NewsOrbit
Telugu Stories ట్రెండింగ్

Children’s Story: పిచుక గుణం | Pillala Kathalu

Children's Stories: Pillala Kathalu Todays Kids Story of an Innocent Sparrow
Share

Pillala Kathalu | పిచుక గుణం: గతంలో చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు పిట్ట కథలు, నీతి కథలు, పంచతంత్ర కథలు చెబుతుండే వారు. ఆ కథల వల్ల వారు ఎంతో ఆనందపడేవారు. చిన్న పిల్లలకు కథలు చెబుతూ నిద్ర పుచ్చే వారు. కానీ ఇప్పుడు సెల్ ఫోన్ యుగంలో పిల్లలతో సహా తల్లిదండ్రులు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. పిల్లలు సెల్ ఫోన్ ద్వారా వివిధ రకాల ఆటలతో కాలక్షేపం చేస్తుంటే, పెద్దలు ఛాటింగ్ చేయడం, వీడియోలు చూడటం లాంటివి చేస్తున్నారు. పిల్లలకు తరచు కథలు చెప్పడం వల్ల వాటిలోని నీతిని గ్రహిస్తారు. అందుకే పిల్లల మానసిక ఉల్లాసానికి వివిధ రకాల కథలను ‘న్యూస్ ఆర్బిట్’ అందిస్తొంది.

Children's Stories: Pillala Kathalu Todays Kids Story of an Innocent Sparrow
Childrens Stories Pillala Kathalu Todays Kids Story of an Innocent Sparrow

 

ఒకానొకప్పుడు ఒక ఊరిలో ఒక అమాయకపు పిచుక వుండేది. మనసులో ఏ కల్మషంలేని ఆ పిచుకకు ఒక రోజు ఒక కాకుల గుంపు పరిచయం అయ్యింది. ఆ కాకులతో పిచుకకి స్నేహం కుదిరింది. అయితే పిచుకకి అందరూ చెప్పారు – ఆ కాకులతో స్నేహం చేయద్దు, అవి మంచివి కావు అని, కాని ఆ పిచుక మాట వినలేదు. ఒక రోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచుకను కూడా తోడు రమ్మన్నాయి. అమాయక పిచుక ఎక్కడకి, ఎందుకు అని అడగకుండా, ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్లి అక్కడ మొక్కలన్నిటిని ధ్వంసం చేయ సాగాయి. పిచుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ వుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలెట్టారు. కాకుల గుంపుకు ఇది అలవాటే, అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచుక రైతులకు దొరికిపోయింది.

‘బాబోయ్! బాబోయ్! నా తప్పేమీ లేదు, నేను అమాయకురాలిని, నేనేమీ చేయలేదు, నన్ను వదిలేయండి!’ అని పిచుక రైతులను ప్రాధేయ పడింది. కాని పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచుక మాట నమ్మలేదు కదా, దాని వైపు అసహ్యంగా చూసి మరో రెండు దెబ్బలు వేసారు. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్దారించుకుంటారు. అందుకే మనం మంచి గా వున్న, మన స్నేహితులు చేడువారైతే మనం కూడా చెడ్డ వాళమనే అనుకుంటారు.


Share

Related posts

Curd: పెరుగుతో పంచదార కలిపి తినేముందు ఒక్కసారి ఇది తెలుసుకోండి..!

bharani jella

Virat Kohli: విరాట్ కోహ్లీ తన రికార్డులను సమం చేయటం పట్ల సచిన్ టెండూల్కర్ రియాక్షన్..!!

sekhar

ఆ దుకాణంలో చాయ్ ఖరీదు తెలిస్తే బెదిరిపోతారు… ఎందుకో తెలుసా?

Teja