Malli Nindu Jabili ఆగస్టు 15 ఎపిసోడ్ 423: మల్లి నిండు జాబిలి ఈ రోజు ఆగష్టు 15 ప్రత్యేక ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది…నా కోసం చాలా త్యాగం చేశాను అన్నావు కదా చివరి త్యాగంగా ఈ అక్క కోసం గౌతమ్ నీ పెళ్లి చేసుకుంటావా లేదా అని ఆఖరి సారిగా అడుగుతున్నాను చేసుకుంటావా లేదా అని మాలిని అంటుంది. అక్క ఎవరు ఎన్నిసార్లు అడిగిన నేను చేసుకోలేను అని మల్లి అంటుంది. సరే మల్లి ఒక పని చెయ్ నన్ను ఈ గన్ తో కాల్చుకొని చనిపోమంటావా లేకపోతే ఈ విషయం మింగి చనిపోమంటావా లేదన్న తాళిని తీసినకిచ్చేమంటావా ఈ మూడింటిలో ఏది చేయమంటావు అని మాలిని అడుగుతుంది.

నేను చచ్చిపోతే అరవింద్ నీ వాడు అవుతాడు ఈ అగ్రిమెంట్ చించేసి తాళి ని నిన్ను మెల్లో వేసుకొని నీ భర్తతో నువ్వు హాయిగా జీవితాంతం ఉండొచ్చు అని మాలిని అంటుంది. అక్క ఏంటి అక్క ఇది ఇలా మాట్లాడడం అన్యాయం అక్క అని మల్లి అంటుంది. సరే నువ్వు అన్యాయం అయిపోవద్దు నా గురించి మాత్రం ఆలోచించొద్దు అని గన్ను తీసుకొని తలకు పెట్టుకుంటుంది. రావద్దు అడుగు ముందుకేస్తే కాల్చుకొని చచ్చిపోతాను అంటుంది మాలిని. ఏంటక్కా ఈ పిచ్చి పనులు అని మల్లి అంటుంది.

చెప్తావా షూట్ చేసుకోమంటావా అని మాలిని అడుగుతుంది. నువ్వేం చేసుకోవద్దు నువ్వు అరవింద్ బాబు గారితో సంతోషంగా ఉండడమే నాకు కావాలి గౌతమ్ సార్ నీ పెళ్లి చేసుకుంటాను నువ్వు ఏం చేసుకోవద్దు అక్క నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అక్క నాకు కొంచెం సమయం ఇవ్వు అని మల్లి అంటుంది. నువ్వు ఇక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటా ఈ రాత్రికి నువ్వు నిర్ణయం తీసుకొని తెల్లవారేసరికి గుడ్ న్యూస్ చెప్పు అని మాలిని అంటుంది. మల్లి ఏడుస్తూ కూర్చుంటుంది.

నేనిలా ప్రవర్తిస్తే కానీ దారిలోకి రావు అందుకే ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది నా అరవింద్ కోసం అని మాలిని తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే, మల్లి తో పెళ్లి విషయం తొందరపడి అడిగేసానా మల్లి తన అభిప్రాయం ఇంకా చెప్పలేదు తను ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది అని గౌతమ్ అనుకుంటాడు. అనవసరంగా గౌతమ్ ని రెచ్చగొట్టాన, నేను రెచ్చగొట్టడం వల్ల పెళ్లి చేసుకుంటానన్నాడా లేదంటే అంతకుముందే తీసుకున్న నిర్ణయమా అని అడగను అనుకుంటాడు.

గౌతమ్ సార్ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఆయనకు నా గతం తెలియదు కాబట్టి అలాంటి నిర్ణయానికి వచ్చారు తెలిస్తే ఆ అభిప్రాయం కచ్చితంగా మార్చుకుంటారు నాకు అరవింద్ బాబు గారికి పెళ్లి అయిన విషయం ఇంతకాలం ఆయన దగ్గర దాచాను ఇంకా దాచకూడదు వెంటనే చెప్పాలి లేదంటే ఉద్యోగంతో తొలిమెట్టు ఎక్కించి నీడ లేనప్పుడు ఆశ్రయం ఇచ్చిన మనిషిని నేను మోసం చేసిన దానిని అవుతాను అని మల్లి గౌతమ్ కి ఫోన్ చేస్తుంది. అక్కడే ఉండి పోయావ్ ఏంటి ఇంటికి రావా అని గౌతమ్ అడుగుతాడు. ఈరోజు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాను అని మల్లి అంటుంది. సరే నాతో ఏదైనా మాట్లాడాలా అని గౌతమ్ అడుగుతాడు.

నా గురించి మీకు చెప్పాలి అని మల్లి అంటుంది. పెళ్లి గురించి అయితే చెప్పు నీ గురించి అయితే అవసరం లేదు ఎందుకంటే నీ గురించి నాకు తెలుసు కాబట్టి, నిన్ను చేసుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే, తొందరగా మన పెళ్లి గురించి చెప్పు సరేనా గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేస్తాడు గౌతం. గౌతమ్ సార్ కి నా గురించి చెప్పాలనుకున్నాను కుదరలేదు నా గతం గురించి తెలియక సార్ నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు నా వల్ల ఆయన ఇబ్బంది పడకూడదు ఎలాగైనా నా గతం తెలియాలి అని లెటర్ రాస్తుంది. ఈ లెటర్ మీకు నేను రేపు ఇస్తాను అని మళ్ళీ అంటుంది.అందరూ మళ్లీ కోసం హాల్లో వెయిట్ చేస్తుంటారు. మల్లి వచ్చి నేను గౌతమ్ సార్ కి నిజం చెప్పాలి అని అంటుంది. ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియకుండా ఉంటుందని మాలిని అంటుంది. తెలుసో తెలియదో మనకు తెలియదు చెప్పడం అయితే మన ధర్మం అని మల్లి అంటుంది. చెప్పాలమ్మా ఒకవేళ పెళ్లి చేసుకున్న తర్వాత నిజం తెలిస్తే మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది అని మీరా అంటుంది.