Jio cinema OTT: జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో అధిక శాతం కంటెంట్ ఉచితంగానే అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) మ్యాచ్లను కూడా ఉచితంగా ప్రేక్షకులకు అందిస్తుంది ఈ ప్లాట్ ఫామ్. కొన్ని హాలీవుడ్ చిత్రాలు తప్ప దాదాపు జియో సినిమాలో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు , టీవీ కంటెంట్ ఉచితంగానే చూడొచ్చు. అయితే ఈ క్రమంలో ఓ కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ను ప్రవేశ పెట్టేందుకు జియో సినిమా సిద్ధమైంది. ఇది యాడ్ ఫ్రీ ప్లాన్ గా ఉండనుంది. వివరాల్లోకి వెళితే.. ఏప్రిల్ 25వ తేదీన కొత్త ప్లాన్ ను తీసుకురానున్నట్టు జియో సినిమా ఓటిటి ప్లాట్ఫామ్ వెల్లడించింది.
ఈ విషయంపై అధికారికంగా ప్రోమో తీసుకొచ్చింది. యాడ్లు లేకుండా కంటెంట్ చూసేలా ఈ ప్లాన్ ఉండనుంది. ప్రస్తుతం ఐపీఎల్ సాగుతున్న తరుణంలో ఈ ప్లాను ప్రవేశపెట్టింది. జియో సినిమాలో ప్రస్తుతం ఏదైనా కంటెంట్ చూస్తున్నా.. స్పోర్ట్స్ మ్యాచులు చూస్తున్న ఆడ్స్ వస్తున్నాయి. కాస్త ఎక్కువగానే యాడ్స్ ప్లే అవుతున్నాయి. అయితే యాడ్స్ లేకుండా చూడాలనుకునే వారి కోసమే కొత్తగా ఈ యాడ్ ఫ్రీ ప్లాన్ ను ఏప్రిల్ 25వ తేదీన జియో సినిమా ప్రవేశపెట్టనుంది. అదేవిధంగా ఉచితంగా చూడాలనుకునే వారికి సదుపాయం అలాగే ఉండనుంది. అయితే ఎప్పటిలాగే రానున్నాయి.
ఒకవేళ యాడ్ ఫ్రీ ప్లాన్ చేసుకుంటే యాడ్స్ నుంచి ఉపశమనం పొందొచ్చు. జియోసావన్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్ విషయంలో ఇదే స్ట్రాటజీని అప్పట్లో రిలయన్స్ ఫాలో అయ్యింది. ఆరంభంలో అంతా ఉచితంగా ఇవ్వగా ఆ తరువాత యాడ్స్ లేకుండా వాడేందుకు జియో సావన్ ప్లాను తీసుకొచ్చింది. అయితే ఈ యాడ్స్ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ధరకు ఏప్రిల్ 25వ తేదీన జియో సినిమా వెల్లడించనుంది. మరి ధర ఎంత ఉండనుందో చూడాలి. జియో సినిమాలో ఐపీఎల్ 2024 మ్యాచ్లు ఉచితంగా లైవ్ స్ట్రీమ్ అవుతున్నాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హర్యాణ్వి, మరాఠి, గుజరాతి, పంజాబీ, బెంగాలీ, భోజ్పురి, భాషల్లో మ్యాచులు లైవ్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. చాలా సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు అదే విధంగా టీవీ కంటెంట్ కూడా జియో సినిమాలో ఉచితంగా అందుబాటులో ఉంది.
జియో సినిమా ఓటిటిలో గతంలోనే ఓ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. జియో సినిమా ప్రీమియర్ పేరుతో ఈ ప్లాన్ ఉంది. హెచ్ బీవో ప్రీమియం కంటెంట్ తో పాటు కొన్ని హాలీవుడ్ చిత్రాలను ఈ ప్రీమియం ప్లాన్ ఉంటేనే ఆ ప్లాట్ ఫామ్ లో చూడగలం. ప్రస్తుతం జియో ప్రీమియం ప్లాన్ ధర నెలకు రు. 99 గా ఉండగా సంవత్సరానికి 999 గా ఉంది. మరి కొత్తగా తీసుకొచ్చే ప్లాన్ ధరను జియో సినిమా ఎంతకు తీసుకొస్తుందో చూడాలి. అదేవిధంగా యాడ్ ఫ్రీ కాకుండా మరేమన్నా బెనిఫిట్స్ ను ఇస్తుందో లేదో అని ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. కాగా రిలయన్స్, డిస్నీ త్వరలోనే వీలినం కానున్నాయి. ఈ విలునాని కి ఇప్పటికే రెండు సంస్థలు ఒప్పందం ఖరారు చేసుకున్నాయి. ఈ ఒప్పందం తరువాత రిలయన్స్ వియాకామ్ పెద్దమెందుకు చేరిన టీవీ ఛానళ్లు, స్టార్ ఇండియా చానళ్లు ఒకటి కానున్నాయి.