Sr NTR: భారతీయ సినీ చరిత్రలో పౌరాణిక పాత్రలంటే ఒక సీనియర్ ఎన్టీఆర్ పేరు తప్ప మరే నటుడు పేరు గుర్తుకు రాదు. కృష్ణుడు, రాముడు కాకుండా ఎన్నో పౌరాణిక పాత్రలు రామారావు వేస్తే ప్రేక్షకులు నిరాజనం పట్టారు. అలాంటి ఎన్టీఆర్ మొట్టమొదటిసారి రాముడి వేషం వేసింది తెలుగు సినిమాలో కాదని మీకు తెలుసా? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రాముడు మరియు కృష్ణుడు లాంటి దైవ పాత్రలు వేయాలంటే ఎక్కువగా ఆనాటి కాలంలో ఎన్టీ రామారావు గారిని ఎంపిక చేసుకునేవారు. రాముడన్న, కృష్ణుడు అన్న రామారావు నే తప్ప వేరే నటుల్ని కన్నెత్తి కూడా చూసేవారు కాదు. 1957 లో వచ్చిన మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడి పాత్రలో కనిపించి ప్రతి ఒక్కరిని మెప్పించాడు. ఈ సినిమాలో నిజంగానే కృష్ణుడు పూనాడా అనిపించే విధంగా ఆయన నటించారు.
ఆ మూవీ తెలుగు చలనచిత్ర సీమలో ఒక గొప్ప సినిమాగా నిలిచింది. ఈరోజుకి కూడా ఈ సినిమాని భారత దేశ సినీ చరిత్రలోనే అగ్రస్థానంలో ఉండే సినిమాగా చెప్పుకుంటారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ వేసిన కృష్ణుడి పాత్రలో ఒక గుడి కూడా కట్టేశారు అంటే ఆ పాత్ర ప్రభావం ప్రేక్షకులపై ఏ విధంగా పడిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. అటువంటి ఎన్టీఆర్ ఆ తరువాత ఎన్నో పౌరాణిక పాత్రలు వేసి పేరు సంపాదించుకున్నారు. తెలుగులో పౌరాణికం అంటే ఎన్టీఆర్ అనేది అట్లుగా పేరు సంపాదించుకున్నారు. అయితే కృష్ణుడిగా కనపడిన ఎన్టీఆర్ అనంతరం ఎన్నో చిత్రాల్లో కృష్ణుడిగా నటించాడు. అవన్నీ ఎంతో విజయం అయ్యాయి కూడా. కానీ ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా రాముడిగా ఏ సినిమాలో నటించారో తెలుసా? అందరూ అనుకున్నట్లుగా లవకుశ లో వేశారు అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే.
రాముడిగా మొట్టమొదటిసారి ఎన్టీఆర్ ఒక తమిళ్ చిత్రంలో నటించారు. సంపూర్ణ రామాయణం అనే తమిళ్ సినిమాలో రాముడిగా ఎన్టీఆర్ కనిపించారు. తమిళ్ సూపర్ స్టార్ శివాజీ గణేశన్ భరతుడిగా అదే సినిమాలో కనిపించారు. తెలుగు మరియు తమిళ్ భాషల్లో అప్పటి లేడీ సూపర్ స్టార్ పద్మిని సీతగా నటించింది. ఇది 1958లో విడుదలైంది. అలా మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ రాముడిగా వేషధారణ చేసింది తమిళ లో. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం మొట్టమొదటిసారి ఎన్టీఆర్ రాముడి పాత్ర వేసింది లావకో సినిమాలో అనుకుని బోల్తా పడుతున్నారు. మొదట ఎన్టీఆర్ రాముడి పాత్ర తమిళ్లో వేసి అనంతరం తెలుగులో వేశారు.
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది అభిమానులు..” నిజంగా మేము ఇప్పటివరకు ఎన్టీఆర్ మొట్టమొదటిసారి రాముడి పాత్ర లవ కుశ సినిమాలో వేశారని అభిప్రాయపడుతున్నాం. కానీ ఈయన తమిళ్లో మొట్టమొదటిసారి రాముడి వేషం వేశారా? ఇంతకాలం తెలియక చాలా పెద్ద పొరపాటే చేశాముగా. అయినా సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు గురించి చెప్పుకోవాలంటే ఒక జీవితం సరిపోదు. అయినా నటించిన వందల సినిమాల్లో ఏ సినిమా అని గుర్తుంచుకోగలం. నిజంగా అన్ని వందల సినిమాల్లో నటించి ఇంత పేరు సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్కి హ్యాట్సాఫ్ చెప్పుకోవచ్చు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ఫుల్ చక్కర్లు కొడుతుంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!