Thulasivanam Web Series: ప్రస్తుత కాలంలో ఓటీటీలకు ఎంత ప్రేక్షక ఆదరణ దక్కుతుందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు హీరోలు సైతం తమ సినిమాలను వెబ్ సిరీస్ కింద రిలీజ్ చేస్తున్నారు. ఇక తాజాగా డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రెసెంట్ అర్గా వ్యవహరిస్తున్న తెలుగు కామెడీ వెబ్ సిరీస్ తులసివనం ఓటీటీలోకి రానే వచ్చాయి. గురువారం నుంచి ఈ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఫస్ట్ ఎపిసోడ్ ను ఫ్రీగా ఈటీవీ విన్ వారు చూడవచ్చని ఒక బంపర్ ఆఫర్స్ అయితే ఇచ్చారు. ఇక ఈ సిరీస్ నుంచి మొత్తం మూడు ఎపిసోడ్లను మాత్రమే రిలీజ్ చేశారు. మిగిలిన ఎపిసోడ్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సిరీస్ లో అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకుమాను, టాక్సీవాలా విష్ణు కీలక పాత్రలు వహించారు. తులసి అనే యువకుడి జీవితంలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ద్వారా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.
తులసిని ఐఏఎస్ ఆఫీసర్గా చూడాలని తండ్రి కోరుకుంటాడు. కానీ తులసి మాత్రం క్రికెటర్ కావాలని ఆశతో ఉంటాడు. కానీ తండ్రి బలవంతంతో సాఫ్ట్వేర్ జాబ్ లో తులసి జాయిన్ అవ్వాల్సి వస్తుంది. హైదరాబాద్కు వచ్చిన అతడు కలలకు వాస్తవ జీవితానికి మధ్య ఎలాంటి సంఘటనలు జరిగాయి? అసలు సాఫ్ట్వేర్ జాబ్ లోనే ఎందుకు జాయిన్ అయ్యాడు? అనే కథాంశం చుట్టూ ఈ సిరీస్ తిరుగుతాయి.
ఇక ఈ సిరీస్లో ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా వేరే లెవల్ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీలో అనేకమంది ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ ప్రజంటర్గా వ్యవహరిస్తున్న ఈ సిరీస్ ను స్వాగత్ రెడ్డి, నిలిత పైడిపల్లి, జీవన్ కుమార్, ప్రీతం కలిసి నిర్మించారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వెబ్ సిరీస్ నే తులసివనం. హాస్టల్ డేస్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈయన సినిమాల కంటే సిరీస్ తోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మరి రానున్న రోజుల్లో ఎటువంటి కాన్సెప్ట్లతో ప్రేక్షకుల ముందుకి వస్తాడో చూడాలి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!