NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili Episode 512: మల్లి నాకు ఇంత నమ్మకద్రోహం చేస్తుందా అని కోపంతో రగిలిపోతున్న గౌతమ్..

Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights

Malli Nindu Jabili December 05 2023 Episode 512: రేయ్ పిచ్చోడా ఇంత పెద్ద నిజం బయట పడ్డప్పుడు వెళ్లి నాలుగు  తగిలించి దాన్ని నిలదీయక నిన్ను శిక్షించుకుంటావెందుకురా నాకు కావాల్సింది నువ్వు శిక్ష అనుభవించడం కాదు దాన్ని ఇంట్లో నుంచి తరిమేయడం కావాలి అని వసుంధర అనుకుంటుంది. అందరి కి డౌట్ రాకముందే మనం ఇకనుంచి వాళ్ళ దగ్గరికి వెళ్దాం పద అని అరవింద్ తనని తీసుకొని వెళ్తాడు. నీకంటే నేను పది ఎక్కువ ఆకులు చదివాను గౌతమ్ ఇప్పుడే ఆట మొదలైంది  కదా ఇంక ముందు ముందు ఒక రేంజ్ లో ఉంటుంది జస్ట్ వెయిట్ న్ సీ అని వసుంధర తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే, అందరం ఇక్కడ ఉంటే మీరు ఎక్కడికి వెళ్లారు వదిన అని నీలిమా అడుగుతుంది. మల్లి ఏమైందమ్మా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని మీరా అడుగుతుంది. బాగానే ఉన్నాను అమ్మ అని మల్లి అంటుంది. వసుంధర నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని కౌసల్య అడుగుతుంది. కాఫీ తాగడానికి క్యాంటీన్ కి వెళ్లాను వదిన కానీ గౌతమ్ ఏడి అని వసుంధర అడుగుతుంది. అందరూ తలో దిక్కుకు వెళ్ళిపోతే ఎలా మిగిలిన కార్యక్రమాలు చూసుకోవాలి కదా అని కౌసల్య అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights
Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights

ఏమున్నాయి అయిపోయాయి కదా ఇక అందరం బయలుదేరుదాం అని గౌతమ్ అంటాడు. బయలుదేరే ముందు వదిన అన్నయ్యకి ఇస్తానన్న గిఫ్ట్ అందరి ముందు ఓపెన్ చేయాలి అని నీలిమ అంటుంది. ఇప్పుడు అదేమీ వద్దు ఇప్పటికే లేట్ అయిపోయింది వెళ్దాం పదండి అని గౌతమ్ అంటాడు. గౌతమ్ బాబు ఏమైందో చెప్పండి ఎందుకు మీరు అంతలా టెన్షన్ పడుతున్నారు అని మీరా అడుగుతుంది. ఏమీ లేదు అత్తయ్య అని గౌతమ్ అంటాడు. అందరి కష్టాలు తీర్చే నీకు ఏ కష్టం వచ్చిందో చెప్పు గౌతమ్ మేమందరం తీరుస్తాం అని వసుంధర అంటుంది. అదేమీ లేదని చెప్తున్నాను కదా అని గౌతమ్ సీరియస్ అవుతాడు. సరే అందరం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం కదా వదినలు ఇద్దరూ అన్నయ్యలకు లవ్ ప్రపోజ్ చేయాలి అని నీలిమ అంటుంది. నీలు ఇప్పుడు అవన్నీ అవసరమా చెప్పు అని గౌతమ్ నీరసంగా అంటాడు. కాదనకు గౌతమ్ నువ్వు అవుననే దాకా నీలిమా వదిలిపెట్టదు అని కౌసల్య అంటుంది. ప్లీజ్ అన్నయ్య ఒప్పుకో అన్నయ్య అని రిక్వెస్ట్ చేస్తుంది నీలిమ. అవునన్నా లేక కాదనలేక  అడ్డంగా తల ఊపుతాడు గౌతమ్. వదిన ఇప్పుడు నువ్వు అన్నయ్యకు ప్రపోజ్ చెయ్యి అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights
Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights

వీడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడు పరువు పోతుందని ఆలోచిస్తున్నాడా అని వసుంధర తన మనసులో అనుకుంటుంది. మల్లి గౌతమ్ చేతులు పట్టుకొని మీరు చూపించే ప్రేమకు బానిసని అయిపోయాను నా ఆఖరి శ్వాస ఉన్నంతవరకు మీతోనే ఉంటాను మీరంటే నాకు ప్రాణం మీతోనే నా జీవితం అని మల్లి అంటూ ఉండగా గౌతమ్ కోపంతో తన రెండు చేతులు వదిలించుకుంటాడు. ఏమైంది గౌతమ్ అని కౌసల్య అడుగుతుంది. నాకు చెయ్యి నొప్పిగా ఉంది కాసేపు రెస్ట్ తీసుకుంటాను దయచేసి ఎవరూ రాకండి అని గౌతమ్ వెళ్లిపోతాడు. ఆయన ఎందుకలా చేసి ఉంటాడు మా విషయం తెలిసిపోయిందా అని మల్లి టెన్షన్ పడుతుంది.  ఎందుకిలా చేశాడని ఆలోచిస్తున్నావా ఇంటికి వెళ్ళాక నీకు ఉంటుందిలే అని వసుంధర తన మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే, నా దగ్గర పెద్ద అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకుని నన్ను మోసం చేసింది అని గౌతమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మల్లి అందరూ వెళ్ళిపోయారు మనం కూడా వెళ్ళిపోదామా అని కౌసల్య అంటుంది. మల్లి ఇలా చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు ఇంత నమ్మకద్రోహమా అని గౌతమ్ డ్రైవింగ్ చేస్తూ అనుకుంటాడు. అన్నయ్య కూడా ఎటో వెళ్లిపోయాడు అని నీలిమ అంటుంది.

Malli Nindu Jabili: గౌతమ్ కి అడ్డంగా దొరికిపోయిన మల్లి అరవింద్ వ్యవహారం…అది చూసి ఆనందంలో వసుంధర!

Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights
Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights

నా టేబుల్ మీద పెట్టినవి ఆయన టేబుల్ మీద పెట్టుకుంటారా ఇందులో వసుంధరమ్మ గారి పాత్ర ఉండే ఉంటుందా అని మల్లి తన మనసులో అనుకుంటుంది. ఇందాకా అన్నయ్య సీరియస్ అయ్యాడని అలా ఉన్నావా ఏం కాదులే ఇంటికి రాగానే నీకు సారీ చెప్తాడు చూడు అని నీలిమ అంటుంది. కట్ చేస్తే, అందరూ ఇంటికి వచ్చేస్తారు,గౌతమ్ ఇంటికి వచ్చేసి తన రూమ్ లో సామాన్లన్నీ కోపంతో ఎత్తేస్తూ ఉంటాడు. అది చూసి మల్లి భయపడుతూ ఏమైందండీ నన్ను విడిచిపెట్టి రారు కదా నాతో మాట మాత్రం కూడా చెప్పకుండా అలా ఎందుకు వచ్చేసారు ఆఫీసులో కోపంగా మ్యాగ్జిన్ ని విసిరే సారు ఎందుకు నేనేమైనా తప్పు చేశానా  అని మల్లి అడుగుతుంది. మల్లి అలా అనేసరికి ఎక్కడలేని కోపంతో రగిలిపోతూ గౌతమ్ నీకేం కావాలి  ఇప్పుడు నీకు సమాధానం కావాలి అంతేనా, నేను నిన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటే నీ పేరు మీద మీ ఊర్లో స్కూల్ కట్టించాను మీ అమ్మానాన్నల పెళ్లి చేశాను

Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights
Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights

ఈరోజు నీ పేరు మీద మ్యాగజైన్ కూడా ఓపెన్ చేశాను కానీ సోషల్ మీడియాలో  ని పేరు అరవింద్ పేరు మారు మోగిపోతుంది నీ పక్కన అరవింద్ అరవింద్ అని గౌతమ్ చెప్పలేక చెప్తాడు. అవన్నీ విన్న మల్లి తన దగ్గరికి వచ్చి మీరు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు అండి బయట జరిగిన వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు కానీ మీరంటే నాకు ప్రాణం అండి నన్ను నమ్మండి అని మల్లి ఏడుస్తూ చెప్తుంది. నమ్మాను కాబట్టే నిన్ను ఏమీ అనలేక పోతున్నాను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాను కానీ నువ్వు నా దగ్గర అబద్ధం చెప్తున్నావు అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights
Malli Nindu Jabili Today Episode December 05 2023 Episode 512 Highlights

నేను మీ దగ్గర అబద్ధం దాయడం ఏంటండీ అని మల్లి అంటుంది. మా ఇద్దరి విషయం తెలిసిపోయే ఇలా ప్రవర్తిస్తున్నాడా అని మల్లి తన మనసులో అనుకుంటుంది. నేను అనుభవిస్తున్న బాధ మీకు ఎవరికీ అర్థం కావట్లేదు నాకు ఒక్కడికే అర్థం అవుతుంది నువ్వే కావాలని అబద్ధం చెప్పావు అని గౌతమ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella