NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 25 2024  Episode 2138: ఆస్తి కాగితాలు దొంగిలించబడ్డాయని శాంభవికి తెలుస్తుందా లేదా.

Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights

Kumkuma Puvvu March 25 2024  Episode 2138: సంజయ్ వదిన అంజలి గురించి మనకు అందరికీ తెలిసిన విషయమే కదా తను హాస్టల్లో ఉంటుంది తను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందో మనకు తెలిసిందే హాస్టల్లో ఉన్న ఫ్రెండ్ కి ఫోన్ చేయడం కోసం నా గదిలోకి ఫోన్ అడగడానికి వచ్చింది అప్పుడే నువ్వు చూసి తప్పుగా అర్థం చేసుకునే బయటి నుంచి గడియ పెట్టావు అందరిని పిలిచి గోల చేస్తున్నావు అని చెబుతాడు. శాంభవి చూసావా మాధవి నా కొడుకు సంజయ్ ఏం చెప్పాడు అది జరిగిన విషయం ప్రతిదానికి వెనుక ముందు ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇంకోసారి ఊరుకునేది లేదు తోలు తీస్తాను జాగ్రత్త అంటుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights
Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights

చరణ్ రాజు ఒసేయ్ విన్నావు కదా మా తమ్ముడు చెప్పిన మాటలు ఇంకోసారి ఇలాంటి గొడవలు చేసేవనుకో నేనే నీ తోలు తీస్తాను అంటాడు మాధవిని. కావేరి కాదు మరి తాటి చెట్టు అంత ఎత్తు పెరగగానే సరిపోతుందా బుర్రలో కొంచెం గుజ్జు ఉండక్కర్లేదా ఇలా ప్రతిదానికి తప్పుడు అర్ధాలు తీస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు అంటుంది కావేరి. శాంభవి ఇక చాలు నా కొడుకు చెప్పాడు కాబట్టి నమ్ముతున్నాను ఇక ఈ గొడవ గురించి ఇక్కడే వదిలేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లిపోండి అంటుంది శాంభవి.

Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights
Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights

కట్ చేస్తే కావేరి అమ్మో అమ్మో అంజలి ఇంత పని చేస్తుందా ఇంత అర్ధరాత్రి టైంలో ఆ సంజయ్ గదిలోకి అంజలి ఎందుకు వెళ్లినట్టు అని అంటుంది అమృత వదిన నువ్వు కూడా ఆ మాధవిలాగే ఆలోచిస్తున్నావా అంజలి తప్పు చేసిందని నమ్ముతున్నావా అని అంటుంది కావేరి కాకపోతే ఏంటి మరి ఆరోజు సంజయ్ అంజి గదిలోకి వెళ్ళాడని మా బంటి గాడు చూసి లాగివాడిని చంప పగలగొట్టినందుకు సంజయ్ నా గదిలోకి రానే రాలేదు అని అబద్ధం చెప్పి నా కొడుకుని వాళ్ళందరూ ముందు చులకన చేసింది ఇప్పుడు తనేమో సంజయ్ గదిలోకి వెళ్ళింది అంటే ఏంటి దీని అర్థం మా బంటి గాడిని పిచ్చోన్ని చేసి మీ అంజలి ఆడే ఆటలు ఆడుతుందా అని అంటుంది కావేరి అమృత వదిన పిచ్చిపిచ్చిగా మాట్లాడకు నోటికి ఎంత వస్తే అంత అనేస్తావా అసలు మా అంజలి తప్పు చేస్తుందా సంజయ్ గదిలోకి అంజలి ఎందుకు వెళ్ళింది ఈ కారణం చేత వెళ్ళింది అని ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావేంటి అంటే నువ్వు చెప్పేది ఏంటి మీ కొడుకు తప్ప ఏమీ లేదు అంతా మా అంజలిదే తప్పు అంటావా అలా ఎప్పటికీ కాదు అసలు తప్పంతా బంటి దే బంటి వల్లే కదా మనందరం ఈ అజ్ఞాతవాసం చేస్తున్నాము బంటి నీ కాపాడడం కోసం మనల్ని కాపాడడం కోసమే కదా నా కూతురు ఇంత కష్టపడుతుంది

Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights
Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights

అవన్నీ పక్కన పెట్టేసి ఆ సంజయ్ గదిలోకి అంజలి ఎందుకు వెళ్ళింది అంటూ తప్పుడు కూతలు కూస్తావా అంటుంది అమృత. అరుణ్ కుమార్ అవును అక్కా నువ్వు అన్ని తెలిసి అంజలిని అలా అనుమానించడం నాకు నచ్చలేదు చ మీరు కూడా ఇలా అర్థం చేసుకుంటారని నేను అసలు అనుకోలేదు మా అంజలిని ఇంకా అనుమానిస్తూనే ఉన్నారా మీరు మీకు మనసు అనేది లేదా అంటుంది.
చంద్రం ఏంటి బామర్ది అక్కడికేదో మా బండి గాడే తప్పంతా చేసాడని మాట్లాడుతున్నారు మీ అంజలి ఆ లక్ష్మికి ఇచ్చిన మాట కోసం వెళ్లి ఆ సాగర్ ఇంట్లో సాగర్ భార్యగా నటించలేదా అప్పుడే నిజం చెప్పేస్తే ఇదంతా ఉండేదా అంటాడు. అమృత అందుకు కారణం కూడా మీ బంటి ఏ కదా అన్నయ్య ఆశ మాటలు వినడం వల్లే కదా నా కూతురు తో విడాకులు తీసుకున్నాడు ఆఖరికి ఏమైంది ఆశా చనిపోయింది మరి ఆశ కేసు నుండి బంటిని కాపాడడానికి గల నా కూతురు ఈ ప్రయత్నాలన్నీ మీరు అవి ఏమీ అర్థం చేసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇంకోసారి అన్నారే అనుకో నేను ఊరుకోను అంటుంది అమృత.

Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights
Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights

కట్ చేస్తే అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది అబ్బా మీ గొడవ ఆపుతారా గతాన్ని తవ్వుకుంటూ ఉంటే దంపతులు ఎవరు కలిసి ఉండలేరు మీరు మీరు గొడవలు పెట్టుకుని మా మధ్య దూరాన్ని పెంచుతారా ఏంటి ఇక చాలు ఆపండి అంటుంది అంజలి. అమృతఅది కాదమ్మా అంజలి మీ అత్తయ్య ఏమంటుందో తెలుసా సంజయ్ గదిలోకి ఎందుకు వెళ్ళింది అని ఆ మాధవిలాగే ప్రశ్నిస్తుంది అని చెబుతుంది అంజలి ఏంటి అత్తయ్య మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా నేను అలా ఎందుకు చేశాను కారణం తెలుసుకోనవసరం లేదా మా తాత జయచంద్ర గారు ఆస్తి కాగితాల మీద ఏమని వీలునామా రాశారు తెలుసుకోవడానికి నేను ఆస్తి కాగితాల కోసం శాంభవి గారి గదిలోకి వెళ్లాను అప్పుడే శాంభవి గారు రావడంతో తప్పించుకొని హడావుడిలో వచ్చి నా గది అనుకుని సంజయ్ గదిలోకి వెళ్లాను అప్పుడే మాధవి గారు చూసి తప్పుగా అర్థం చేసుకుని వెంటనే బయట నుండి గడియ పెట్టి అందరిని పిలిచి గోల చేశారు నా తంటాలు నేను పడుతుంటే మీరు మాత్రమే ఇలా గొడవలు పెట్టుకుంటారా ఎన్ని జన్మలకైనా ఎన్ని కష్టాలు వచ్చినా నా భర్త బంటినే అంటుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights
Kumkuma Puvvu Today Episode March 25 2024  Episode 2138 highlights

బండి చూశావా అది నా భార్య అంజలి అంటే మీరు ఊరికే గొడవలు పెట్టుకుని మా మధ్య దూరాన్ని పెంచకండి ఎన్ని జన్మలకైనా నా అంజలి నా భార్య నా భార్య ఎప్పుడూ తప్పు చేయదు దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అంజలి కావేరి దగ్గరికి వచ్చి ఇదిగోండి అత్తయ్య ఈ ఆస్తి కాగితాల కోసమే శాంభవి గారికి ఎదిలోకి వెళ్లాను ఇదిగోండి ఈ ఆస్తి కాగితాలు మీ దగ్గరే భద్రంగా దాచి పెట్టండి అని కావేరికి ఇస్తుంది అంజలి. కావేరి ఏంటి అంజలి 100 కోట్ల ఆస్తి నా చేతుల్లో పెడుతున్నావా అని షాక్ అవుతుంది కావేరి. కోట్ల విలువ చేసే నా కూతురే మీ ఇంటి కోడలు అయింది ఇంకా ఆ ఆస్తి కాగితాలు మాత్రం నీ దగ్గర ఉంటే తప్పేముంది వదిన అంటుంది అమృత.కావేరి వెంటనే మాట తిప్పేసి కాదు మరి ఎన్ని అనుకున్న ఎన్నెన్ని అనుకున్న మనం మనం ఒకటి కదా నా కోడలు బంగారం కాదేంటి అనుకుంటూ ఆస్తి కాగితాలను తీసుకువెళ్లి దాచిపెడుతుంది కావేరి

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri