Malli Nindu Jabili November 21 2023 Episode 500: మీరెవరు ఇక్కడ నుంచి వెళ్లడానికి వీల్లేదు అందరు పెళ్లి చూసే వెళ్ళాలి ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని గౌతమ్ అంటాడు.మీరా శరత్ పెళ్లి బట్టలు కట్టుకొని వచ్చి పీటల మీద కూర్చుంటారు. పంతులుగారు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తాడు. పెళ్లి అయిపోయింది అత్త ఈ మాత్రం దానికి అంత పెద్ద గొడవ చేసావు అని గౌతమ్ అంటాడు. శివపార్వతుల కల్యాణానికి అని పిలిచి నా కళ్ళ ముందే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించి నా మీద గెలిచానని అనుకుంటున్నావు కదా నువ్వు చేసిన ఈ పనికి ఇంతకీ ఇంత నీ కుటుంబం అనుభవిస్తుంది అని వసుంధర మాలిని ని తీసుకొని వెళ్ళిపోతుంది. శరత్ అంకుల్ చేత మీరా అత్తయ్యకి తాళి కట్టించి మంచి పని చేశావు గౌతమ్ అత్తయ్యకి ఇన్నాళ్ళకి గుర్తింపు దొరికింది అని అరవింద్ వెళ్లిపోతాడు.

గౌతమ్ నేను ఒక్క మాట చెప్తాను బాబు నా కూతురు విషయంలో ఈ పని చేసి మీరు దేవుడైపోయారు బాబు అని జగదాంబ అంటుంది. అవును గౌతమ్ ఈ పెళ్లి వల్ల మీ అత్తయ్యకి ఒక గుర్తింపు వచ్చింది నలుగురులో తలెత్తుకునే తిరిగి అవకాశం వచ్చింది ఇంకెవరు మీరా అని ఏలెత్తి చూపించరు అని కౌసల్య అంటుంది. కట్ చేస్తే వసుంధర వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మాలిని అని శారద అడుగుతుంది. నువ్వు ఎప్పుడు వచ్చావు నాయనమ్మ మేము గుడికి వెళ్లి వస్తున్నాము గౌతమ్ శివపార్వతుల కళ్యాణానికి మమ్మల్ని ఆహ్వానించాడు అక్కడికి వెళ్లాక డాడీ కి ఆ మీరా కి పెళ్లి జరిపించాడు అది చూడలేక అమ్మ బాధపడుతుంది అనిమాలిని అంటుంది. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బాధపడడం ఎందుకు మాలిని అయిందేదో అయిపోయింది అని అరవింద్ అంటాడు.

గౌతమ్ మల్లి మీరిద్దరూ అమ్మానాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని కౌసల్య అంటుంది. కట్ చేస్తే, శరత్ చంద్రని మీరా ని మల్లి తీసుకొని గౌతమ్ వసుంధర వాళ్ళ ఇంటికి వస్తాడు. అత్తయ్య మామయ్య లోపలికి పదండి అని గౌతమ్ అంటాడు.ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు కోరుకున్నది జరుగుతుంది కదా పద అని జగదంబ అంటుంది. వసుంధర కోపంతో ఫ్లవర్ బొకే ని తీసి కింద విసిరేసి చూడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు అంటే ఆ ఫ్లవర్ బొకే నీ తల మీద పడుతుంది అని వసుంధర అంటుంది. చూడండి అమ్మగారు నేను ఈ వయసులో పెళ్లి చేసుకున్నది నా సోకు కోసం కాదు మీ ఆస్తి అంతస్తుల కోసం అంతకన్నా కాదు నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఈ పని చేశాను ఇంతకుముందు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను

నేను ఏ హక్కుల కోసం పోరాడని అమ్మగారు దయచేసి నన్ను ఇంట్లోకి రానివ్వండి అని మీరు వినయంగా అంటుంది. ఇలాంటి నంగనాచి మాటలు చెప్పే అందరినీ బుట్టలో వేసుకొని నీ వైపు తిప్పుకున్నావు ఇక నేను నమ్మను నమ్మలేను నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని వసుంధర అంటుంది. అమ్మగారు ఇన్ని రోజులు మా అమ్మ చేసిన త్యాగాలు చాలు ఇప్పటికైనా సంతోషంగా ఉండనివ్వండి అని మల్లి అంటుంది. ఏంటత్తా నీ లొల్లి నువ్వు గనక అత్తయ్యని మామయ్యని లోపలికి రానివ్వకపోతే నా చానల్లో లో వసుంధర గారి అరాచకాలు అని పెద్ద హెడ్లైన్ వేసి మరి పబ్లిక్ సిటీ చేస్తాను దానితో నువ్వు ఏం చేస్తావో చూస్తాను అని గౌతమ్ అంటాడు. చూడు గౌతమ్ గుడిలో గన్ను నా తలకు గురి పెట్టావు కాబట్టి భయపడి వెనకకు తగ్గాను నా ఇంటికి వచ్చి నన్ను బెదిరిస్తావేంట్రా నీకెంత ధైర్యం అని వసుంధర అంటుంది. వసుంధర నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరా నా భార్య నీకు ఎంత హక్కు ఉంటుందో తనకు కూడా ఇంట్లో అంతే హక్కు ఉంటుంది

అని శరత్ అంటాడు. చూడండి అత్తయ్య ఇప్పుడు మనం అనుకునే ప్రయోజనం ఏమీ లేదు పెళ్లయితే జరిగిపోయింది ఇప్పుడు వాళ్ళిద్దర్నీ బయట నిలబడితే నీకు వచ్చే లాభం ఏంటి అని అరవింద్ అంటాడు. ఎంతసేపు అమ్మ ఇంకా బయటే నిలబెడతావు అని జగదంబ అంటుంది. అమ్మ ఇప్పుడు మనం ఏం చేసినా మన వైపు మాట్లాడే వారు ఎవరూ లేరు కాబట్టి మనం కాంప్రమైజ్ అయిపోవడమే మంచిది ఎదురు తిరిగి బాధపడే కన్నా వాళ్లని ఇంట్లోకి రానిచ్చి ఆనందంగా ఉందాం అని మాలిని అంటుంది. నేను కాంప్రమైజ్ కాలేను మాలిని అని వసుంధర అంటుంది. కావాలి అమ్మ తప్పదు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏమి చేయలేము నీకాపురం మాకాపురం బాగుండాలి అంటే మనం మౌనంగా ఉండడం మంచిది అని మాలిని అంటుంది. చూడత్తా నువ్వు ఎంత బెట్టి చేసి వాళ్ళని లోపలికి రానివ్వకపోతే నేను పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుంది

అని గౌతమ్ అంటాడు చూడు వసుంధర ఏదైనా తప్పు జరిగింది అంటే అది శరత్ వల్లనే అంతేకానీ మీరా అని ఎందుకు నిందిస్తావు శరత్ చేసిన తప్పుని గౌతమ్ సరిదిద్దాడు ఇంక నువ్వేం మాట్లాడకు మల్లి నువ్వు లోపలికి వచ్చి మీ అమ్మానాన్నలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురా అమ్మ అని శారద అంటుంది. మల్లి వాళ్లకి హారతి ఇచ్చి లోపలికి పంపిస్తుంది. అత్తయ్య మామయ్య కుడికాలు ముందు పెట్టి వెళ్లండి అని గౌతమ్ అంటాడు. వాళ్లు నలుగురు లోపలికి వెళ్తారు. వసుంధర వాళ్ళ వంక కోపంగా చూస్తుంది. చూడండి మామయ్య ఇక్కడ అత్తయ్య హ్యాపీగా ఉంటే అక్కడ మల్లి ఆనందంగా ఉంటుంది,ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ఫోన్ చేయండి నేను చూసుకుంటాను మల్లి ఇక మనం బయలుదేరుదామా అని గౌతమ్ అంటాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది