Janaki Kalaganaledu: మీ నాన్న అడగొద్దని అన్నారు కానీ నా కొడుకుల మీద నాకు నమ్మకం ఉంది అని నేను అడుగుతాను నాకు అండగా నిలబడతారు నా కూతురు పెళ్లి జరిపిస్తారు అని జ్ఞానాంబ అంటుంది. చెల్లెలి పెళ్లి నేను జరిపిస్తానమ్మ చెల్లె కళ్ళల్లో కన్నీటి చుక్క కూడా కనిపించకూడదు అని రామా అంటాడు. అవును అత్తయ్య మీకు అండగా మేముంటాము అని జానకి అంటుంది. మా సంగతి నేను చెప్పాను కదా పెళ్లి ఖర్చులు 10 లక్షలు అంటారు ఇచ్చే కొడుకులు ఉన్నారు కదా అని పెంచుకుంటూ పోతారు చివరికి తడిసి మోపెడు అవుతుంది అని మల్లిక అంటుంది. కావాలని ఎవరు మాత్రం ఎందుకు పెంచుతారు మల్లిక అక్క అని జెస్సి అంటుంది.

మా షాప్ కి వచ్చే కష్టమర్స్ కూడా వెయ్యి రూపాయల చీర చూపించమని అడుగుతారమ్మ చివరికి 5000 పెట్టి చీర కొనుక్కొని బయటికి వెళ్తారు మనసుని అదుపులో పెట్టుకోవడం ఎవ్వరికీ చేతకాదు అని మల్లిక అంటుంది. అది కాదు మల్లిక అని వాళ్ళ ఆయన అంటాడు. మీరు తలవంచుకొని ఫోన్లో మెసేజ్లు చూసుకోండి నేను మాట్లాడుతున్నాను కదా అని మల్లిక అంటుంది.అఖిల్ మాట్లాడు అత్తయ్య గారు నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు అని జెస్సి అంటుంది.ఏమని సమాధానం చెప్పమంటావు జెస్సి తాబేలు నడకల నా సంపాదన ఉంటే కుందేలు నడకల నా ఖర్చు ఉంది కాబట్టి నేను ఏం మాట్లాడగలను అని అఖిల్ అంటాడు. అందరూ మాటలు విన్న జ్ఞానాంబ అక్కడి నుండి లేచిపోతుంది.

ఆగు జ్ఞానం నీళ్లలో ఉన్నంతవరకే చాప ఈద గలుగుతుంది నీళ్లలో నుంచి బయటపడ్డాక గిలగిల కొట్టుకుంటుంది మన దగ్గర డబ్బు ఉంటేనే తండ్రిగా ఇంట్లో చలాయించుకోగలుగుతాడు లేకపోతే ఒడ్డున పడ్డ చేపల ఇంతే మన పరిస్థితి అని గోవిందరాజులు అంటాడు. నాన్న మీరు అలా మాట్లాడకండి నాకు బాధగా ఉంటుంది ఇంటి పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు నుంచి నేను తప్పుకోను అని రామ అంటాడు. ఉమ్మడిగా చేయవలసిన బాధ్యత నేను నీ ఒక్కడి నెత్తిమీద ఎందుకు వేస్తాను రా అని గోవిందరాజులు అంటాడు. ఎందుకంటే మనకి తల కొరివి పెట్టేది వాడే కదండీ అని జ్ఞానాంబ అంటుంది. చెల్లెలి పెళ్లి గురించి మీకు అవసరం లేదు చెల్లెలి పెళ్లి నేనే చేస్తాను అని గోవిందరాజులు అంటాడు. అంత డబ్బు మీ దగ్గర ఎక్కడిది నాన్న అని రామా అంటాడు. ఏం లేదురా ఇంటిని అమ్మేద్దాము అని అనుకుంటున్నాను అని గోవిందరాజులు అంటాడు. అందరూ కలిసి చెల్లెలి పెళ్లి చేస్తారా లేదంటే ఇల్లును అమ్మేసి పెళ్లి చేయమంటారా? ఏదో ఒకటి చెప్పండి అని జ్ఞానంబ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నాకు పెళ్లి వద్దు వదిన నేను కిషోర్ కి ఫోన్ చేసి చెబుతాను నేను అందరికీ బరువు అవుతున్నాను అని వెన్నెల ఏడుస్తుంది. వెన్నెల నువ్వు ఎప్పుడు అలా బాధపడకు నువ్వు నా మీద బాధ్యత పెట్టావుగా డబ్బు ఏదో ఒక రకంగా పుట్టుకొస్తుంది నీ పెళ్లి జరుగుతుంది నువ్వు హాయిగా అత్తారింటికి వెళ్లిపోవచ్చు అని జానకి వెన్నెలకి నచ్చచెప్పుతుంది పెళ్లి విషయం గురించి నాకు వదిలిపెట్టు షాపింగ్ సంగతి నువ్వు చూసుకో సరేనా అని జానకి వెళ్ళిపోతుంది.

ఏమండీ ఏం చేస్తున్నారు ఏదో రాస్తున్నారు ఏంటి అని మల్లిక వాళ్ళ ఆయనని అడుగుతుంది. ఏమీ లేదు అని రాసి పేపర్ తీసి కాలి కింద పెట్టుకుంటాడు వాళ్ళ ఆయన. నా దగ్గర దాపరికాలా చూపించండి అని పేపర్ లాక్కుంటుంది మల్లిక ఆ పేపర్ ని తీసి చూస్తుంది ఏంటి మీ చెల్లెలి పెళ్లి కోసం లెక్కలు వేస్తున్నారా అని అడిగింది. అది కాదు మల్లిక వాళ్ళ పరిస్థితి వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ల ఆయన అంటాడు.అది సరే నాకు రవ్వల నెక్లెస్ చేపిస్తాను అన్నారు కదా దాని సంగతేంటి అని మల్లిక అడిగింది.అది జరగని పని అని నీకు కూడా తెలుసు కదా అని వాళ్ళ ఆయన అంటాడు. పెళ్ళానికి రవ్వల నెక్లెస్ చేపించడం చేతకాదు కానీ చెల్లెలి పెళ్లికి మాత్రం లెక్కలు వేస్తున్నాడు కూతురు పెళ్లి చేతకానప్పుడు నలుగురు పిల్లల్ని ఎందుకు కన్నట్టు ఇదేమన్నా రిజర్వ్ బ్యాంకు అనుకుంటున్నారా ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదు దానాలు ధర్మాలు చేయడం మన వల్ల కాదు కావాలంటే శ్రమదానం చేద్దాం కాదు కూడదు సహాయం చేసి తీరాల్సిందే అని అంటే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి ఆపైన నా కూతుర్ని తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని మల్లికా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే అఖిల్ జరిగేది మీ చెల్లె పెళ్లి ఏమి పట్టనట్టు అలా కూర్చుంటే ఎలా అని జెస్సి అంటుంది.

నేను చెప్పాల్సింది చెప్పేసాను కదా జెస్సి అని అఖిల్ అంటాడు. అంటే ఏంటి మీ చెల్లెలి పెళ్లికి నీకు బాధ్యత లేదా అని జెస్సి అడిగింది. బాధ్యత ఉంటే శక్తికి మించిన బరువుని నెత్తిన పెట్టుకోలేము కదా అని అఖిల్ అంటాడు. అదే మాట మామయ్య గారు నీ గురించి అనుకొని ఉండి ఉంటే ఏం చేసేవారు మీ పెద్దన్నయ్య అనుకోని ఉంటే వాళ్ల శక్తిని మించి నీకు చేయలేదా ఆ కృతజ్ఞతతో ఐనా నువ్వు చేయాలి అఖిల్ అని జెస్సి అడిగింది. ఇంట్లో వాళ్ళు నాకు శత్రువులు కాదు జెస్సి నా దగ్గర అంత డబ్బు లేదు అని అఖిల్ అంటాడు. ఇంట్లో వాళ్ల మీద ప్రేమ ఉంది అంటావు అవసరానికి పనికిరాని ప్రేమ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని జెస్సి అంటుంది. చూడు జెస్సి దాని గురించి మనిద్దరం గొడవ పడాల్సిన పనిలేదు ఇల్లు అమ్మి పెళ్లి చేస్తానన్నారు కదా చేయని అని అఖిల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.ముగ్గురం అన్నలం ఉండి కూడా చెల్లెలి పెళ్లి చేయలేక తన చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాం అని రామ బాధపడతాడు. దేనికైనా సమయం ఉండాలి కదండీ రేపటి వరకు సమయం ఇచ్చారుగా మారుతారేమో చూద్దాం అని జానకి అంటుంది. కట్ చేస్తే ఏంటండీ పేపర్లు తీశారు పిల్లల మీద మీకు నమ్మకం లేదా అని జ్ఞానంబ అంటుంది. ఎందుకు లేదు ఇల్లు తాకట్టు పెడతానన్నారుగా పెట్టుకోండి నాన్న అని అంటారు అని నమ్మకం ఉంది అని గోవిందరాజులు అంటాడు. కట్ చేస్తే దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం