Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR” తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. “RRR”లో ఎన్టీఆర్ నటించిన కొమరం భీమ్ పాత్ర చాలామందిని ఆకట్టుకోవడం జరిగింది. దేశంలోనే కాదు విదేశాలలో ఈ పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా జపాన్ దేశంలో చాలామంది ఫిదా అయ్యారు. దీంతో అక్కడ ఎన్టీఆర్ కి ప్రత్యేకమైన పాపులారిటీ ఏర్పడింది. ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు ఎన్టీఆర్ జపాన్ లోనే కుటుంబంతో జరుపుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ “దేవర” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో ఇది 30వ సినిమా. “దేవర” రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. మొదటి పార్ట్ ఏప్రిల్ 5వ తారీఖు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్..గ్లింప్స్ వీడియో అందరిని ఆకట్టుకోవడం జరిగింది. “దేవర” గ్లింప్స్ వీడియో ఇండస్ట్రీలో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. అత్యధిక వ్యూస్ తో పాటు లైకులు సాధించిన గ్లింప్స్ వీడియోగా నిలిచింది. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కే ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న “దేవర” డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 150 కోట్లకు పైగా వెచ్చించటం జరిగిందంట.
దీంతో తాజా వార్తపై చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు ఎన్టీఆర్ కెరియర్ లోనే ఈ రీతిలో డిజిటల్ రైట్స్ ధర పలికింది మరొకటి లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా థియేటర్లలో విడుదలైన మూడు వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని టాక్. సముద్రం నేపథ్యంలో వచ్చే ఫైట్ సీన్స్ సినిమాకి హైలైట్ గా ఉంటాయని నిర్మాత కళ్యాణ్ రామ్ తెలియజేయడం జరిగింది. దీంతో “దేవర”పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!