Ennenno Janmala Bandham: నీకోసం కాకపోయినా కడుపులో బేబీ కోసమైనా తాగాలి కదా అని యష్ అంటాడు. కానీ నాకు ఇష్టం లేదని మీకు తెలుసు కదా అని వేద అంటుంది. ఇంకేమీ మాట్లాడకు పాలు తాగి పడుకో అని యష్ అంటాడు. సరేలే ఇలా ఇవ్వండి అని వేద పాలు తీసుకుని తాగుతుంది. గుడ్ గర్ల్ ఇప్పుడు పడుకో అని యష్ అంటాడు. మన విషయం అత్తయ్య గారి వాళ్లకి చెబుదామా ఎన్నాళ్ళని దాస్తాము డైనింగ్ టేబుల్ దగ్గర చూశారుగా పైగా అత్తయ్యకు ఈ విషయం చెబితే ఎంతో సంబరపడిపోతారు అని వేద అంటుంది. సరే చెబుదాంలే మంచి టైం చూసుకొని చెబుదాము కానీ నువ్వు ఈ లోపు చానా జాగ్రత్తగా ఉండాలి అని యష్ అంటాడు.కట్ చేస్తే అభి కారు వేసుకొని కైలాష్ వాళ్ళ ఇంటికి వస్తాడు. బ్రో ఎప్పుడొచ్చారు బ్రో అని కైలాష్ అంటాడు. ఎప్పుడో వచ్చాను గాని మిమ్మల్ని వెతకడానికి టైం అంతా వేస్ట్ చేశాను అని అభి అంటాడు.

మరి ఆ నీలాంబరి లేదా బ్రో అని కైలాష్ అంటాడు. ఉంది నీలాంబరి కూడా సాటి ఆడదే భర్తతో ఏ డిస్టబెన్స్ లేకుండా ఉండాలని అనుకుంటుంది ఇక ఆ విషయం వదిలేయ్ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి దెబ్బ తిన్నాను దెబ్బ తీయాలి టైం లేదు అన్ని చాలా ఫాస్ట్ గా జరిగిపోవాలి ఇక వెనక ముందు ఆలోచించేది లేదు ఒక్కొక్కరిని వేసేస్తూ వెళ్లడమే అని అభి కైలాష్ కి కొంత డబ్బును ఇచ్చి వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు. బాయ్ బ్రో అని కైలాష్ అంటాడు. కట్ చేస్తే వేద బట్టలు మడత పెడుతుంది. ఏం చేస్తున్నావ్ ఏంటి ఇవన్నీ సద్దడం నీకు అవసరమా ఇవి సద్దడానికి ఇంట్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు కాకపోతే నేను సర్దుతాను అంతేకానీ ఇది నువ్వు చేయడానికి వీలు లేదు ఇది నా ఆర్డర్ నువ్వు వట్టి మనిషివి కాదు అని యష్ అంటాడు. వట్టి మనిషిని కాదు కానీ గట్టి మనిషిని కాదంటారా అని వేద అంటుంది. ఒప్పుకుంటాను నీ మనోబలం చాలా గట్టిది ఆ కేసు విషయమే కదా నువ్వు అన్నావు చూడు నా ప్రెగ్నెన్సీ ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ అవ్వనివ్వను నేను మీకు బిడ్డని ఇస్తాను నేను తల్లి అవుతాను అని ఆ ధైర్యం ఇంకెవరికి ఉండదు కానీ రెగ్యులర్ వుమెన్ కి ఉన్నట్టు కాదు సో కాబట్టి వేదా కొన్ని నువ్వు మానేయకపోతే నేను భయపడాల్సి వస్తుంది ప్లీజ్ లేదా నన్ను భయపెట్టకు అని యష్ అంటాడు.

