Zombie Movies OTT: ప్రస్తుత కాలంలో హర్రర్ జోనర్ లో జాంబి సినిమాలు చాలా నే వచ్చాయి. మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకువెళ్లే సినిమా జోనర్స్ లో ఇవి కూడా ఒకటి. తెలుగులోనూ హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జాంబి రెడ్డి అనే ఓ సినిమా తెరకెక్కింది. ఇక ఈ మూవీ అప్పట్లో చిన్నపిల్లలతో పాటు పెద్ద వారిని కూడా భయానికి గురి చేసింది. ఇక అటువంటి జోనర్ లోనే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు లాంటి ఓటిటీలలో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఈ జోనర్ ని ఇష్టపడే వారికి ఈ సినిమాలు తప్పకుండా నచ్చుతాయని చెప్పుకోవచ్చు. మరి ఆ సినిమాలేంటి? వాటి డీటెయిల్స్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.
1. జాంబి రెడ్డి:
హనుమాన్ మూవీతో ఓవర్ నైట్ లో గుర్తింపును సంపాదించుకున్న తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో 2020లో వచ్చిన మూవీ జాంబి రెడ్డి. తెలుగులో ఈ జోనర్ లో వచ్చిన తొలి సినిమానే ఇది. ఓ స్నేహితుడి పెళ్లికి వెళ్లి జాంబీల బారిన పడే స్నేహితుల చుట్టూ తిరిగే కథా. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతులు కలిగించింది ఈ సినిమా. ఇక ఈ మూవీ ప్రస్తుతం జీ5 ఓటిటిలో అందుబాటులో ఉంది.
2. జాంబి ల్యాండ్:
జాంబి ల్యాండ్ ఓ హారర్ కామెడీ మూవీ. ఊహించని వ్యాధి మనుషులందరినీ జాంబీలుగా మారుస్తూ ఉంటుంది. వాటి నుంచి నలుగురు మాత్రం తప్పించుకుని వెళ్తారు. ఇక అలా సాగే ఈ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
3. ట్రెయిన్ టు బూసాన్:
ఇదొక కొరియన్ హర్రర్ మూవీ. ఈ మూవీ కచ్చితంగా చూడాల్సిన జాంబి మూవీ గా చెప్పుకోవచ్చు. సీయోన్ నుంచి బూసాన్ వెళ్తున్న రోడ్లో జాంబి అటాక్ నుంచి తప్పించుకోవడానికి ప్రయాణికులు చేసే ప్రయత్నమే ఈ మూవీ. ఇక ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫిక్స్ లో అందుబాటులో ఉంది.
4. వరల్డ్ వార్ జెడ్:
మనుషులను జాంబీలుగా మార్చే వైరస్ చుట్టూ తిరిగే కథే ఈ మూవీ. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ లీడ్రోలో నటించిన మూవీ ఇది.
5. గో గౌవా గాన్:
గో గోవా గాన్ ఓ బాలీవుడ్ మూవీ. 2013లో ఈ మూవీ వచ్చింది. గోపాలు ఎవరికి తెలియని దీవిలో రేవ్ పార్టీకి వెళ్లిన ముగ్గురు స్నేహితులు జాంబిల బారిన పడతారు. అక్కడి నుంచి వారు బయట ఎలా పడ్డారనేదే ఈ మూవీ. ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
ఈ ఐదు సినిమాలే కాకుండా మరిన్ని సినిమాలు జాంబి జోనర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ ఈ ఐదు సినిమాలు కొంచెం ప్రేక్షకులను ఎక్కువగా అట్రాక్ట్ చేశాయి. ఈ జోనర్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి గుర్తింపు నే పొందింది. అందువల్లే ఇతర భాషల్లో కూడా ఈ జానెర్ లో సినిమాలు చేసేందుకు ఇష్టపడుతున్నారు.