Krishna Mukunda Murari: ముకుంద పరిస్థితి ఉండే కొద్ది దారుణంగా తయారవుతుందని.. కృష్ణ మురారితో పర్సనల్ గా చెబుతుంది.. తనని అలా వదిలేయడం కరెక్ట్ కాదు అని.. ముకుంద ను పట్టించుకోవాలని .. అందరితో కలిసి మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రం తనకి ఇవ్వాలని.. అప్పుడే తను ఆదర్శ్ లేడని లోటులో నిలిచి బయటకు వస్తుందని కృష్ణ అంటుంది. నువ్వు నిజంగా చాలా మంచి దానివి కృష్ణ అని మురారి కృష్ణని పొగుడుతాడు.

ఈ ఇంట్లో ఇప్పటివరకు నా మాటకి ఎవరు ఎదురు చెప్పలేదు అలాంటిది కొత్తగా వచ్చిన ముకుందా నా మాటలకు ఎదురు చెబుతుంది అందుకు కారణం నీ కోడలు కృష్ణ అని రేవతి ని చూస్తూ అంటుంది భవాని. ఇక సరిగ్గా అదే సమయానికి మురారి కూడా అక్కడికి వచ్చి నన్ను క్షమించు పెద్దమ్మ అనవసరంగా నేను మీకు ఎదురు తిరిగి మాట్లాడాను అని మురారి అంటాడు వీళ్ళందరూ మాట్లాడుకున్న మాటలను వింటున్న ముకుందా కిందకు వచ్చి నన్ను క్షమించండి రేవతి అత్తయ్య ఈ గొడవ అంతా చదవడానికి కారణం నేనే అని ముకుందా అంటుంది.

ఇక మురారి బయట నుంచి ఏదో బాక్స్ తీసుకోవడం తీసుకుని రావడం చూసినా ముకుందా.. ఎవరికీ ఏం తీసుకొస్తున్నావ్ అని అడిగితే నాకే షాపింగ్ చేసుకొని వస్తున్నాను అని మురారి అంటాడు. ఇందాక నీకోసమే నేను అత్తయ్య వాళ్ళ ముందు క్షమాపణలు చెప్పాను. రేవతి అత్తయ్య బాధపడటంతో పాటు పెద్ద అత్తయ్య నిన్ను అరవడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను రేవతి అత్తయ్యతే క్షమాపణలు చెప్పాను నా .మురారి ఎవరి ముందు తల దించుకోవడం నాకు ఇష్టం లేదు నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను ఎంతవరకైనా తెగిస్తాను అని ముకుందా అంటుంది.

మురారి కృష్ణ కోసం డాక్టర్ కోట్ స్కతస్కోప్ కూడా తీసుకొని తనకి సర్ప్రైజ్ ఇస్తాడు. ముకుంద మురారిని ఒకంట గమనిస్తూనే ఉంటుంది. కృష్ణ ఆ గిఫ్ట్ను తీసుకొని పక్కకు వెళ్ళగానే .. ముకుందా కాఫీ కప్పుతో మురారి దగ్గరకు వస్తుం.ది అదేంటి నువ్వు లోపలికి వస్తున్నావు అని మురారి అడుగుతాడు .

ఇక రేపటి ఎపిసోడ్లో కృష్ణ ఇంట్లో పని చేయడం లేదని రేవతి ఒక్కతే ఎంతసేపని ఇంట్లో పనులు చేసుకుంటుంది అని భవాని అడుగుతుంది. ఇక అప్పుడే అందరు చూపు కృష్ణ పై పడుతుంది. కృష్ణ చదువుకోవాలంటే ఇంట్లో పనులు కూడా చక్కబట్టాల్సిందే అని భవాని ఫైనల్ డెసిషన్ చెబుతుంది. అప్పుడే ముకుందా మనసులో ఇంట్లో పనులు చేయలేక కృష్ణ హాస్టల్ కి వెళ్ళిపోవాలి.. నాకు కావాల్సిం.ది అదే కదా.. అని తను కూడా కృష్ణ పై నాలుగు మాటలు అంటుంది.
