NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 25 2023 Episode 91: షాప్ చూద్దామని వెళ్లిన గంగకి గంగాధర్ డిగ్రీ చేయలేదని తెలుస్తుందా లేదా?..

Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights

Mamagaru December 25 2023 Episode 91: ఇద్దరి వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు వారు కార్ డ్రైవింగ్ చేసిన నీరజ్ కి బెల్ మంజూరు చేయడమైనది అలాగే స్కూటీ నడిపి తణుకు రాంగ్ రూట్లో రావడమే కాకుండా యాక్సిడెంట్ అయిందని తప్పుడు కేసులు పెట్టినందుకు ఆ వ్యక్తిని మందలిస్తూ వదిలేస్తున్నది కోర్ట్ అని జడ్జిగారు అంటారు. దానితో వసంత సంతోష పడిపోతుంది. అక్క చాలా థాంక్స్ అక్క ఫస్ట్ కేసి గెలిచేసావు అని గంగ వసంతకి కంగ్రాట్స్ చెప్తుంది. చాలా థాంక్స్ అమ్మ మా వాడిని కాపాడుకోలేని అనుకునే పరిస్థితిలో ఈ అమ్మాయి కలిసి నీ గురించి చెప్పింది మీకు ఇంత టాలెంట్ ఉంది మా కింద లాయర్ గా పని చేయండి అని నిరాజ్ వాళ్ళ నాన్న అంటాడు. పనిచేయడానికి మా ఇంట్లో మా మామగారు ఒప్పుకోరండి అని వసంత అంటుంది. మేడం ఈరోజు మీరు కేసు గెలిచినందుకు మీకు ఫీజుగా 50,000 ఇస్తున్నాను మీరు మా కంపెనీలో పని చేస్తే వారానికి రెండు రోజులు వస్తే సరిపోతుంది మేడం 90000 శాలరీ ఇస్తాను అని అతను అంటాడు.

Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights
Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights

కుదరదు సార్ మా నాన్న ఒప్పుకోడు అని సుధాకర్ అంటారు. మీలాంటి వాళ్ళని వదులుకోవడం మాకు మంచిది కాదమ్మా అందుకనే నీకు మా కంపెనీలో జాబ్ ఇస్తున్నాను రోజు ఏమి రానక్కర్లేదు ఫోన్లో నుంచి అడ్వైజ్ ఇస్తూ ఉండండి ఎప్పుడైనా వీలైనప్పుడు మాత్రం ఒక్కసారి ఆఫీస్ కి వచ్చి వెళ్ళండి అని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వెళ్లిపోతాడు అతను. వసంత నువ్వు నా కంటే ఎక్కువ సంపాదిస్తున్నావు చాలా థాంక్స్ వసంత చాలా ఆనందంగా ఉంది నాకు నీ భర్త అని చెప్పుకోవడానికి గర్వం కడుతున్నాను అని సుధాకర్ అంటాడు. గంగ ఇదంతా నీవలనే సాధ్యమైంది గంగ ఈ క్రెడిట్ అంతా నీదే అని వసంత అంటుంది. ఇందులో నాదేముంది అక్క నువ్వు చదివిన చదివికి ఇన్నాళ్ళకి న్యాయం చేయగలిగావు ఇప్పటికైనా నువ్వు లాయర్ అయ్యావు చాలా సంతోషంగా ఉంది అని గంగా అంటుంది. ఏమండీ మనం ఇక సర్టిఫికెట్ పెట్టడానికి వెళ్దామా అని గంగ అంటుంది. ఇప్పుడే ఎందుకు గంగా తర్వాత వెళ్దాం లే అని గంగాధర్ అంటాడు. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి గంగా మీరు షాపు కోసం వెతుకుతున్నారు అంట కదా నాకు తెలిసిన షాపు ఒకటి ఉంది లొకేషన్ పెడతాను మీరు అక్కడికి వెళ్ళండి గంగ అని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్.ఏమండీ మా ఫ్రెండు షాపు గురించి చెప్పింది అక్కడికి వెళ్దాం రండి అని గంగా వాళ్ళ ఆయన తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights
Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights

గంగా వాళ్ళు అక్కడికి వెళ్లి షాప్ చూస్తారు ఇంతలో షాపు ఓనర్ వచ్చి అరేయ్ గంగా నువ్వేంటి రా ఇక్కడ అని అంటాడు. ఈ షెటర్ చూద్దామని వచ్చాము రా షాప్ కోసం అని గంగాధర్ అంటాడు. ఈ అమ్మాయి ఎవరు రా అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఆవిడ నా భార్య రా గంగ అని పరిచయం చేస్తాడు గంగాధర్. ఇది మి షాపారా అని గంగాధర్ అంటాడు. అవున్రా మీరేంటి ఇలా వచ్చారు షాప్ నువ్వు పెడుతున్నావా నీకారా షాప్ కావాల్సింది అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. అవు  నన్నయ్య గారు మా సర్టిఫికెట్లు మీద లోన్ తీసుకొని షాప్ పెట్టబోతున్న హోల్ సేల్ షాప్ అని గంగా అంటుంది. వీడు డిగ్రీ చదవలేదు టెన్త్ క్లాస్ మీద ఎవరు మా లోన్ ఇచ్చేది అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఏమండీ అతని చెప్పేది నిజమా మీరు టెన్త్ తప్ప డిగ్రీ చేయలేదా అని గంగ అంటుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights
Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights

అత్తయ్య నాకు చాలా ఆనందంగా ఉంది నాకు జాబ్ కూడా వచ్చింది అంతా గంగ వల్ల అత్తయ్య తను ఎంత తెలివిగలది అంటే ఒక చిన్న మ్యాటర్ పట్టుకొని నాకు ఫోన్ చేసి నాకు లాయర్ జాబ్ వచ్చేలా చేసింది నిజంగా తను గ్రేట్ అత్తయ్య శ్రీలత అక్కకి ట్యూషన్ చెప్పించింది నాకు ఇప్పుడు ఈ లాయర్ పోస్ట్ ఇప్పించింది తను వచ్చాకే మన ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నా0 అత్తయ్య కానీ మామయ్యకి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉంది అత్తయ్య అని వసంత అంటుంది.అడవిలో మనం ప్రయాణిస్తున్నప్పుడు పెద్దపులిని చూసి భయపడతాం అలాగని మనం ప్రయాణించకుండా ఉంటామా పెద్దపులి నుంచి తప్పించుకొని అడవి దాటుతాము అలాగే ఇప్పుడు మనం కూడా మీ మామయ్యకు తెలిస్తే ఏమవుతుందనేది పక్కన పెట్టి ఆయన నుంచి తప్పించుకొని జాబ్ ల్ ఎలా చేయాలో ఆలోచించండి అని దేవమ్మ అంటుంది. మీలాంటి అత్తయ్య ఉండబట్టే కదా అత్తయ్య మేము ఇంతవరకు వచ్చాము అని వసంత సంతోషంతో పొంగిపోతుంది.

Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights
Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights

నాదే ముందమ్మా మిమ్మల్ని అర్థం చేసుకునే భర్తలు దొరకడం మీ అదృష్టం అని దేవమ్మ అంటుంది. నిజంగా అమ్మ వసంత లాంటి భార్య దొరకడం నా అదృష్టం తను కోర్టులో వాదించడం చూస్తుంటే నేను తెల్ల మొహం వేసుకొని చూసాను అని సుధాకర్ అంటాడు. అవునా అన్నయ్య వదిన అంత బాగా వాదించిందా అని సిరి అంటుంది. అవును సిరి ఏమనుకున్నావ్ మరి వసంత అంటే అని సుధాకర్ అంటాడు. కంగ్రాట్యులేషన్స్ వదిన అని పాండురంగ అంటాడు. కంగ్రాట్యులేషన్స్ అక్క చాలా హ్యాపీగా ఉంది నీకు ఉద్యోగం వచ్చింది నాకు ఉద్యోగం వచ్చింది అని శ్రీలక్ష్మి అంటుంది. కట్ చేస్తే,ఏమండీ మీ ఫ్రెండ్ చెప్పింది నిజమా అబద్దమా మీరు డిగ్రీ చేయలేదా అని గంగ అడుగుతుంది. నేను డిగ్రీ చదవలేదు గంగ అని గంగాధర్ తలా నేలకు వేస్తాడు. గంగ ఏమీ మాట్లాడకుండా బైకు దగ్గర వచ్చి నిలబడుతుంది. గంగాధర్ బండి ఆన్ చేయగానే గంగ బండి మీద కూర్చుంటుంది వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights
Mamagaru Today Episode December 25 2023 Episode 91 Highlights

ఒక దగ్గర పోలీసులు అన్ని బల్లని ఆపుతూ ఉంటారు. ఏ బాబు ఆపు అని గంగాధర్ వల్ల బండి కూడా ఆపుతారు పోలీసులు.  ఏమయ్యా నీకు లైసెన్స్ ఉందా ఏంటి హెల్మెంట్ లేకుండా బండి నడుపుతున్న తప్పు కాదా ఆర్సి బుక్ తియ్ అని పోలీస్ అంటాడు. ఉన్నాయి సార్ అని గంగాధర్ పార్ట్స్ ఓపెన్ చేస్తూ ఉండగా సిఐ కనపడతాడు సి ఐ ని చూసి భయపడిపోతూ గంగాధర్ పోలీస్ ని పక్కకు తీసుకువెళ్తాడు. సిఐ అక్కడికి వచ్చి ఏమిటయ్యా కేసు అని అడుగుతాడు. సార్ హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నాడు అని పోలీస్ చెప్తాడు. ఏంటయ్యా హెల్మెట్ పెట్టుకుంటే మీకే మంచి జరుగుతుంది కదా చెప్పేది మీ మంచికే కదా అని సీఐ అని నిన్ను ఎక్కడో చూసినట్టుంది అయ్యా అని అంటాడు. గంగాధర్  భయపడుతూ మొహం చాటేస్తాడు. ఇంతలో గంగ వచ్చి సార్ నన్ను గుర్తుపట్టారా సార్  ఒకరోజు సర్టిఫికెట్ పోయిందని మీ పోలీస్ స్టేషన్ కి వచ్చాను గంగని అని పరిచయం చేసుకుంటుంది గంగ. అవునమ్మా అది సరే కానీ నువ్వు అతను ఓకే బైక్ మీద వెళ్తున్నారు ఏంటి అని సీఐ అంటాడు. నేను ఆరోజు పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాను కదా సార్ ఆయనే ఈయన మా వారు అని గంగ అంటుంది.అదెలా సాధ్యం అమ్మ ఇతను నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావ్ అని సీఐ అంటాడు..

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N