Mrunal Thakur: గత ఏడాది విడుదలైన “సీతారాం” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. క్లాసికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం జరిగింది. రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీత పాత్రలో మృణాల్ ఠాకూర్ అందరిని ఆకట్టుకున్నారు. రష్మిక మందన, సుమంత్ కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని.. వైజయంతి మూవీస్ బ్యానర్ సమర్పణలో.. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వినీ దత్, విధంగా స్వప్న దత్ నిర్మించారు. 1964 నాటి నేపథ్యంలో, లెఫ్టినెంట్ రామ్, కాశ్మీర్ సరిహద్దులో పనిచేస్తున్న అనాథ ఆర్మీ అధికారి.. సీతా మహాలక్ష్మి నుండి ప్రేమ లేఖలను పొందాడం, ఆ తర్వాత రామ్…సీతను కనుగొని తన ప్రేమను.. ఎలా గెలిపించుకోవాలని ప్రయత్నం చేశాడు.
సీతామహాలక్ష్మితో రామ్ జీవిత ప్రయాణం చివరిదాకా వెళ్ళిపోకుండా దేశ రక్షణ కోసం శత్రుదేశం పాక్ ఆర్మీ చేతిలో రామ్ మరణించడం చాలా అద్భుతంగా సినిమాని తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి కొనసాగింపుగా సీతారామం సెకండ్ పార్ట్ వస్తుందని గత కొద్ది రోజుల నుండి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా మృణాల్ ఠాకూర్.. ఈ వార్తలపై స్పందించారు. “సీతారామం” రెండో భాగం వచ్చిన తాను చేయనని స్పష్టం చేశారు. సీతా కేవలం రామ్ కోసమే.. మరో శ్యామ్ లాంటి వాళ్ల గురించి కాదు. అదొక క్లాసికల్ సినిమా. ఆ సినిమాని అక్కడితో అలా ఉంచితేనే చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చారు. ఇటీవల నాచురల్ స్టార్ నానితో నటించిన “హాయ్ నాన్న” సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతేకాదు తెలుగులో తక్కువ సినిమాలు చేస్తున్నట్లు యాంకర్ ప్రశ్నించగా లేదు నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు విడుదలవుతున్నట్లు తెలియజేశారు. ఇది గాక తర్వాత వచ్చే సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని మృణాల్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. తనకి టాప్ హీరోయిన్ అవ్వాలని లేదని ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి సినిమాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదే సమయంలో హృదయాన్ని హత్తుకునే స్టోరీలు..ఉంటే.. సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్టేట్మెంట్ ఇచ్చారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!