Siren Response: జయం రవి, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సైరన్. ఈ మూవీ చాలా కాలం సందిగ్ధత తరువాత థియేటర్లలో విడుదలైంది. పదిసార్లు వాయిదాలు పడిన ఈ తమిళ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అయితే ఈ మూవీ రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. సైరన్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఏప్రిల్ 19న తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం లోను ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో 5 భాషల్లో ఈ చిత్రం హాట్‌స్టార్ లోకి అడుగుపెట్టింది.
సైతాన్ సినిమాకు హాట్‌స్టార్ ఓటిటిలో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కి భారీ వ్యూస్ కూడా దక్కాయి. దీంతో హాట్ స్టార్ ఓ టి టి ఇండియా ట్రెండ్ంగ్ లో టాప్ కు వచ్చేసింది. టాప్ లో ట్రెండ్ అవుతుంది. తెలుగు వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్ సీజన్ 2 సుమారు నెల రోజులుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ప్రియదర్శి, అభినవ్ గోమట్టం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రను పోషించిన ఈ సిరీస్ మార్చ్ 15న ఓటిటిలోకి రాగా మొదటి నుంచి మంచి వ్యూస్ సాధించింది. ట్రెండింగ్ లో దూసుకెళ్తుంది. అయితే సైతాన్ మూవీ ఇప్పుడు సేవ్ ది టైగర్ సీజన్ 2 ను దాటేసి ప్రస్తుతం హాట్‌స్టార్ ఓటీటీలో ట్రెండింగ్ లో టాప్ లో కి వచ్చేసింది.
ఈ సిరీస్ రెండో స్థానంలో ఉంది. సైరన్ మూవీలో జయం రవి, కీర్తి సురేష్ తో పాటు అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగి బాబు, ఇన్సేన్ అష్రాఫ్, అజయ్ ప్రధాన పాత్రను పోషించారు. ఇక ఈ మూవీకి హ్యాండ్ తోని భరద్వాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో పోలీస్ గా సీరియస్ క్యారెక్టర్ చేశారు కీర్తి. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సైరన్ మూవీకి జీవి ప్రకాష్ కుమార్, సామ్ సిఎస్ సంగీతం అందించారు. హూం మూవీ మేకర్ స్ పతాకంపై సుజిత విజయ్ కుమార్ నిర్మించిన ఈ మూవీకి సెల్వ కుమార్ ఎస్ కె సినిమాటోగ్రఫీ అందించారు.
భార్య జెన్నిఫర్ (అనుపమ) ను హత్య చేసిన కేసులో తిలక్( జయం రవి) అరెస్ట్ అవుతాడు. అయితే అతడు పెరోల్ తో బయటకి వచ్చినప్పుడల్లా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్య కేసులను పోలీస్ ఇన్స్పెక్టర్ నందిని (కీర్తి సురేష్) విచారిస్తారు. తిలక్ పై అనుమానంతో మళ్లీ అరెస్ట్ చేస్తూ ఉంటుంది. సరైన ఆధారాలు లేక విడిచి పెడుతుంది. అసలు జెన్సీ ఫర్ నిజంగా తిలక్ ని హత్య చేశాడా? విచారణలో బయటపడిన నిజాలేంటి? తిలక్ కు అతడి కూతురు ( యువిని) దగ్గరవుతుందా అనేదే సైరన్ మూవీ కథాంశం. ఇక ఈ మూవీ థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ ఓటీటీలో మాత్రం తన సత్తా చూపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకెన్ని రివార్డులు సృష్టిస్తుందో చూడాలి మరి.