Animal: డిసెంబర్ మొదటి తారీకు విడుదలైన “యానిమల్” సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఐదు భాషలలో విడుదలైన “యానిమల్” వారం రోజులు గడవక ముందే ₹500 కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి సినిమా తీసిన విధానం పట్ల చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రివ్యూలు ఇస్తున్నారు. ఈ రకంగా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తర్వాత హరీష్ శంకర్ “యానిమల్” సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సైతం “యానిమల్” తో లవ్ లో పడినట్లు తెలిపారు. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రావటం జరిగింది. “యానిమల్” సినిమా చూశాక మతి పోయింది. సినిమా మేదస్సుకు మించిపోయింది. “యానిమల్” సినిమా యూనిట్ అందరికీ అభినందనలు అని ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ విశ్లేషించారు.
ముందుగా హీరో రణబీర్ కపూర్ నటనకు మాటల్లేవు. ఎంతో స్ఫూర్తిదాయకంగా.. నటనలో నెలకొల్పిన్న ప్రమాణాలకు.. హాట్సాఫ్ అని తెలియజేశారు. హీరోయిన్ రష్మిక మందన గురించి మాట్లాడుతూ.. రష్మిక ఇప్పటిదాకా చేసిన అని సినిమాలలో “యానిమల్” హైలెట్. చాల అద్భుతంగా ఆకర్షణీయంగా నటించింది. రాబోయే రోజుల్లో ఇదే ప్రతిభ వచ్చే సినిమాలలో కనబరుస్తావని నమ్ముతున్నాను అని అన్నారు. విలన్ పాత్రలో బాబి డియోల్.. తన నటనతో అందరినీ ఆకట్టుకోవడం మాత్రమే కాదు మాటలు మర్చిపోయేలా చేసారు అని చెప్పుకొచ్చారు. అనిల్ కపూర్ తన పాత్రతో .. కథలో ఉన్న లోతును చూపించారు.
మరోసారి మీ యొక్క అనుభవం ఏంటో.. నిరూపించారు. త్రిప్తి దిమ్రి నటనతో హృదయాలను బద్దలు కొట్టేసింది. రాబోయే రోజుల్లో మరింతగా విజయవంతంగా జర్నీ కొనసాగాలి అని బన్నీ విశ్లేషించారు. సినిమా యూనిట్ తో పాటు టెక్నికల్ యూనిట్ అందరూ తమ బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. సినిమా పరిధి దాటేసి.. అందరిని గర్వించేలా చేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. “యానిమల్” సినిమా భారతీయ సినీ క్లాసిక్ లిస్టులో చేరినట్టే అంటూ అల్లు అర్జున్ ఈ సినిమా గురించి తనదైన విశ్లేషణ చేయడం జరిగింది. అయితే తన సినిమాకి బన్నీ రివ్యూ ఇవ్వటంతో.. సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా ఫోన్ చేసి.. కృతజ్ఞతలు తెలిపినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఖచ్చితంగా మీతో కూడా ఒక సినిమా చేయాలని ఉందని అందుకు తగ్గ స్క్రిప్ట్ వర్క్ కూడా.. స్టార్ట్ చేసే ఆలోచన ఉన్నట్లు సందీప్ రెడ్డి వంగా చెప్పడంతో బన్నీ కూడా.. కచ్చితంగా నీతో చేయటానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉన్నట్లు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినపడుతోంది.