Malli Nindu Jabili: మా మల్లి అదృష్టం చూసి అందరూ అసూయ పడిపోతున్నారు చూడండి అరవింద్ బాబు కుటుంబం అయితే మరీను కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని జగదాంబ అంటుంది.మా మల్లి జీవితానికి అరవింద్ బాబు తప్ప దిక్కు ఇంకెవరూ లేరని అనుకున్నారు అలా అనుకున్న వాళ్ళందరికీ చెప్పుతో కొట్టి సమాధానం చెప్పినట్టు అయింది అని మీరా అంటుంది.ఆ అరవింద్ బాబు మా మల్లి కి తాళి కట్టి వదిలేశాడు మల్లి కి ఇంకా మొగుడే రాడు అని అనుకున్నాడు కానీ తాళి కట్టడానికి మీరు ముందుకు వచ్చారు అని జగదాంబ అంటుంది.మా మల్లి అరవిందు బాబు భార్యగా ఆ ఇంట్లో పని మనిషి బతుకు అయిపోయింది మీరు మాత్రం మల్లి ని పెళ్లికి ముందే సొంత మనిషిలా చూసుకున్నారు అని మీరా అంటుంది.మీరు చేస్తున్నది మామూలు త్యాగం కాదు బాబు అని జగదాంబ అంటుంది.

అవును బాబు గారు మా మల్లి జీవితం ఏమైపోతుందో అని నేను మా అమ్మ ఎంతో బాధ పడే వాళ్ళం మా మల్లి పాలిట వరాన్ని ప్రసాదించారు బాబు గారు అని మీరా అంటుంది.ఇక ఆపండి నీకు అరవింద్ తో పెళ్లయిందా అని గౌతమ్ అడుగుతాడు.అవును బాబు గారు అని మల్లి అంటుంది. అరవిందు ఇంట్లో ఉండి చదువుకున్నాను అని చెప్పావు కానీ అరవింద్ తో పెళ్లి అయిందని చెప్పలేదేంటి అని గౌతమ్ అంటాడు.అదేంటి బాబు గారు మీకు ఇచ్చిన లెటర్ లో అంత రాసి పెట్టాను కదా కానీ ఇప్పుడు ఏంటి మీకు ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు అని మల్లి అంటుంది. అయితే ఎక్కడో పొరపాటు జరిగింది బాబు గారు అని జగదాంబ అంటుంది. పొరపాటు కాదు ప్లాన్ గా చేశారు కళ్యాణ మండపం వరకు వచ్చేస్తే కాదనకుండా తాళి కట్టేస్తానని అనుకున్నారు మీరు అంతా కలిసి నన్ను మోసం చేశారు నా మంచితనాన్ని ఇంత చులకనగా తీసుకుంటారా అని గౌతమ్ అంటాడు.

బాస్ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు ఏమైంది మీకు అని మల్లి అంటుంది. అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు చూపిస్తాను రా అని మల్లి ని తీసుకువెళ్లిపోతాడు గౌతం. బాస్ గారు నేను చెప్పేది వినండి అని మల్లి అంటుంది. అవేమీ పట్టించుకోకుండా గౌతమ్ లాక్కొచ్చి ఫంక్షన్ హాల్ లో పడవేస్తాడు మల్లి ని. గౌతమ్ ఇలా ఎందుకు చేసావు అని శరత్చంద్ర అడుగుతాడు. ఈ పెళ్లి జరగదు అని గౌతమ్ అంటాడు. గౌతమ్ ఏమైంది రా నీకు ఇలా మాట్లాడుతున్నావ్ అని వాళ్ళ అమ్మ అంటుంది. మనం మోసపోయాం అమ్మ మల్లి కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది నమ్మలేకపోతున్నారు కదా కానీ ఇది నిజం అని గౌతమ్ అంటాడు. ఎవరో నీకు అబద్ధం చెప్పి ఉంటారు అని కౌసల్య అంటుంది. చెప్పింది ఎవరో కాదు వీళ్లే పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు నా శత్రువు అయిన అరవిందునే నీకు అరవిందుకు ఇంతకుముందే పెళ్లి అయినా విషయం అందరి ముందు చెప్పు అని గౌతమ్ అడుగుతాడు .

అవును బాబు గారు జరిగింది అని మల్లి ఒప్పుకుంటుంది. ఇలా ఎందుకు చేస్తున్నావ్ గౌతమ్ నా కూతురు పెళ్లికి ముందే నీకు లెటర్లో రాసి ఇచ్చింది కదా అబద్ధం ఎందుకు ఆడుతుంది అని శరత్ చంద్ర అంటాడు. ఆ లెటర్ లో అవేమీ లేవు అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది ఏమో నాకేం తెలుసు మొగాళ్ళని ఈ విధంగా మారుస్తుంది అని గౌతమ్ అంటాడు. నోరు ముయ్ గౌతమ్ అని శరత్చంద్ర చేయి లేపుతాడు. నువ్వు నా మీదే చెయ్ లేపుతావా నీకు నేను ఏ మాత్రం తీసుకోను చూసుకుందామంటే చూసుకుందాం రెడీనా అని గౌతమ్ అంటాడు. ఏమే నువ్వు ఇంత మోసం చేస్తావా మమ్మల్ని అని కౌసల్య అంటుంది. పెళ్లికి ముందు గౌతమ్ బాబు గారికి నా గురించి తెలియాలని మా అందరికీ చెప్పి మీ దగ్గరికి వచ్చింది అని జగదాంబ అంటుంది. మీరు ఆరోజు లెటర్ అంతా చదివి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అని నేను ఒప్పుకున్నాను లేదంటే నేను ఒప్పుకునే దాన్ని కాదు అని మల్లి అంటుంది. అంత అబద్ధం చెప్తున్నావు అని గౌతమ్ అంటాడు. మల్లి అబద్ధాలు ఆడదు అబద్ధం ఆడేది అయితే తనకు ఇన్ని కష్టాలు రావు మల్లి మంచితనం ముందు ఇక్కడున్న ఆడవాళ్ళు ఎవరు సరిపోరు మల్లి గురించి తప్పుగా మాట్లాడొద్దు అరవిందు నిన్ను పదే పదే ఎందుకు హెచ్చరించేవాడో ఇప్పటికైనా అర్థమైందా మల్లి ఇది గౌతమ్ అసలు రూపం ఈ మనిషి ఆదర్శవంతుడని అందరూ పొగిడారు కదా ఇతన్ని పెళ్లి చేసుకొని నువ్వేం బాగుపడతావు చెప్పు పెళ్లి తర్వాత బయటపడవలసిన ఇతని నిజస్వరూపం ఇప్పుడే బయటపడింది ఇప్పటికైనా మించి పోయింది లేదు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో అని అరవింద్ వాళ్ళ అక్క అంటుంది.

నువ్వు నోరు ముయ్యవే మంచి నిర్ణయమా ఏంటి ఈ పెళ్లి ఆపుకొని మరో ఇంటి మీద పడుతుందా మాలిని కాపురం కూల్చినట్టు మరో ఇంటిని కూల్చాలని చూస్తుందా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. చూడు గౌతమ్ అరవింద్ కు తనకి పెళ్లి అయినా మా ఇంట్లో పని మనిషి గానే ఉంది కానీ ఎప్పుడు కోడలుగా లేదు అరవిందు మల్లి ల పెళ్లి నేలకొండపల్లిలో ఏదో ఒక యాక్సిడెంట్ గా అయింది పెళ్లి విషయం మాకు కూడా చాలా లేటుగా తెలిసింది మల్లి ని అపార్థం చేసుకోకు అని వాళ్ళ నాన్న అంటాడు. నువ్వు పెద్ద మనసు చేసుకొని మల్లి ని పెళ్లి చేసుకుంటున్నావు అని మేమందరం చూడడానికి వచ్చాము కాస్త పెద్ద మనసు చేసుకో బాబు మా మల్లి మేలిని బంగారం అని వాళ్ళ నాయనమ్మ అంటుంది. వింటున్నాను కదా అని మరీ చులకనగా చూడకండి అరవింద్ తో బైకుల మీద తిరిగింది అరవింద్ ఎప్పుడు చూసినా ఈ మల్లి తో తిరుగుతూ ఉండేవాడు అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదు మల్లి పవిత్రమైనది అని అంటే నేను నమ్మాలా అని గౌతమ్ అంటాడు. ఎందుకు చేసుకుంటాడు నా కొడుక్కి పెళ్లి సంబంధాలే రావ అంటారా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని కౌసల్య అంటుంది. నా కూతురికి నీవల్ల కొత్త జీవితం రాబోతుందని ఎంతో సంతోష పడిపోయాను తన బతుకులోకి వెలుగులు వస్తాయి అని అనుకున్నాను నా కూతురు బతుకుని చీకటి చేయకండి బాబు గారు అని మీరా బ్రతిమిలాడుతుంది.
ఎవరు ఏం చెప్పినా నేను మల్లి ని చేసుకోను మీ ఇద్దరి మధ్య తాళి బంధం ఉందని నేను అస్సలు అనుకోలేదు అరవింద్ దగ్గరికి వెళ్ళిపో అని గెంటేస్తాడు. నో ఇలా జరగకూడదు ఇదంతా కల ఇలా అసలు జరగకూడదు అని మాలిని అనుకుంటుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు ఉంది అక్క అని మల్లి అంటుంది.గౌతమ్ విశాల హృదయంతో నిన్ను చేసుకోవడం నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది అంతా మన మంచికే జరుగుతుందని ఒక అక్కగా నేను నీకు చెబుతున్నాను అని మాలిని అంటుంది. గౌతమ్ నా జీవితంలోకి రావాలని ఆ సీతమ్మ తల్లి అనుకుందో ఏమో అందుకే ఇలా జరుగుతుంది అని మల్లి అంటుంది. మల్లి నీ జీవితం ఇక నుంచి ఈ బంగారం లా ఉండాలని అరవిందు ఈ గాజులు సెలెక్ట్ చేశాడు కానీ అరవింద్ పెళ్లికి రాలేదు అని మాలిని అంటుంది. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్లీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం