NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu Nenu Prema: విక్కీకి బాస్ అయిన పద్మావతి.. విక్కీ పద్మావతి లను శాశ్వతంగా దూరం చేయడానికి కృష్ణ ప్లాన్..?

Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights

Nuvvu Nenu Prema: పద్మావతికి, కృష్ణ వేసిన ప్లాన్ వల్ల, సృహ తప్పి పడిపోతుంది. విక్కీ పద్మావతిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. పద్మావతి స్పృహలో నుంచి బయటకు వచ్చి విక్కీ ని చూసి సంతోషపడుతుంది తనలో వచ్చిన ఈ మార్పు ఎప్పటికీ ఉండాలి అని అనుకుంటుంది. కృష్ణ చేసిన పనికి ఆర్య కృష్ణ కి వార్నింగ్ ఇస్తాడు కృష్ణ అందరికీ సమాధానం చెప్తాను అని, విక్కీ పద్మావతిని విడదీయడానికి, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights
Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights

ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. విక్కీ ఆఫీస్ కి బయలుదేరుతాడు పద్మావతి ముందు టిఫిన్ చేసి తర్వాత ఆఫీస్ కి వెళ్ళండి అని అంటుంది నువ్వెందుకు ఈ పనులన్నీ చేయడం పని వాళ్ళు ఉన్నారు కదా అని అంటాడు విక్కీ. నిన్న రాత్రి నీకు ఒంట్లో బాలేదు కదా ఇప్పుడు మళ్ళీ ఉదయాన్నే లేచి ఇవన్నీ చేయకపోతే రెస్ట్ తీసుకోవచ్చు కదా పద్మావతి అని అంటాడు. ఆ మాటలకు పద్మావతి సంతోషపడుతుంది ఒకప్పుడు నేనంటేనే మీకు గిట్టదు ఇప్పుడు మీలో మార్పు వచ్చింది నిన్న నాకు, జరిగిన ప్రమాదానికి మీరు చాలా బాధపడ్డారు అందరికన్నా ఎక్కువ మీరే కంగారు పడ్డారు తర్వాత నాకు చాలా సేవలు చేశారు నేను, సృహలో నుంచి బయటికి వచ్చేదాకా మీరు నా దగ్గరే కూర్చొని నన్ను ప్రేమగా చూసుకున్నారు ఇదే కదా సారు ప్రేమంటే, ఇంత జరిగినా కూడా మీ మనసు మారినా కూడా మీరు ఒప్పుకోరా అని అంటుంది పద్మావతి. చూడు నేను టిఫిన్ చేయడానికి వచ్చాను గాని నీ ముచ్చట్లు వినడానికి రాలేదు ముందు టిఫిన్ పెట్టు అని అంటాడు విక్కి. మనసులో ఉన్నది బయట పెట్టడు, ఇవాళ కాకపోతే రేపైనా మీ మనసులో ఉన్నది బయట పెట్టాల్సిందే అని పద్మావతి మనసులో అనుకొని విక్కికి టిఫిన్ పెడదాం అనుకుంటుంది. అప్పుడే అక్కడికి ఆర్య వస్తాడు చాలా డల్ గా ఫేస్ పెట్టి మాట్లాడుతుంటాడు.

Nuvvu Nenu Prema: పద్మావతి ప్రమాదం నుండి బయటపడనుందా? కృష్ణ గురించి నిజం తెలిసి ఆర్యా ఏం చేయనున్నాడు?

Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights
Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights

ఇక ఆర్య వికీ నాకు నిన్నటి నుంచి ఒంట్లో బాగోలేదు నేను ఆఫీస్ కి రాలేను నాకు ఒక టు డేస్ లీవ్ కావాలి అని అడుగుతాడు. పక్కనే ఉన్నాను అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా అని అంటుంది. ఆ మాటలకి ఆర్య అనుకి సైగ చేస్తాడు. విక్కీ పద్మావతులు కలవడానికి ఆర్య ప్లాన్ చేస్తున్నాడు అని అనుకి అర్థం అవుతుంది. అవును అవును మర్చిపోయాను అండి నిన్నటి నుంచి మీకు బాలేదు కదా అని అంటుంది. అవును బావగారు రాత్రి నుండి ఈయనకి కడుపులో నొప్పి తలనొప్పి అసలు నిద్రపోలేదు రాత్రంతా ఇప్పుడు ఆఫీసుకు కూడా రాలేరు లీవ్ ఇచ్చేసేయండి అని అడుగుతుంది అను, తనకి లీవ్ ఇస్తే ఆఫీసులో వర్క్ అంతా ఆగిపోతుంది అని అంటాడు విక్కీ. నా వర్క్ ఆగిపోకుండా ఉండడానికి నా బదులు పద్మావతిని తీసుకువెళ్ళు అని అంటాడు ఆర్య. ఆ మాటలకి అనుకి మొత్తం ఆర్య ప్లాన్ అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి అరవింద కూడా వస్తుంది. ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారు అని అంటుంది చూడక్కా నేను ఒంట్లో బాగోలేక లీవ్ అడిగితే విక్కీ ఇవ్వను అంటున్నాడు వర్క్ అంత ఆగిపోతుంది అంటున్నాడు. నువ్వు బాగోలేనప్పుడు ఆఫీస్ కి వెళ్లి వర్క్ ఎలా చేస్తాను నీరసంగా ఉన్నప్పుడు పడుకుంటాను గాని నువ్వైనా చెప్పు అక్క ఈరోజు నాకు లీవ్ ఇవ్వమని అని అంటాడు ఆర్య. లీవ్ ఇచ్చేసేవికి అని అంటుంది అరవింద. వర్క్ అంత ఆగిపోతుంది అక్క ప్రాజెక్ట్ తయారు చేసింది డిజైన్ చేసింది తనే కదా తను రాకపోతే ఎలాగు అని అంటాడు నా బదులు పద్మావతిని తీసుకెళ్లమంటున్నాను కదా అని అంటాడు ఆర్య అదిగో మళ్ళీ అదే మాట్లాడుతున్నావ్ పద్మావతిని ఎలా తీసుకెళ్తాను తనకు ఏం తెలుసు అని అంటాడు. ఆర్య ఆ మాట అనగానే అరవింద ఆర్యవైపు చూస్తుంది ఆర్య వాళ్ళిద్దరిని కలపడానికి ప్లాన్ చేస్తున్నట్లు అరవింద కి సరిగా చేస్తాడు ఆర్య మాటలకు సరే అని అంటూ ఉంటుంది.

Brahmamudi December 14 2023 Episode 279: రాజ్ ఎదపై శ్వేతని చూసిన అపర్ణ.. అయోమయంలో కావ్య.. స్వప్న అబార్షన్ కి రుద్రాణి ప్లాన్..

Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights
Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights

ఇక ఆర్య అరవిందా ఇద్దరు పద్మావతి అక్కడ పనులన్నీ చక్కదిద్దుతుంది తీసుకువెళ్ళు అని అంటారు ఇంట్లో వంట చేసినంత తేలిక కాదు ఆఫీస్ లో వర్క్ చేయడం అయినా ప్రాజెక్టు నీ పైకి తీసుకురావడానికి నేను ఎంతో కష్టపడుతున్నాను. ఇప్పుడు పద్మావతిని అక్కడ తీసుకెళ్తే అదంతా సర్వనాశనం అయిపోతుంది. అయినా పద్మావతికి ఏం తెలుసు అని నేను తీసుకెళ్లాలి అంటాడు. ఆ మాటలకి, అరవింద ఒకసారి మన ఆఫీసులో ప్రాబ్లం వచ్చినప్పుడు నీ గొంతు మూగబోయినపుడు పద్మావతి కదా హెల్ప్ చేసి ఆఫీస్ లో ఏ గొడవలు లేకుండా అన్నిటిని చక్కబెట్టింది అలాంటిది పద్మావతికేం తెలియదని ఎలా అంటావు నీతో పాటు సమానంగా పద్మావతి ఉంటుంది అని అంటుంది అరవింద. నువ్వు ఎంత సమర్థవంతంగా ఆఫీస్ నడుపుతాను అంతే నడుపుతుంది అని అంటుంది నారాయణ కూడా అదే అంటాడు. ఇక కృష్ణ మనసులో కావాలనే ఆర్య ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటాడు. ఇక వెంటనే నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటాడు. ఇక అందరూ పద్మావతిని ఆఫీస్కి తీసుకు వెళ్ళమని చెప్పడంతో విక్కీ అసలు ఆఫీసులో ఎలా ఉంటుందో పద్మావతికి చెప్తాడు వెంటనే పద్మావతికి చెమటలు పడతాయి చూశారుగా మీరందరూ మీకు ఆఫీసులో ఎలా వర్క్ చేస్తున్నానో చెప్పేసరికి పద్మావతికి చెమటలు పడుతున్నాయి ఇక తన ఆఫీసుకు చేంజ్ చేస్తుంది అంటాడు విక్కి. మరేం పర్లేదు సారు మిమ్మల్ని అర్థం చేసుకునే నాకు ఆఫీసులో మీ వర్క్ ని అర్థం చేసుకోలేను ఏంటి అని అంటుంది పద్మావతి. అవునా అంత బాగా అర్థం చేసుకుంటావా? అయితే ఒక రోజు సీఈఓ గా నా ప్లేస్ లో ఉండి చూడు తెలుస్తుంది అని అంటాడు విక్కీ. ఆ మాటలుకి పద్మావతి ఆశ్చర్య పోతుంది ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. పద్మావతి అలాగే సారు నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు నేను ఎలా కాదు అని అంటాను. భరతమాటే భార్య వినాలి కదా మీ మాట నేను కచ్చితంగా వింటాను ఒకరోజు సీఈవో అవుతాను అని అంటుంది. ఇక ఇంట్లో అందరూ సంతోష పడుతూ ఉంటారు అను నేను ఈ పనులన్నీ చేస్తాను నువ్వు వెళ్లి ఆఫీస్ కి రెడీ అవ్వు అని అంటుంది. ఇక పద్మావతి అలాగే అక్క అని రెడీ అవ్వడానికి వెళ్తుంది.

Brahmamudi December 14 2023 Episode 279: రాజ్ ఎదపై శ్వేతని చూసిన అపర్ణ.. అయోమయంలో కావ్య.. స్వప్న అబార్షన్ కి రుద్రాణి ప్లాన్..

Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights
Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights

ఇక ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని కృష్ణ అనుకుంటాడు వెంటనే బికే ఆఫీస్ లో పనిచేసే మేనేజర్ ని అర్జెంటుగా రమ్మని కాల్ చేస్తాడు. ఇద్దరు బయట కలుస్తారు ఏంటి సార్ ఇంత తొందరగా నన్ను రమ్మన్నారు. మీరు అనుకున్నట్లు విక్కీ పద్మావతిలో విడిపోయారా ఏంటి లేదంటే పద్మావతి ఇంట్లో నుంచి తింటేసారా ఆనందంతోనే నన్ను రమ్మన్నారా అని అంటాడు మేనేజర్, నువ్వు అనుకున్నవన్నీ తొందరలోనే జరుగుతాయి కాని ముందు నేను చెప్పింది జాగ్రత్తగా విను ఈరోజు మనం ఒక అవకాశం వచ్చింది దాని వాడుకోవాలి దానికి నీ సహాయం నాకు కావాలి అని అంటాడు. ఆ మాటలకి సారు నేను మీకు హెల్ప్ చేస్తే మీరు, నాకు వాటా ఇస్తారు కదా అని అంటాడు వాటాల గురించి ఇప్పుడు కాదు మనం మాట్లాడుకోవాల్సింది పని పూర్తయిన తర్వాత నేను నీ కష్టాన్ని ఉంచుకొని అని అంటాడు కృష్ణ మేనేజర్ చాలా సంతోషంగా ఏం చేయాలో చెప్పండి సార్ అని అంటాడు. ఈరోజు పద్మావతి ఒకరోజు సీఈవోగా ఆఫీసుకు వస్తుంది తను వచ్చిన తర్వాత నేను ఈరోజు ఏది చెప్తే నువ్వు అది లైన్లో ఉండి చేయాలి వాళ్ళిద్దరిని విడగొట్టడానికి మనకు ఒక మంచి అవకాశం వచ్చింది తను సీఈవో పోస్ట్ ఎందుకు తీసుకున్నాను అని అనుకునేలాగా మనకి కావాల్సిన విధంగా ఈరోజు ని మార్చుకోవాలి అని అంటాడు మేనేజర్ సారి అంటాడు ఇక నేను చెప్పింది జాగ్రత్తగా నువ్వు ఫాలో అయితే అంతే చాలు అని అంటాడు కృష్ణ సరే అని మేనేజర్ వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన కృష్ణ పద్మావతి ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతుందని, తనకోసం ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. మీ అందరూ చాలా సంతోషపడుతున్నారు. ఇది ఎంతసేపు ఉండదు అని మనసులో కృష్ణ అనుకుంటూ వాళ్లతో పాటు పద్మావతి ఇంకా రాలేదని వెయిట్ చేస్తూ ఉంటారు.

Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights
Nuvvu Nenu Prema Today Episode  December 15 2023 Episode 494 Highlights

ఇక పద్మావతి న్యూ లుక్ లో సూటుబొట్టు వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని మెట్ల మీద నిలిచి ఉంటుంది. వెంటనే పద్మావతిని చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు తెరిచేలానే చూస్తూ ఉంటుంది నారాయణ నోరుమూస్తావా నోట్లోకి ఏదైనా వెళ్తాయి అని అంటాడు. పద్మావతిని చూసి సంతోష పడుతూ ఉంటారు. అరవింద పద్మావతి గెటప్ చూసి ఆశ్చర్య పోతుంది. ఈ గెటప్ లో నువ్వు బలే ఉన్నావా మీ అని అంటుంది అను. మరి సీఈఓ అంటే ఈ మాత్రం రెడీ అవ్వాలి కదా అక్క అని అంటుంది పద్మావతి. ఇక పద్మావతిని చూసి కృష్ణ మీ ఆనందం ఎక్కువ సేపు ఉండదు ఆఫీస్ కి వెళ్లి అంతా తెలుస్తుంది అని అంటాడు. పద్మావతి ఇక వెళ్దామా సారు అని అంటుంది గెటప్ వేసిన అంత మాత్రం నువ్వు ఆఫీసులో నెగ్గలేవు పద్మావతి అని అంటాడు విక్కీ. చూస్తారు గా సారు నేను ఎలా ఆఫీస్ ని మెయింటినెన్స్ చేస్తాను అని అంటుంది పద్మావతి ఇక పద్మావతిని అందరూ పొగుడుతూ ఉంటారు పద్మావతి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని, ఆఫీస్ కి వెళ్దాం అని అంటుంది. అప్పుడే పద్మావతికి ఫోన్ వస్తుంది పద్మావతి ఫోన్ లిఫ్ట్ చేసి సీఈఓ హోదాలో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి విక్కీ చూసావా అక్క ఆఫీస్ కి వెళ్లకముందే ఎలా చేస్తుందో అని అంటాడు. ఇప్పుడు తన్ని బాస్ రా అని అంటుంది అరవింద. ఆర్య నాకు ఒక నెల లీవ్ కావాలి అని సీఈవోగా పద్మావతిని అడుగుతాడు. ఒక నెల ఏంటి బావగారు ఆరు నెలలు తీసుకోండి అని అంటుంది పద్మావతి వెంటనే విక్కీ అలాంటప్పుడు నువ్వు కూడా ఇంట్లోనే ఉండు అని అంటాడు. ఆ మాటలకు అర్వింద ఇప్పుడు తను సీఈఓ వన్డే నువ్వే తన మాట వినాలి తను నీ మాట వినడం కాదు అని అంటుంది. ఇక ఇద్దరూ ఆఫీస్ కి బయలుదేరుతారు. వెళ్లేటప్పుడు సంతోషంగా వెళుతున్న వీళ్ళిద్దరూ వచ్చేటప్పుడు ఎలా వస్తారో అని కృష్ణ అనుకుంటాడు.

రేపటి ఎపిసోడ్ లో పద్మావతి, స్టైల్ గా కారు దిగుతుంది విక్కీని ఫాలో అవ్వమని చెప్తుంది. ఆ మాటలకు విక్కీ కోపంగా పద్మావతి వెనకాలే వెళ్తూ ఉంటాడు. ప్రెస్ వాళ్ళందరూ పద్మావతి సీఈఓ అయినందుకు కంగ్రాట్యులేషన్స్ చెబుతూ ఇంటర్వ్యూ తీసుకుంటారు. విక్కీ ని ప్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు మీ భార్యని చాలా ప్రేమిస్తున్నారండి ఎంత ప్రేమ ఉంటే ఒక రోజు సీఈవో చేస్తారు. మీకు తను అంటే చాలా ఇష్టం ఇలా అర్థం చేసుకునే భర్త దొరకడం మీ భార్య అదృష్టం మీరు తనని ఇంత బాగా ప్రేమిస్తున్నారు అని అడుగుతూ ఉంటారు ప్రెస్ వాళ్లు ఆ మాటలకి విక్కీ పద్మావతి ఇద్దరూ ఒకరు ఒకరు చూసుకుంటూ ఉంటారు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri