NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Janasena – TDP: ‘త్యాగ’రాజులు అవుతారా..? తిరగబడతారా..? టీడీపీలో అంతర్మధనం..!

Janasena – TDP:  రాష్ట్రంలో టీడీపీ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో గతంలో ఏ ప్రభుత్వంలో జరగని విధంగా వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తొంది. జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా స్థిరమైన ఓటు బ్యాంక్ కల్పించుకునేందుకు నవరత్న పథకాల పేరుతో నగదు పంపిణీ కార్యక్రమాలను కఛ్చితంగా కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో కొంత మేర వ్యతిరేకత ఉన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో స్థిరమైన ఓటు బ్యాంకును వైసీపీ కల్గి ఉంది.

ఈ తరుణంలో అధికార వైసీపీని ఢీకొట్టాలంటే ప్రతిపక్షాలు అన్ని ఏకం కావాలని భావిస్తున్నాయి. అధికార వైసీపీని ఎదుర్కోవడానికి కలిసి ప్రయాణం చేయాల్సిందేనని టీడీపీ – జనసేన ఫిక్స్ అయ్యాయి. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు అయితే ఖరారు అయ్యింది. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కూటమికి జనసేన మద్దతు ఇచ్చినప్పటికీ పొత్తులో భాగంగా జనసేన అభ్యర్ధులను నిలపలేదు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి నుండి టీడీపీ బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసింది. జనసేన వామపక్షాలతో కలిసి పోటీకి దిగింది. కేవలం ఆరు శాతం ఓట్లు మాత్రమే సాధించింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాలు గాజువాక, భీమవరం లోనూ ఓటమి పాలైయ్యారు.

tdp janasena alliance
tdp janasena alliance

జనసేన ఒక్క స్థానం గెలవగా, ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరిపోయారు. టీడీపీ కేవలం 23 స్థానాలనే గెలుచుకుంది. ఆ తరువాత నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గూటికి చేరారు. ఈ సారి ఎన్నికల్లో జనసేన – టీడీపీతో కలిసి పోటీకి సిద్దమవుతోంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. గౌరవ ప్రదంగా సీట్లు జనసేన కోరుకుంటోంది. ఇదే పలు నియోజకవర్గాల్లోని టీడీపీ ఆశావహుల్లో ఆందోళన కల్గిస్తొంది. సంవత్సరాల తరబడి ఆయా నియోజకవర్గాల్లో రాజకీయం చేస్తున్న టీడీపీ నేతలకు పొత్తులో భాగంగా తమ సీట్లను త్యాగం చేయాల్సి రావడం మింగుడు పడటం లేదు.

TDP Janasena: CM Seat offer for Pavan Kalyan.. is it True..!?
 

రాష్ట్రంలో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి రావాలంటే కొందరు తమ సీట్లను త్యాగం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో కొందరు నాయకులు మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరించే పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. జనసేనకు సీటు త్యాగం చేసి త్యాగరాజులు అయ్యేందుకు కొందరు సిద్దం అవుతున్నా మరి కొందరు మాత్రం రెబల్స్ గా మారి పోటీ చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి.

ఇప్పటి వరకూ రెండు పార్టీల అధినేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశాలు జరిపారు. కానీ సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన ఇంత వరకు వెలువడలేదు. ఆయా పార్టీల వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగాయని అంటున్నారు. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి.. ఎక్కడెక్కడ నుండి ఏయే పార్టీలు పోటీ ఉండాలి అనే అంశంపై ప్రాధమిక స్థాయిలో చర్చలు జరిగినట్లుగా సమాచారం.

ఈ నెలాఖరులోగా సీట్ల సర్దుబాటును ముగించి అభ్యర్ధుల ప్రకటన కూడా చేసే దిశగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రణాళిక సిద్దం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎవరు సీటు కోల్పోవాల్సి వస్తుంది..? ఎవరు సేఫ్ పొజిషన్ లో ఉంటారు..? అనే అంశంపై టీడీపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  సీటు కోల్పోయే వారిలో సీనియర్ నేతలు కూడా ఉండటం వారి అనుచరుల్లో ఆందోళన రేకెత్తుతోంది. ఈ పొత్తుల నేపథ్యంలో త్యాగరాజులు ఎవరు అవుతారు..? తిరగబడే వారు ఎవరు అవుతారు..? అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

TS News: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం .. వారికి భద్రత తొలగింపు

Related posts

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N