Hi Nana: నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం ” హాయ్ నాన్న “. తన కెరీర్లో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేసిన నాని హాయ్ నాన్న సినిమాతో మరోసారి సక్సెస్ పొందాడు. తాను చేసే ఒక్కో సినిమా ఒక్కో డైరెక్టర్ భవిష్యత్తు అని చెప్పవచ్చు. నూతన దర్శకులకి అవకాశం ఇస్తూ దూసుకుపోతున్నాడు.
వారు కూడా తమకి ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటూ ఇండస్ట్రీలో ఓ రేంజ్కి ఎదుగుతున్నారు. అలా శౌర్యూవ్ అనే దర్శకుడు కి కూడా ఓ అవకాశం ఇచ్చి తన ఖాతాలో సూపర్ హిట్ విజయం వేసుకున్నాడు నాని. హాయ్ నాన్న రిలీజ్ కి ముందు మృణాల్ మరియు నాని మధ్య ఉండే సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ అనంతరం వీరి మధ్య నడిచే కథాంశం కి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకున్నారు.
మొదటి షోకే పాజిటివ్ టాక్ దక్కించుకుని దూసుకుపోయింది ఈ మూవీ. ఇక అనంతరం ఓటిటి లో కూడా సందడి చేసి మరోసారి తన సత్తా చాటుకుంది. ఇక ప్రస్తుతం టీవీలోకి కూడా రానున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీ ఈరోజు అనగా మార్చి 17 సాయంత్రం 6 గంటలకు జెమినీ టీవీలో ప్రసారం కానున్నట్లు హీరో నాని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించాడు. ” ఆదివారం సాయంత్రం మీ ఇంటికి మహి వస్తుంది.. మహి వస్తుందంటే వాళ్ళ నాన్న కూడా రాబోతున్నాడు ” అనే ఒక క్యాప్షన్ తో ఈ మూవీ యొక్క టీవీ రిలీజ్ ను ప్రకటించాడు నాని.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీని ఇప్పటికే అనేకమంది ఓటిటి మరియు థియేటర్లో కూడా వీక్షించారు. కానీ కొన్ని సినిమాలు ఎంత వీక్షించినా మరోసారి చూడాలనిపిస్తాయి. వాటిలో హాయ్ నాన్న మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకి కార్తీక్ అందించిన పాటల దగ్గర నుంచి కథాంశం వరకు వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం సాయంత్రం 6 గంటలకి సిద్ధం అయిపోయింది.