Tantra OTT Release: ప్రస్తుత కాలంలో హారర్ జోనర్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. ఆ మధ్య కాలంలో హర్రర్ సినిమా అంటేనే ఎవరు రూపొందించడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ప్రస్తుత కాలంలో వాటికి డిమాండ్ పెరగడంతో ప్రతి ఒక్కరు వాటిపైనే దృష్టి పెట్టారు. అయితే హారర్ కు క్రైమ్, కామెడీ, ఫాంటసీ వంటి అంశాలను కూడా టచ్ చేస్తూ సరికొత్త కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్స్. ఇక ఇటీవలే పూర్తి హర్రర్ జోనర్ మూవీ థియేటర్లో విడుదలైంది. అదే తంత్ర. క్షుద్ర పూజల నేపథ్యంలో సుమారు 20 రోజుల క్రితం థియేటర్లో విడుదలైన ఈ తంత్ర మూవీ అతి తక్కువ సమయంలోనే ఓటిటి రిలీజ్ కి సిద్ధమయ్యింది.
పూర్తి హారర్ అంశాలతో తెరకెక్కిన తంత్ర మూవీ ప్రముఖ తెలుగు ఓటిటి సమస్త ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. ఇక దీనిని స్వయంగా తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తంత్ర సినిమాను ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలియజేశారు. ” తంత్రం మంత్రం కుతంత్రం.. ఆహా అందిస్తున్న మరో హర్రర్ చిత్రం.. తంత్ర ఏప్రిల్ ఐదు నుంచి డిజిటల్ ప్రీమియర్ కానుంది ” అనే ఓ కొటేషన్ తో ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది ఆహా. ఇటీవలే భూతద్దం భాస్కర్ నారాయణ వంటి మైథానాజికల్ క్రైమ్ ట్రేలర్ మూవీ అదేవిధంగా మా ఊరి పొలిమేర 2 వంటి హారర్ సినిమాలను తీసుకొచ్చిన ఆహా ఇప్పుడు మరో హర్రర్ జోనర్ తో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక తంత్ర సినిమా ఇటీవల మార్చి 15న థియేటర్లో విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ని సైతం దక్కించుకుంది.
సినిమాలో పూర్తిస్థాయిలో హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయని రివ్యూలు కూడా వచ్చాయి. ఇక సినిమా కి మంచి టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా అంతగా ఎఫెక్ట్ చూపించలేదు. అలా మంచి టాక్ సంపాదించుకున్న తంత్ర మూవీ నెల కాకముందే 20 రోజుల్లోపే ఓటిటిలోకి రావడం సినీ ప్రియులకు గుడ్ న్యూస్ అయింది. థియేటర్లో మిస్సయిన వారు అంతా ఈ మూవీని ఆహా ఓటీటీలో వాచ్ చేయవచ్చని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే తంత్ర మూవీలో అనన్య నాగళ్ళ మరియు ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఫస్ట్ కాపీ మూవీస్, బీదవే ఫిలిమ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు శ్రీనివాస్ గోపి శెట్టి దర్శకత్వం వహించాడు.
ఇక ఈ మూవీ కథ విషయానికి వస్తే.. రేఖ అలియాస్ అనన్య నాగళ్ళ పుట్టుకతోనే తల్లి రాజలక్ష్మిని (సలో ని) కోల్పోతుంది. నానమ్మ సంరక్షణలో పెరుగుతుంది. తేజూ(ధనుష్) ను ఇష్టపడుతుంది. తేజు వేశ్య కొడుకు కావడంతో వారి ప్రేమకు అనేక అడ్డంకులు ఎదురవుతాయి. క్షుద్ర శక్తుల కారణంగా జన్మించడంతో రేఖ చుట్టు ఎప్పుడు దయాలు తిరుగుతుంటాయి. పౌర్ణమి వచ్చిందంటే రేఖను వెతుక్కుంటూ ఓ రక్త పిశాచి వస్తుంది. ఇక రేఖ ఆ శుద్రశక్తుల నుంచి బయటకి ఎలా వస్తుంది? అసలు రేఖ నేపథ్యం ఏమిటి? అని కధాంశం చుట్టూ ఈ మూవీ తిరుగుతుంది. మరి ఈ మూవీ థియేటర్లో అయితే పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది మరి ఓటీటీట లో ఎటువంటి టాక్ దక్కించుకుంటుందో చూడాలి.