సరే నేను చూస్తాను మీరు ఏ పాటు చేస్తారు అని వేద అంటుంది. అలాగే చూద్దువు గాని రా అని యష్ వేదాన్నిర్చోబెడతాడు చూడు ఎలా చేస్తాను అని చకచకా బట్టలన్నీ మడత పెడతాడు బట్టలు అన్ని మడతపెట్టి కబోర్డ్లలో సర్ది పెడతాడు చూసావా ఐదు నిమిషాలలో ఎలా మడత పెట్టేశాను అని యష్ అంటాడు. మరి ఈ బెడ్ షీట్ అని ఎవరు మాట పెడతారు అని వేద అంటుంది. సరే మడత పెడతాను నువ్వు ఈ లోపు ఫ్రెష్ అప్ అయి రా అని యష్ వేదాన్నిఅంటాడు. సరే అని వేద ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. వేద అలా వెళ్ళగానే యష్ బెడ్ షిట్లు అన్ని మడత పెట్టేస్తాడు అమ్మయ్య బెడ్ షీట్లు కూడా అన్ని మడత పెట్టడం అయిపోయింది అని యష్ అనుకుంటాడు. ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన వేద వెనుకకు తిరిగి చూస్తుంది మీరు ఎంత మంచి వారండి అని అనుకుంటూ వెళ్ళిపోతుంది.కట్ చేస్తే గీత వసంత కి ఫోన్ చేస్తుంది హలో చెప్పు గీత అని వసంత్ అంటాడు. ఏంటి మాట్లాడే టైం కూడా లేదా అని గీత అంటుంది. అదేమీ లేదు చెప్పు అని వసంత్ అంటాడు. సరే ఎప్పుడు వస్తావు నీతో మాట్లాడాలిఏంటి ఇబ్బంది పడుతున్నావు మాట్లాడడానికి నేను తర్వాత చేయనా అని గీత అంటుంది.

ఏంటి తొందరగా రమ్మంటున్నావ్ ఏదైనా అర్జెంటా అని వసంత్ అంటాడు. ఏమీ లేదు నిన్ను చూడాలనిపిస్తుంది అంతే అని గీత అంటుంది. సరే బాయ్ అని వసంత్ అంటాడు. ఇంతలో చిత్ర అక్కడికి వస్తుంది వచ్చి ఫోన్ లాక్ కొని అందులో నెంబర్ చూస్తుంది లవ్ ఆఫ్ లైఫ్ అబ్బా క్యాన్సల్ చాలా బాగుంది ఎవరు లైఫ్ ఎవరి లవ్ నాకు తెలియక అడుగుతాను మీ మొగాళ్ళు ఎంతమందిని ప్రేమిస్తారేంటి నన్ను ప్రేమించావ్ దీన్ని ప్రేమించావు ఇంకా ఎంతమంది ఉన్నారు నీ లిస్టులో కానీ నువ్వు చాలా గొప్ప వాడివి అనుకున్నాను డ్రైవింగ్ నేర్చుకో డ్రైవింగ్ నేర్చుకో అన్నావు ఎందుకు నన్ను డైవర్ట్ చేయడానికి కదా అసలు ఎవరు ఇది ఎప్పటినుంచి నడుస్తుంది అసలు దీంతో ఎఫైర్ ఉన్న వాడివి నా వెనకాల ఎందుకు పడ్డావు మాట్లాడవేంటి అయినా ఎందుకు మాట్లాడతావ్ దొరికిపోయావు కదా అని చిత్ర అంటుంది.

చిత్ర మా మధ్య అలాంటిది ఏమీ లేదు అని వసంతం అంటాడు. మా మధ్య అలాంటిది ఏమీ లేదు అని నువ్వు చెబితే నేను నమ్మాలా కానీ నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు తీసుకో అని చేతులో ఫోన్ పెట్టేసి కోపంగా చిత్ర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే వేదా తల స్నానం చేసి బయటకు వస్తుంది. యష్ వేదాన్ని మంచం మీద కూర్చోబెట్టి తల ఇలా దులుపుతూ ఉంటాడు. అలా ఏస్ట్ తల దులుపుతుంటే వేద అప్పుడు పెళ్లి చేసుకునే అన్ని గుర్తుకు తెచ్చుకొని మనసులో సంతోష పడిపోతూ ఉంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది