NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nindu Noorella Saavasam November 28 2023 Episode 92: మాంత్రికుని వాళ్ళ గదిలో చూసి భయపడిన పిల్లలు..

Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights

Nindu Noorella Saavasam November 28 2023 Episode 92: అది కాదండి  అని భాగమతి చెప్పబోతూ ఉంటుంది. నువ్వు ఇంతకు ముందు మా ఆఫీస్ చుట్టూ తిరిగే దానివి కదా దేనికోసం తిరిగే దానివి చెప్పు నీకేం కావాలన్నా చేసి పెడతాను అని అమరేంద్ర అంటాడు. భాగమతి చెప్పబోతూ ఉండగా రాథోడ్ వచ్చి సార్ మీరు అడిగిన సెక్యూరిటీ డీటెయిల్స్ అన్ని తెచ్చాను ఒకసారి చూసి కన్ఫర్మ్ మేషన్ చేస్తే ఎంక్వయిరీ మొదలు పెడతాను అని రాథోడ్ అంటాడు. అలాగే రాథోడ్ అని అమరేంద్ర అంటాడు. అలాగే సార్ మన రాము ఉన్నాడు కదా అతను నీతో మాట్లాడడానికి నన్ను అడగమన్నాడు దాని గురించి ఏం చేశారు సార్ అని రాథోడ్ అంటాడు. రాథోడ్ నీకు ఇంతకు ముందే చెప్పాను కదా ఇలాంటి రికమండేషన్ నాకు నచ్చవని ధైర్యం ఉంటే వచ్చి నాతోటి డైరెక్ట్ గా మాట్లాడమని లేదంటే ఊరు కొమ్మను అంతేకానీ ఇలాంటి రికమండేషన్లు ఇంకోసారి తీసుకొస్తే నీకు బాగోదు అని అమరేంద్ర అంటాడు. అలాగే సార్ కానీ మిస్సమ్మ ఏంటి ఇక్కడ ఉంది ఇప్పటిదాకా ఏం చేస్తుంది అని అంటాడు రాథోడ్. తనకేదో సహాయం కావాలంట అదేంటో అడుగుతున్నాను అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights

చెప్పు నీకు ఏ సహాయం కావాలి అని అమరేంద్ర అంటాడు. ఎందుకు ఇందాక ఆయనను తిట్టినట్టు నన్ను కూడా తిట్టడానికా అని మనసులో అనుకొని, ఏమీ లేదండి మీరు అన్నం తిన్నారా మీ ఆరోగ్యం జాగ్రత్త చానా లేట్ అయిపోయింది వెళ్లి పడుకోండి అని భాగమతి వెళ్ళిపోతుంది. నిజంగా ఈ అమ్మాయి ఏ మెంటల్ హాస్పిటల్ నుంచో పారిపోయి వచ్చి మన ఇంట్లో సెటిల్ అయినట్టుంది అని అమరేంద్ర అంటాడు. మిస్సమ్మ సార్ ని ఏం అడగాలనుకుంది అని భాగమతి వెళ్లిపోతుంటే పిలిచి,మిస్సమ్మ సార్ ని ఏం అడగాలి అనుకొని ఏం అడిగావు ఆయన అలా కోప్పడ్డారు అని అంటాడు. ఏమీ లేదండి మా నాన్న ఆరోగ్యం గురించి చిన్న సంతకం  అడుగుదామనుకున్నాను అని భాగమతి అంటుంది. భలే మంచి దానివి అమ్మ ఆయన ఉన్న కోపానికి ఇప్పుడు అడిగితే చెడమడ తిట్టి పడేస్తాడు ఇవాళ కాకుండ రేపు అంజు ఎగ్జామ్ రాసి స్కూల్లో అడ్మిషన్ సంపాదిస్తుంది కదా అప్పుడు హ్యాపీ మూడ్లో ఉంటాడు అప్పుడు అడుగు సంతకం చేస్తాడు అని రాథోడ్ అంటాడు. అమ్మో బాగి కొంచెం లో మిస్ అయిపోయావే లేదంటే నువ్వు గేట్ బయట ఉండే దానివి అనుకుంటూ భాగమతి వెళ్ళిపోతుంది.

Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights

కట్ చేస్తే, అర్ధరాత్రి 12 అయింది నైట్ అందరూ పడుకుoనరు. అందరూ పడుకున్న సమయం చూసి ఆ మాంత్రికుడు గేటు దూకి లోపలికి వస్తాడు. తన అలికిడి విన్న గుప్తా గారు ఎవరు వచ్చారు అని లేచి అటు ఇటు చూస్తాడు ఏదో చప్పుడు అయింది కానీ కనిపించట్లేదేంటి అని అనుకుని మళ్ళీ పడుకుంటాడు. గుప్తా గారు చూస్తుంటే కనిపించకుండా చెట్టు చాటుకు దాక్కొని గుప్త పడుకున్న తర్వాత మళ్లీ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కార్లో అరుంధతి ఉందేమో అని చూసి ఇంట్లోకి వెళ్తాడు. ఇల్లంతా ముక్కుతో వాసన చూసుకుంటూ ఆత్మ ఏ గదిలో ఉంది అని ఇల్లంతా చుట్టూ ముడతాడు.  అరుంధతి ఏ గదిలోను కనిపించదు. ఆత్మ ఎక్కడ ఉంది అనుకుంటూ పైకి వెళ్తాడు పైకి వెళ్ళగానే పిలలున గదిలో నుంచి ఆత్మ ఉన్నట్టు అతనికి వాసన వస్తుంది.ఆ వాసన నీ పసిగట్టి మాంత్రికుడు  డోర్ తీసి చూస్తాడు.అక్కడ పక్కనే టేబుల్ మీద తల పెట్టుకొని పడుకున్నా అరుంధతిని చూసి ఆత్మ ఇక్కడే ఉంది అది నాకు కావాలి అంటూ లోపలికి వచ్చి తన దగ్గర ఉన్న విభూదిని మంతరిస్తాడు.

Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights

అంజు పాప కొంచెం అటు ఇటు మెసులతో ఉంటుంది. ఒక్క నిమిషం పాటు మళ్ళీ అలాగే నిలబడిపోతాడు. తన చేతిలో ఒక గాజు గ్లాస్ లాంటి దీపాంతర్ని పట్టుకొని ఇందులోకి నువ్వు వచ్చేయాలి ఆత్మ అంటూ నవ్వుతాడు. అంజు అటు ఇటు బొరుతూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తుంది. ఆంత్రికుడు మంత్రించిన విభూదిని అరుంధతి మీద చల్లబోతుండగా అమ్మో దయ్యం దయ్యం అమ్ము దయ్యం అని ఏడుస్తుంది. ఏయ్ అరవకు నా పని పూర్తి కాగానే వెళ్ళిపోతాను మిమ్మల్ని ఏమీ చేయను అని ఆ మాంత్రికుడు అంటాడు.  అంజు భయపడిపోయి అలాగే దయ్యం అని అమ్ముని లేపుతుంది. అందరూ లేచేసరికి ఆ మాంత్రికుడు దాక్కుంటాడు. దయ్యం అక్కడ ఉంది చూడు అని అంజు అంటుంది. పిల్లలు ముగ్గురు  చూస్తే అక్కడ ఏం కనిపించదు అక్కడ ఏమీ లేదు అంజు ఎందుకు భయపడుతున్నావ్ అని అమ్ము అంటుంది. అక్కడే ఉంది చూడండి అని అమ్ము అంటుంది. ఇక్కడ ఎక్కడ ఉంది అని అరుంధతి తొంగి చూస్తుంది. ఏయ్ ఆరువొద్దని చెప్పాను కదా నా పని పూర్తి చేసుకుని వెళ్తాను అని ఆ మాంత్రికుడు అంటాడు. అతని చూసి నలుగురు అమ్మో దయ్యం అని గట్టిగా అరిచి డాడీ ఇక్కడ దయ్యం ఉంది అని పిలుస్తారు. పిల్లలు అరుపులు విని అందరూ పరిగెత్తుకొస్తారు. అందరూ వచ్చేలోపు ఆ మాంత్రికుడు గోడ దూకి పారిపోతాడు. ఏమైంది నాన్న ఎందుకు అంత గట్టిగా అరిచారు ఏం చూసి భయపడ్డారు అని అమరేంద్ర అంటాడు. పిల్లలు భయపడిపోతూ వాళ్ళ డాడీ ని గట్టిగా వాటేసుకొని ఏడుస్తూ ఉంటారు.  ఇంత నైట్ అరిచి మాట్లాడరేంటి ఏం చూశారు అని మనోహరి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights

డాడీ మా గదిలోకి ఒక అతను వచ్చాడు అని అమ్ము అంటుంది. రాథోడ్ ఎవరో అతను చూడు అని అమరేంద్ర అంటాడు. రాథోడ్ బయటికి వెళ్లి అంతటా చూస్తాడు అక్కడ ఎవరూ కనిపించరు. భాగమతి కూడా ఇల్లంతా వెతికి చూస్తుంది ఎవరూ కనిపించరు. అరుంధతి భాగమతికి ఎక్కడ కనపడుతనోనని నక్కినక్కి దాక్కుంటుంది. సార్ ఇక్కడ ఎవరూ లేరు అని రాథోడ్ అంటాడు. ఇలాంటి సెక్యూరిటీని పెట్టుకుని నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాను మనం ఉండగానే పిల్లల గదిలోకి ఒకడు వచ్చాడు అంటే ఏంటి దాని అర్థం రాథోడ్ రేపటి నుంచి సెక్యూరిటీ ప్లాన్స్ అన్ని నాకు రాసి పంపించు వాళ్లని తీసేసి కొత్త సెక్యూరిటీలను తీసుకురా అని అమరేంద్ర అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights
Nindu Noorella Saavasam Today Episode November 28 2023 Episode 92 Highlights

మీకు ఏమీ కాదమ్మా మేమున్నాం కదా అని భాగమతి అంటుంది. మేము డాడీ దగ్గరే పడుకుంటాము మేము ఇక్కడ పడుకోము అని అమృత అంటుంది. ఎప్పుడు ఇదే మార్కులు కొట్టేస్తూoది ఈ సిచువేషన్ మనకు అనుకూలంగా మార్చుకోవాలి అని మనోహరి,పిల్లలు అలా మారం చేయకూడదు అమ్మ డాడీ ని ఇబ్బంది పెట్టకండి మీరు పడుకునే దాకా మీ పక్కనే నేనుంటాను భయపడకండి అని మనోహరీ అంటుంది. ఈవిడ ఒక్కత్తి ఏం మాట్లాడుతుందో ఏమో అస్సలు అర్థం కాదు సార్ పిల్లల్ని చూసుకుంటాను అంటుంటే ఈవిడ మధ్యలో దూరిపోతుంది అని రాథోడు తన మనసులో అనుకుంటాడు. మనోహరి పిల్లల్ని నేను చూసుకుంటాను వాళ్లకు కావలసింది తోడు కాదు నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి మీరందరూ వెళ్లి పడుకోండి నా పిల్లల్ని నేనే చూసుకుంటాను అని అమరేంద్ర అంటాడు. అది కాదు అమరేంద్ర అని మనోహరి అంటుంది. చెప్తున్నాను కదా అందరు వెళ్లి పడుకోండి అని అమరేంద్ర గట్టిగా అంటాడు. ఈవిడకి బాగా అయింది అనుకుంటూ రాథోడ్ వెళ్ళిపోతాడు. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N