NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Agent OTT: కామన్ గా మంచి విజయాలు అయినా సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఓటిటిలో మరోసారి చూడాలని ఆశపడతారు కూడా. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సినిమాలను సైతం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తే చూసేందుకు కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సినిమా విడుదల అనంతరం డిజాస్టర్ టాక్ దక్కించుకోవడంతో థియేటర్ కి వెళ్లేందుకు ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపారు. కానీ అదే సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తే మాత్రం ఆ సినిమా ఎలా ఉందో ఒకసారి చూసి నిర్ణయించుకుందాం అని అనుకుంటూ ఉంటారు. ఇక ఆ విధంగా థియేటర్లలో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటిలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

Agent OTT updates
Agent OTT updates

ఇక ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమా సైతం థియేటర్లలో మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ విజయం అందుకుంది. కానీ ఓ సినిమా మాత్రం రిలీజ్ ఏడాది అవుతున్నప్పటికీ ఓటీటీలోకి రాలేదు. ఆ సినిమా మరేదో కాదు అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ. ఈ చిత్రం రిలీజ్ అయ్యి నేటికి అనగా ఏప్రిల్ 28 నాటికి సంవత్సరం పూర్తయింది. అయినప్పటికీ ఈ మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. అదేవిధంగా టీవీల్లో సైతం ప్రసారం కాలేదు. సురేందర్ రెడ్డి తరస్కత్వంలో అఖిల్ హీరోగా యాక్షన్ స్పై త్రిల్లెర్ గా ఈ మూవీ తెరకెక్కింది. 2023 ఏప్రిల్ 28వ తేదీన భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ మూవీకి ఆరంభం నుంచి నెగిటివ్ టాక్ రావడంతో పెద్దగా వసూళ్లు కూడా రాబట్టుకోలేకపోయింది. ఏమాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.

ఏజెంట్ చిత్రం సుమారు రూ. 80 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. అయితే కేవలం సుమారు రూ. ఎండి పాయింట్ అయిదు కోట్లు కలెక్షన్స్ మాత్రమే రాబట్టి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం. నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ మూవీ భారీ నష్టాల గురించి నిర్మాతలు పలు సందర్భాల్లో మాట్లాడుతూనే వచ్చారు. స్క్రిప్ట్ పనులు పూర్తి కాకుండా సినిమాను మొదలుపెట్టడం సహా పలు కారణాలవల్ల ఈ చిత్రం డిజాస్టర్ అయినట్లు నిర్మాతలు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో మలయాల్ స్టార్ హీరో ముమ్మట్టి కూడా కీలక పాత్ర పోషించారు. దీంతో ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు మలయాళం లో సైతం రిలీజ్ చేశారు మేకర్స్.

అయితే ఈ మూవీ మలయాళం లో సైతం తీవ్రంగా నిరాశపరిచింది. హిందీ లో రిలీజ్ చేయాలని ముందుగా అనుకున్నప్పటికీ ఫలితం చూసి మేకర్స్ ఆ ప్రయత్నం చేయలేదు. ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సోనీ లీవ్ ఓటిటి ప్లాట్ ఫామ్ వద్ద ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మొదట్లో ఆర్థికపరమైన వివాదాల వల్ల ఈ చిత్రం లేదని సమాచారం బయటకు వచ్చింది. అయితే అలాంటిదేమీ లేదని మేకర్స్ చెప్పుకొచ్చారు. అయినప్పటికీ నెలలు గడుస్తున్నా ఈ సినిమా ని సోనీ లీవ్ స్ట్రీమింగ్ కు తీసుకురాలేదు. త్వరలో వస్తుంది అంటూనే కాలాన్ని గడుపుతున్నారు తప్పితే స్క్రీనింగ్ డేట్ ని మాత్రం కన్ఫామ్ చేయడం లేదు. ఇప్పటికే థియేటర్లలో ఈ మూవీ విడుదలై సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఈ మూవీ యొక్క ఓటీటీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తారేమో అంటే అది లేకపోయే.

Related posts

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N