NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: కృష్ణ ఆనందానికి చెక్ పెట్టిన అరవింద.. రివైంజీ డోస్ పెంచిన ఆర్య.. రేపటి ట్విస్ట్..?

Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights

Nuvvu Nenu Prema:నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి విక్కీ, అను ఆర్యాలు, అందరూ గుడి నుంచి ఇంటికి బయలుదేరుతారు. కూతుళ్లకు వచ్చిన కష్టాన్ని చూసి భక్త చాలా బాధపడతాడు. పద్మావతి ఆ ఇంటికి వెళ్లిన తర్వాత కృష్ణతో జాగ్రత్తగా ఉండాలని విక్కీ మనసు గెలుచుకోవాలని పార్వతి చెప్తుంది. కుచల పిల్లల కోసం అనుని ఇబ్బంది పెట్టడం భక్తా గమనిస్తాడు. ఇక ఇద్దరి పిల్లలు అక్కడికి వెళ్లిన తర్వాత ఎలా ఉంటారు అని కంగారు పడతాడు. అరవింద పద్మావతి అణువులను తన సొంత తమ్ముళ్ల కంటే ఎక్కువగా చూసుకుంటుంది అన్న ధైర్యంతో పార్వతి భక్తాకు నచ్చ చెప్తుంది.

Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights

ఈరోజు ఎపిసోడ్ లో, అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. ఉదయం నుండి ఉపవాసం ఉండడంతో పద్మావతి విక్కిలని మొదట భోజనం చేయమని చెప్తుంది అను, పద్మావతి భోజనం చేయడానికి ఇబ్బంది పడుతుంది చేయి బాగా నొప్పి చేయడంతో, పద్మావతి భోజనం చేయలేక, అలానే ఉంటుంది అది గమనించి ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమైంది భోజనం చేయట్లేదు అని అడుగుతారు. పద్మావతి ఎంతసేపటికి చెప్పకపోవడంతో ఆర్య గమనించి పద్మావతి చేయి కాలింది కదా గుళ్లో కర్పూరం వెలిగించింది కదా చేతిలో అని చెప్తాడు. ఆ మాటకి విక్కీ పద్మావతి చేతిని తీసుకొని గాయాన్ని చూసి నాతో చెప్పాలి కదా పద్మావతి అని అంటాడు. అప్పుడు అంత నొప్పి అనిపించలేదు సారు అని అంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights

పద్మావతి కోసం విక్కీ..?

ఇక చెయ్యి నొప్పిగా ఉండడంతో అను నేను పెడతాను లే నీకు భోజనం నువ్వు ఎలా కలుపుకొని తింటావు అమ్మి అని అంటుంది. వెంటనే ఆర్య నువ్వు ఎందుకు అను తనని ప్రేమగా చూసుకునే భర్త ఉన్నాడు కదా, మా విక్కీ అనే పద్మావతికి భోజనం తినిపిస్తాడు. ఏమిటి నీ భార్య కష్టాల్లో ఉంటే నువ్వు భోజనం కూడా తినిపించలేవా అని అంటాడు. వికీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆర్య ఏం పర్లేదు వికీ మేమేం అనుకోను నువ్వు తనకి భోజనం పెట్టు అని అంటారు. అక్కడే ఉన్న అరవింద కూడా మరేం పర్లేదు నీ మనసులో పెట్టాలని ఉంది కదా అయినా మేమంతా ఏమన్నా అనుకుంటామని నువ్వు సైలెంట్ గా ఉన్నావు మేమేం అనుకోండి పద్మావతి చేతికి గాయం అయింది దానికి నువ్వు కాకపోతే ఎవరు భోజనం పెడతారు. అని అరవింద కూడా అనడంతో ఇంట్లో అందరూ పోస్ట్ చేయడంతో వికీ సరే భోజనం పద్మావతికి పెట్టాలి అని అనుకుంటాడు. అంతలో కుచల స్పూన్తో పెట్టు విక్కీ చేత్తో ఎందుకు అని అంటుంది. నారాయణ నువ్వు కాస్త ఆపుతావా అని అంటాడు. ఇక విక్కీ పద్మావతికి భోజనం కలిపి నోట్లో పెడతాడు దానికి పద్మావతి చాలా సంతోషిస్తుంది అది చూసి కృష్ణ చాలా కుళ్లుకుంటాడు. అదంతా ఆర్య గమనిస్తూనే ఉంటాడు. మీ మనసులో దాగి ఉన్న ప్రేమ ఏదో ఒక రూపంలో బయటికి వస్తుంది సార్ మీరు ఎంత దాచాలనుకున్నా అది దగదు. మీ మనసులో ఉన్న ప్రేమని నేను బయటకు తీసుకొస్తాను. శ్రీనివాస ఈయన మనసు త్వరగా మార్చప్ప అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి.

Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights

కృష్ణకు బాగా మండింది..

ఇక అరవింద విక్కీ ప్రేమని చూసి సంతోషిస్తుంది వీడి మనసులో మార్పు మొదలైతే అంతకన్నా, కావాల్సిందేముంది అని అనుకుంటుంది మనసులో ఇక అందరూ భోజనం చేస్తూ ఉంటారు పద్మావతి ఇక నాకు చాలు అని అంటుంది విక్కీ భోజనం చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే కృష్ణ భోజనం కలుపుకోబోతూ చెయ్యి, నొప్పి చేయడంతో అరుస్తాడు వెంటనే అందరూ కృష్ణ వైపు చూస్తారు ఏమైంది అని అడుగుతారు కృష్ణ సైలెంట్ గా ఉంటాడు. వెంటనే ఆర్య వికీ పద్మావతి అలా ఉండడం చూసి బావకి మండింది అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అని అంటుంది అరవింద. పద్మావతి లాగానే బావ కూడా కర్పూరం వెలిగించాడు కదా చేతిలో అందుకని బావ కూడా మండింది చెయ్యి కాలింది కదా అందుకే నొప్పి చేసినట్టు ఉంది అని అంటాడు. ఆ మాటలకి అరవిందా అవునా ఏది చూపియండి అని అంటుంది ఏం లేదులే రానమ్మ అని అంటాడు. సరే మీకు భోజనం నేను పెడతాను లేండి అని అంటుంది అరవింద అంతలో ఆర్య అడ్డుపడి ఏం అవసరం లేదు అక్క నువ్వు భోజనం చేయి బావకి బంగారంలా చూసుకునే బావమరిది నేనున్నాను కదా నేను తినిపిస్తాను అని అంటాడు. ఏం అవసరం లేదు లేరా నేనే తినిపిస్తాను అంటుంది ఆర్య వద్దు అక్క నువ్వు కష్టపడకు నీకు నేనున్నాను కదా నేను తినిపిస్తాను కదా అని అంటాడు ఆర్య. ఇక వీడు చెప్పిన వినేటట్టు లేదండి వాడితోనే భోజనం పెట్టించుకోండి అని అంటుంది అరవింద కృష్ణతో, కావాలని ఆర్య ఎక్కువ కారం కలిపి కృష్ణ కి నోట్లో అన్నం పెడతాడు. ఏం బావ నేను పెట్టిన అన్నం బాగుందా నీకోసమే నెయ్యి ఎక్కువ వేసి మరీ పెడుతున్నాను. అని అందరి ముందు అడుగుతూ ఉంటాడు మంచినీళ్లు తాగుదాం అనుకుంటాడు కృష్ణ ఆ కారానికి తట్టుకోలేక అయినా సరే, ఆర్య అడ్డుపడి నువ్వు మంచినీళ్లు తాగడానికి వీల్లేదు బావ మంచినీళ్లు తాగితే అన్నం ఎక్కువ తినలేవు నేను పెడుతున్నాను కదా నువ్వు కమ్మగా తిను అని చెప్పి కావాలని ఎక్కువ కారం వేసి అన్నం పెడతాడు. ఆర్య ఇది ఎలా ఉంది అని మనసులో అంటాడు. కృష్ణ చెప్తాను మీ అందరికీ నేనంటే ఏంటో నిరూపిస్తాను దగ్గర్లోనే ఉంది మీ అందరికీ, నేనంటే ఏంటో నిరూపించుకుంటాను. అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ.

Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights

కృష్ణ ఆనందం.. చెక్ పెట్టిన అరవింద..

ఇక కృష్ణ బయటికి వచ్చి, తన దగ్గర ఉన్న రెండో కి తీసి ఈ కీ తో ఇప్పుడు నేను అనుకున్నది సాధిస్తాను. అని వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. విక్కీ లాకర్ కి డూప్లికేట్ కి తయారు చేయించుకొని, అది చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇంకెంతో కాలం లేదు మనం అనుకున్నది సాధించడానికి నేను పని పూర్తి అవ్వగానే నీకు ఫోన్ చేస్తాను. అని కృష్ణ మాట్లాడుతూ ఉండగా అప్పటికే అరవింద, కృష్ణ కోసం వెతుకుతూ అక్కడికి వస్తుంది. కృష్ణ ని చూసి అరవిందా, ఎక్కడున్నారా అని అంటుంది వెంటనే కృష్ణ ఫోన్ పెట్టేసి అరవింద్ మొత్తం విన్నదా ఏంటి అని అనుకుంటాడు ఇక్కడ తన చేతిలో ఉన్న జేబులో పెట్టేసుకుంటాడు అరవింద చూడకుండా, ఏంటండీ ఇక్కడ ఉన్నారు అని అడుగుతుంది అరవింద దానికి కృష్ణ టెన్షన్ పడుతూ ఉంటాడు మొత్తం వినేసింది, అని అనుకొని కానీ అరవింద ఏమీ వినదు. ఆ విషయం అర్థం అయ్యి కృష్ణ హమ్మయ్య అరవింద్ ఏమి వినలేదు అన్నమాట నేను ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది అరవింద టెన్షన్ ఏం లేదు అరవింద ఒక కేసు గురించి మాట్లాడుతున్నాను అని అంటాడు. నా దగ్గర మళ్లీ ఏదో దాస్తున్నాడు. అని అరవింద మనసులో అనుకుంటుంది. ఇక కృష్ణ అరవింద అని సంతోష పడుతూ ఉంటాడు. నీకు అంతలో అరవింద సూపర్ ట్విస్ట్ ఇస్తుంది. మీకు నేను చాలా రోజుల నుంచి ఒక విషయం చెబుదాం అనుకుంటున్నాను కానీ మీరు నాకు అందుబాటులో ఉండటం లేదు అని అంటుంది పర్వాలేదా ఇప్పుడు చెప్పు నేను ఖాళీగానే ఉన్నాను వింటాను అని అంటాడు కృష్ణ.మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలండి అని అంటుంది. అంటే ఏంటి అరవింద అని అంటాడు అదేనండి మనం ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటున్నాము ఇక ఆర్య వాళ్లకి పెళ్లి అయిపోయింది ఇప్పుడు పద్మావతి అణువులు ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు మనం ఉండాల్సిన అవసరం లేదు ఇక వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ పెళ్ళాలు వచ్చారు కాబట్టి నేను ఇక్కడ నుంచి, వెళ్ళిపోతే మంచిది అని అనుకుంటున్నాను అందుకే మనం త్వరలో ఇంకో ఇల్లు చూసుకుందాం అని అంటుంది. ఆ మాటలకి కృష్ణ మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి అరవింద నువ్వు మాట్లాడేది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అంటాడు. అవునండి మనం ఇక నుంచి త్వరగా వెళ్లిపోవాలి అని అంటుంది సరే ఇప్పుడు కాదు కానీ నీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత వెళ్దాము. అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి అక్కడ ఒక్కదానివి ఏం చేసుకుంటావో, ఇక్కడైతే నిన్ను చూసుకోవడానికి పద్మావతి వాళ్ళు ఉన్నారు కదా అని అంటుంది. ఆ మాటలకు అరవింద సరే అని వెళ్ళిపోతుంది. ఇక కృష్ణ మనసులో అరవింద నా మీద అనుమానంతో ఇలా మాట్లాడుతుందో లేదంటే నిజంగానే వెళ్దాం అనుకుంటున్నా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా నా పని పూర్తవ్వాలి తొందరగా నా పని పూర్తి చేసి ఇకనుంచి వెళ్లాలి అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights
Nuvvu Nenu Prema Today Episode December 09 2023 Episode 489 Highlights

విక్కీ ప్రేమ.. కృష్ణ పగ..

ఇక అరవింద విక్కీ దగ్గరికి వెళ్లి తను వెన్నపూస విక్కి ఇచ్చి పద్మావతి చేతి గాయానికి రాయమని చెప్తుంది. విక్కీ అరవింద్ అన్న అనుకుంటుందని సరే అని వెన్నపూసలు తీసుకొని మేడ మీదకి వెళ్తాడు. పద్మావతి నిద్రపోవడం గమనించి విక్కీ వెన్నపూస రాద్దాం అనుకుంటాడు. మళ్లీ ఇప్పుడు పద్మావతి గనక లేచింది అంటే తన మీద నాకు ప్రేమ ఉందని అనుకుంటుంది వద్దులే అని అక్కడ పెట్టేస్తాడు. కానీ విక్కీకి మనసు అంగీకరించదు తన చేతికి గాయం అయితే నేను పట్టించుకోకపోతే ఎలా, తను నాకోసమే కదా ఇంత చేసింది అని మనసులో అనుకుంటాడు అయినా అరవింద కోసమైనా నేను ఇదంతా చేయాలి లేదంటే అక్క బాధపడుతుంది అని అనుకొని పద్మావతికి వెన్నపూస రాస్తాడు అదంతా పద్మావతి గమనిస్తుంది పద్మావతి వికీ వెళ్లబోతుంటే మధ్యలో లేచి నేను అంతా చూసాను సార్ అని అంటుంది. విక్కీ నేను నీకోసం ఏమి ఇదంతా చేయలేదు అని అంటాడు అయినా పద్మావతి వినిపించుకోకుండా విక్కిని హగ్ చేసుకుని, ముద్దు పెడుతుంది. విక్కీ ఇలాంటివన్నీ నేను అందుకే చేయను నువ్వేదో ఊహించుకుంటావు నిన్ను నా భార్యగా నేను ఎప్పటికీ ఒప్పుకోవట్లేదు. ఏదో సాటి మనిషిగా సహాయం చేశాను అంతే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పద్మావతి మాత్రం విక్కీ మనసులో మార్పు మొదలైంది దానిని నేను ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి అని అనుకుంటుంది. ఇదంతా దూరం నుంచి కృష్ణ చూస్తాడు కృష్ణ వెంటనే మనసులో పద్మావతి వికీలు చేసిన వ్రతం ఫలించేటట్టు ఉంది ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీయాలి అనుకుంటాడు.

రేపటి ఎపిసోడ్లో విక్కీ కృష్ణ చేసిన మోసం కనిపెట్టేస్తాడు తన దగ్గర ఉన్న కీ డూప్లికేట్ కి రెండు తీసుకొచ్చి కృష్ణుని పర్సనల్గా ఆఫీసుకు రూమ్ లో పిలిచి ఈ రెండు కీస్ చూపిస్తాడు. ఇవేంటి బావ అని అంటాడు వెంటనే కృష్ణకు అప్పటికే అర్థమయిపోతుంది నేను చేయించిన కీ కూడా విక్కీ దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంటాడు. నువ్వు టెన్షన్ పడుతున్నావ్ అంటే కచ్చితంగా ఇది నీ పని అయి ఉంటుంది నా పర్సనల్ కి నువ్వు ఎందుకు చేయించుకున్నావు నిజం చెప్పు అని అంటాడు. కృష్ణ ఏమీ మాట్లాడకుండా టెన్షన్ పడుతూ ఉంటాడు వెంటనే వికీ నువ్వు ఇలా చెప్పవు అని గం తీసి కృష్ణ కి గురి పెడతాడు. కృష్ణ ఒకసారి గా షాక్ అవుతాడు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri