NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: గౌతమ్ కి అడ్డంగా దొరికిపోయిన మల్లి అరవింద్ వ్యవహారం…అది చూసి ఆనందంలో వసుంధర!

Malli Nindu Jabili Today December 4th 2023 Episode 511 Highlights

Malli Nindu Jabili December 04 2023 Episode 511: అలా టెన్షన్ పడుతున్న గౌతమ్ మళ్ళీ ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడతాడు. అరవింద్ మల్లి లకు పెళ్లయిందని నాకు చూపించడానికి ఎవరు ఇలా ప్రయత్నిస్తున్నారు నా టేబుల్ మీద ఎవరు పెట్టి ఉంటారు ఈ సర్టిఫికెట్ ఎవరికి ఏమి అవసరం అసలు ఇది నిజమా అబద్దమా ఏమి అర్థం కావట్లేదు అంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్ ని కింద పడేస్తాడు గౌతమ్. అప్పుడు వసుంధర మ్యారేజ్ సర్టిఫికెట్ మల్లి టేబుల్ మీద పెట్టింది కింద పడిపోతుంది. అది చూసి గౌతమ్ ఏంటి అని ఓపెన్ చేసి చూస్తాడు.

Malli Nindu Jabili Today December 4th 2023 Episode 511 Highlights
Malli Nindu Jabili Today December 4th 2023 Episode 511 Highlights

అందులో అరవింద్ మల్లి నేలకొండపల్లిలో పెళ్లి చేసుకున్న మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటుంది. అది చూసి గౌతమ్ హాస్పిటల్ లో ఉన్న రిజిస్ట్రేషన్ పేపర్ మ్యారేజ్ సర్టిఫికెట్ రెండు ఒక దగ్గర పెట్టి చూసి అసలేం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇదంతా ఎవరొ కావాలని చేస్తున్నారు నాకు పిచ్చెక్కిపోతుంది అంటూ కోపంతో రగిలిపోతాడు గౌతమ్. ఇప్పుడు కదా మజా వస్తుంది గౌతమ్ ఇన్ని రోజులు విడిచిపడ్డావు కదరా ఇది శాంపిల్ మాత్రమే ముందు ముందు ఉంటుంది సినిమా ఇంకా అని వసుంధర గౌతమ్ ని చూస్తూ అనుకుంటుంది.ఇది నిజమో అబద్దమో తెలుసుకుందామని గౌతమ్ కీర్తిని పిలిచి.

Malli Nindu Jabili Today Episode December 4th 2023 Episode 511 Highlights
Malli Nindu Jabili Today Episode December 4th 2023 Episode 511 Highlights

మల్లి మేడం మొదటి రోజు కదాఏదైనా వర్క్ స్టార్ట్ చేయమని చెప్పు అని గౌతమ్ మ్యారేజి సర్టిఫికెట్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పేపర్ రెండు మల్లి లాప్టాప్ కింద పెట్టి వెళ్ళిపోతాడు. సరే సార్ అని కీర్తి వెళ్తుంది.రా మల్లి బంగారు తల్లి ఈరోజుతో నీ క్యారెక్టర్ ఫినిష్ మంచి భర్త దొరికాడని ఎగిరెగిరి పడ్డావు ఇప్పుడు నేల మీద పడి గిలగిలా కొట్టుకుందువు గాని రా అని వసుంధర అనుకుంటుంది. కట్ చేస్తే, నీలిమ అందరిని వీడియో తీస్తూ ఉంటుంది. వదిన అన్నయ్యకు ఏందో సర్ప్రైజ్ ఇస్తానన్నావు కదా అదేంటి అని అడుగుతుంది నీలిమ. సర్ప్రైజ్లు ఎవరికీ చెప్పకూడదు అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today December 4 2023 Episode 511 Highlights
Malli Nindu Jabili Today December 4 2023 Episode 511 Highlights

ఒకరికి ఒకరు బాగానే సప్రైజ్లు ఇచ్చుకుంటున్నారు ఇది మీకే చెల్లుబాటు అని నీలిమ అంటుంది. ఇంతలో కీర్తి వచ్చి మేడం ఈరోజు ఫస్ట్ డే కదా ఏదైనా వర్క్ చేయండి మేడం అని కీర్తి అంటుంది. ఓకే పద అని మల్లి క్యాబిన్లోకి వెళ్లి కూర్చొని లాప్టాప్ ఓపెన్ చేస్తుంది. గౌతమ్ తన క్యాబిన్లో కూర్చొని మల్లి రూమ్ లో ఏం చేస్తూ ఉంటుంది ఆ పేపర్లు చూసి నా దగ్గరికి వచ్చి ఏంటి ఇవి అని అడిగితే తన తప్పు ఏమీ లేదని అర్థం అదే కనక దాచి పెడితే మాత్రం తప్పు చేసిందని అర్థం ఇప్పుడే తెలిసిపోతుంది అని గౌతమ్ తన లాప్టాప్ లో నుంచి సీసీ కెమెరా చూస్తూ ఉంటాడు. మల్లి వచ్చింది ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేద్దామని చూసేసరికి పేపర్లు కనిపిస్తాయి పేపర్లు ఏంటి అని చూసేసరికి అందులో మ్యారేజి సర్టిఫికెట్ హాస్పటల్లో అరవింద్ పేరు మీద మల్లి పెట్టిన సంతకం రెండు చూసి గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది మల్లికి టెన్షన్ పడిపోతూ కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది మల్లి కి మళ్లీ తేరుకొని కాసేపు ఆలోచించింది వెంటనే గౌతమ్ దగ్గరికి వెళ్ళకుండా అరవింద్ కి ఫోన్ చేస్తుంది. సార్ మీరు వెంటనే నా రూమ్ దగ్గరికి రండి అని అంటుంది మల్లి. ఏం జరిగింది మల్లి ఎందుకు నన్ను మీ రూమ్ దగ్గరికి రమ్మన్నావు గౌతమ్ చూస్తే ప్రాబ్లం అయిపోతుంది అని అరవింద్ అంటాడు. ఇవి చూడండి ఎవరో నా టేబుల్ మీద పెట్టారు అని సర్టిఫికెట్ పేపర్ ఇస్తుంది మల్లి.

Malli Nindu Jabili Today Episode December 4 2023 Episode 511 Highlights
Malli Nindu Jabili Today Episode December 4 2023 Episode 511 Highlights

ఎవరొ ఇది కావాలని చేశారు మల్లి నువ్వేం టెన్షన్ పడకు ఆలోచిద్దాం ఏం చేయాలో అని అరవింద్ అంటాడు. నేలకొండపల్లిలో మన పెళ్లి జరిగినట్టు ఎవరికి తెలుసు నేను మీ భార్యగా సంతకం పెట్టింది ఎవరికి తెలుసు ఎవరు తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టారు ఆయన చూస్తే ఇంకేమైనా ఉందా నా పని అయిపోయినట్టే అని మల్లి ఏడుస్తుంది. మల్లి నాకు చెప్పకుండా అరవింద్ కి ఫోన్ చేసి ఎందుకు రమ్మంది అని గౌతమ్ కోపంతో రగిలిపోతూ మల్లి దగ్గరికి వద్దామని బయలుదేరుతాడు. కట్ చేస్తే, మల్లి అరవింద్ క్యాబిన్ లో నుంచి బయటికి వచ్చి ఇప్పుడు ఏం చేయాలి బాబు గారు నాకు ఏమీ అర్థం కావట్లేదు ఈ విషయం ఆయనకు తెలిసే లోపే నేనే చెప్పేస్తాను అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today December 04 2023 Episode 511 Highlights
Malli Nindu Jabili Today December 04 2023 Episode 511 Highlights

నువ్వు ఇలా టెన్షన్ పడిపోయి ఏడవకు మల్లి గౌతమ్ కి ఇంకా ఈ విషయం తెలియదు కాబట్టి ఎలాగో అలా మేనేజ్ చేద్దాం నువ్వు మామూలుగానే ఉండు అని అరవింద్ అంటాడు. మనసులో బాధను పెట్టుకొని ఆయన ముందుకు వెళ్లి ఎలా నటించను ఆయన నా కోసం ఎన్నో చేశారు, నేలకొండపల్లిలో స్కూలు కట్టించారు అమ్మానాన్నల పెళ్లి చేశారు ఈరోజు నా పేరు మీద మ్యాగజైన్ అని ఓపెన్ చేశారు అలాంటి ఆయనకి మన ఇద్దరి పెళ్లి అయ్యిందని తెలిస్తే ఆయన గుండె రెండు ముక్కలైపోతుంది నిజం తెలిసిన వెంటనే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమైనా జరుగుతుంది లేదంటే నా ప్రాణాలు తీసేయడమేనా జరుగుతుంది, అవన్నీ జరిగే కంటే ముందే నేనే వెళ్లి ఆయనకు నిజం చెప్పేస్తాను కొంచెమైనా ఆయనకు నా మీద కోపం తగ్గుతుంది లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి అని మల్లి ఏడుస్తుంది. ఇన్ని రోజులు తెలియని నిజం ఇప్పుడు గౌతమ్ కి ఎలా తెలుస్తుంది మల్లి ఇప్పుడు ఈరోజు చెప్పడం కంటే కొద్దిగా ఆలోచించుకొని టైం తీసుకుని గౌతమ్ కి మన పెళ్లి నేలకొండపల్లిలో ఎలాంటి పరిస్థితుల్లో జరగాల్సి వచ్చింది మన బంధాన్ని ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చింది అవన్నీ వివరంగా చెప్తే అర్థం చేసుకుంటాడు గౌతమ్ అని అరవింద్ మల్లి నీ ఓదారుస్తాడు.

Malli Nindu Jabili Today December 4th 2023 Episode 511 Highlights Written Update
Malli Nindu Jabili Today December 4th 2023 Episode 511 Highlights Written Update

మల్లి నీ భుజం తట్టి ఓదారుస్తుంటే గౌతమ్ చూస్తూ ఎక్కడలేని కోపం వచ్చి తన చేయి గోడకేసి గుద్దుకుంటాడు తన చేతిలో నుంచి రక్తం వస్తుంది. నీ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు ఇక్కడ గౌతమ్ చేతిలో నుంచి రక్తం ప్రవహిస్తుంది ఇది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే కాదు మల్లి ఇంకా నువ్వు రోజు ప్రతిక్షణం టెన్షన్ పడుతూ చస్తూ ఉండాలి అని వసుంధర తన మనసులో అనుకుంటుంది. ఇలా రోజు చస్తూ బ్రతకడం కంటే ఆయనకు ఒకసారి నిజం చెప్పేసి ఆయన చేతిలో చనిపోవడం మంచిది నేను రాసిన లెటర్ ను మార్చకపోతే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆయన నన్ను పెళ్లి చేసుకునేవాడు కాదు ఇదంతా మాలిని అక్క వాళ్ళనే జరిగింది అని మల్లి ఏడుస్తూ ఉంటుంది.ఏం కాదు మల్లి నువ్వు ఏడవకు అని మల్లి కన్నీళ్లు తుడుస్తాడు అరవింద్. అది చూసి గౌతమ్ ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri