Vijay Devarakonda: కొంతమంది స్టార్ హీరోలు ఒక సినిమాలో నటిస్తే ఆ క్యారెక్టర్ కి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కుతాయి కానీ మరికొందరికి మాత్రం ఆ క్యారెక్టర్స్ ద్వారానే తమ పేరు డిసైడ్ అవుతుంది. అలా ఇప్పటికే ఎంతోమంది ఉన్నారు. తాము చేసిన సినిమాల పాత్రల పేర్లతో తమ అభిమాన హీరోని గుర్తుపెట్టుకునే హీరోలు ఎందరో ఉన్నారు. అలా అర్జున్ రెడ్డి సినిమాతో అర్జున్ రెడ్డి గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వచ్చినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. అందరూ పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ పోతుంటే విజయ్ దేవరకొండ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు మంచి ప్రయత్నాలు చేస్తున్నాడు.
సమంతాతో ఖుషి సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే పక్కా సూపర్ హిట్ అయ్యేలాగానే అనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 5 2024న రిలీజ్ అవ్వనుంది. ఇక ఇదిలా ఉంటే గత కొంతకాలం నుంచి విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన పై అనేక రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ నటించిన గీతాగోవిందం నాటి నుంచి వీరిపై రూమర్స్ రావడం మొదలయ్యాయి. ఇక వీటిపై ఇటు విజయ్ దేవరకొండ అటు రష్మిక మందన స్పందించినప్పటికీ వాటిని ఫాన్స్ లెక్కల్లోకి తీసుకోవడం లేదు. ఇక వారీ సంతోషానికి తగినట్లుగానే ఒకరి పాటలు మరొకరి వేసుకోవడం వంటివి కూడా చేస్తూ ఫుల్ ట్రెండ్ అవుతున్నారు.
తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు తెలీదు కానీ వీరు చేసే ప్రతి పనిని కూడా ఫాన్స్ ఇట్టే గుర్తుపట్టేస్తున్నారు. ఇక ప్రస్తుత కాలంలో విజయ్ దేవరకొండ మరియు రష్మిక కి పెళ్లి అంటూ అనేక ప్రచారాలు జరిగాయి. కానీ వీటిలో ఎటువంటి నిజం లేదని విజయ్ దేవరకొండ నోరు విప్పడంతో వీటికి అడ్డు కట్టబడింది. ఇక ప్రస్తుతానికి అయితే వీరిద్దరిపై రూమర్స్ రాసి రాసి ప్రేక్షకులు అలసిపోయారు. ఎన్ని సంవత్సరాలు చూసిన వీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదని డిసప్పాయింట్ అవుతున్నారు కూడా. ఇటీవలే యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రష్మిక ప్రస్తుతం పుష్పా సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీ అయింది.
ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ కి కెరీర్ ఇచ్చిన సందీప్ వంగానే ఈ సినిమాని రూపొందించడం విశేషం. ఇక ఇదిలా ఉంటే ఇటు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క సోషల్ మీడియాలో సైతం తన ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటాడు విజయ్ దేవరకొండ. తాజాగా ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ కి వెళుతూ స్పెషల్ లుక్స్ రిలీజ్ చేశాడు. వైట్ కలర్ షర్ట్ అండ్ బిస్కెట్ కలర్ ప్యాంట్ తో ప్రతి ఒక్కరికి అర్జున్ రెడ్డిని గుర్తు చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో నెట్ ఇంట హల్చల్ చేస్తుండగా..” రౌడీ హీరో అంటే మినిమం ఉంటుంది. ఏ మాటకి ఆ మాట సూపర్ ఉంది బ్రో. అయినా మీ ముందు ఏ స్టార్ హీరో కూడా సరిపోరు. మీ స్కిల్స్ కానీ మీ గ్లామర్ కానీ వేరే లెవెల్ ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.