణ. అక్కడే ఉన్నా కావ్య మీకు ఇంకా అర్థం కాలేదా తను నగలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్తున్నాడు అని అంటుంది. అలా అని నేనేం చెప్పలేదు కదా అని అంటాడు రాహుల్ అయితే మరి నిజమేంటో చెప్పు అంటారు ఇంట్లో వాళ్ళు అయినా రాహుల్ నిజం ఎలా చెప్పాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే రాజు ఇక రాహుల్ కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తాడు. నీకు అవసరమైతే నన్ను డబ్బులు అడిగి తీసుకోవాలి కానీ ఇది ఏంటి ఈ పనులు చేయడమేంటి నువ్వు మారావ్ అనుకో నీకు ఆఫీస్ బాధ్యతలు అప్పజెబితే నువ్వు ఇంకా మారకుండా దొంగలా పట్లనే ఉన్నావా అని అంటూ ఉంటే అప్పుడే కావ్య ఇంకా మీకు అర్థం కావట్లేదా అండి, తను మనల్ని డబ్బులు ఎందుకు అడుగుతాడు అడిగితే నేను చేస్తున్న తప్పు ఇది డబ్బులు ఇవ్వు అంటే మీరు ఇస్తారా అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు అంటుంది కావ్య.

భర్తను కాపాడిన భార్య..
ఇక కావ్య రాహుల్ ని అలా అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇస్తుంది స్వప్న ఆపండి అని అనుకుంటూ, ఇక వెంటనే రాహుల్ కి ఫీజులు ఎగిరిపోతాయి అమ్మో దీన్నే 10 లక్షలు అడిగాను ఇప్పుడు దాన్ నగలే నేను తీసుకు వెళుతున్నాను ఇంట్లో అందరి ముందు నిజం చెప్పేస్తుంది ఇప్పుడు నా పని అయిపోయింది అని మనసులో ఇంకా భయం పడుతూ ఉంటాడు. స్వప్న వచ్చి ఇంకా ఆపుతావా కావ్య అని అంటుంది. అయినా దొంగ అని అంటున్నారు మా ఆయన ఏం తప్పు చేశాడు నా భర్తని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను అని ట్విస్ట్ ఇస్తుంది స్వప్న. రాహుల్ కి ఏమీ అర్థం కాదు. ఇక నిందిరా దేవి మీ భర్తని మేమేం అనట్లేదు అమ్మ నీ భర్త మౌనంగా ఉంటున్నాడు సమాధానం చెప్పట్లేదు ఆ నగలు ఎందుకు తీసుకెళ్తున్నాడు అని మాత్రమే అడుగుతున్నాము అని అంటారు. సమాధానం చెప్పకపోతే దొంగ కింద కట్టేస్తారా, అయినా నువ్వు మాత్రం ఏంటి రాహుల్ ఈ నగలన్నీ నేనే కదా నీకు ఇచ్చింది మెరుగు పెట్టించుకుని తెమ్మన్నాను కదా అని కాపాడుతుంది స్వప్న. బతికించింది దేవుడా అని అనుకుంటాడు రాహుల్. ఏంటి నువ్వు నకలిచ్చావా అని అంటుంది అపర్ణ. అవున అత్తయ్య గారు నేను ఈ నగలు ఇచ్చి తనని మెరుగు పెట్టించుకు రమ్మన్నాను తను అయినా గోడ దూకేం వెళ్ళట్లేదు కదా రాజాల ఇంటి ముందు నుంచే వెళ్తున్నాడు నేను చెప్పాను కాబట్టి తీసుకెళ్తున్నాడు ఇందులో తన తప్పేముంది అని అంటుంది. వెంటనే ఇందిరా దేవి నగలు మెరుగు పెట్టించుకోవాలంటే వాడికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది మాతో ఒక మాట చెప్తే ఇంటికి పిలిపిస్తాను కదా అని అంటుంది. నేను ఇంత డ్రామా ఆడి ఇంత చేసిందా అంతా వేస్ట్ అయిపోయేలా ఉంది అని అనుకుంటాడు రాహుల్. దొరికింది చాన్స్ అని రుద్రాణి రెచ్చిపోతుంది.చూశారా అందరూ మా వాడిని దొంగ కింద కట్టారు ఈ కావ్య అయితే మరీను ఇందాకల వదలడా అలాగేవు కదా ఇప్పుడే సైలెంట్ అయిపోయావు నోరు పడిపోయిందా అంటుంది రుద్రాణి కావ్యతో, నా నోరేం పడుకోలేదండి మీ అబ్బాయి సైలెంట్ గా ఉన్నాడు అందుకే నిజం దాస్తున్నాడేమో అని మాట్లాడాను. ఇప్పుడు మాత్రం ఈ అబ్బాయి చెప్తే ఇవన్నీ జరిగేవి కాదు కదా మా వారు అడగంగానే మీ అబ్బాయి నిజం చెప్పి ఉంటే సరిపోయేది కదా అంటుంది. అయినా నేను మారానని మీ అందరికీ ఎలా చెప్పాలి అని రాహుల్ నటిస్తాడు. నేను ఆఫీస్ కోసం చాలా కష్టపడుతున్నాను ఇంకా నువ్వు నన్ను నమ్మట్లేదు రాజ్ అని అంటాడు రాహుల్. ఓకే అయిపోయింది ఏదో అయిపోయింది సారీ అని చెప్తాడు రాజ్. కొడుకు సారీ చెప్తే చూసి తట్టుకోలేక అపర్ణాదేవి వెంటనే అయినా మా వాడు అన్న దాంట్లో తప్పేముంది నువ్వు ఎక్కడికి ఈ నగలు తీసుకెళ్తున్నావంటే వెంటనే చెప్పి ఉండాల్సింది కదా అంటుంది.ఇక ఇందిరా దేవి అందరూ లోపలికి వెళ్ళండి రేపొద్దున నగలు వాడు వస్తాడు ఈ నగలు అన్ని భద్రపరచ స్వప్న మీరు ఇంట్లోనే పెడతాడు అని అంటుంది. ఎంత నటించిన ఛాన్స్ మిస్ అయింది అనుకుంటాడు రాహుల్.

రేపటి ఎపిసోడ్లో కావ్య నడుము నొప్పితో బాధపడుతూ ఉంటుంది. అది చూసి రాజ్ ఏమి పట్టనట్టు ఉంటే భార్య బాధపడుతూ ఉంటే కనీసం భర్తగా కొంచెం సహాయం చేయొచ్చు కదా అని అంటుంది. ఇక రాజ్ కావ్యకు నడుముకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు ఆ సీన్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది.