NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మరో ట్రన్స్ జెండర్..?

Advertisements
Share

Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ షోలో పలు సీజన్ లలో ట్రన్స్ జెండర్ లు ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఐదవ సీజన్ లో పింకీ ఎంట్రీ ఇవ్వగా మూడవ సీజన్ లో తమన్నా సింహాద్రి అనే ట్రాన్స్ జెండర్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ ఇద్దరిలో ఐదవ సీజన్ లో ట్రాన్స్ జెండర్ పింకీ అద్భుతమైన ఆట ఆడటం జరిగింది. దాదాపు టాప్ 5 దాకా వెళ్లకపోయినా గానీ.. హౌస్ లో బలమైన కంటెస్టెంట్లకు మంచి పోటీ ఇచ్చింది. ఇదిలా ఉంటే త్వరలో ఏడవ సీజన్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈసారి సీజన్ లో కూడా ఓ ట్రాన్స్ జెండర్ కి నిర్వాహకులు అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisements

Another trans gender in Bigg Boss season seven

ఆమె మరెవరో కాదు జబర్దస్త్ షోలో ప్రముఖ ట్రాన్స్ జెండర్ తన్మయి సీజన్ సెవెన్ బిగ్ బాస్ హౌస్ లో పోటీ పడబోతున్నట్లు టాక్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు చేసినట్లు తన్మయి ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షోకి విపరీతమైన ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ షోలో లేడీ గెటప్పులు వేసుకుంటూ ఫేమస్ అయిన తన్మయి తర్వాత ట్రాన్స్ జెండర్ గా మారినట్లు షోలో ప్రకటించడం జరిగింది. ఈ రీతిగా ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. అయితే అప్పట్లో ఆరవ సీజన్లో తన్మయికి అవకాశం ఇచ్చినట్లు కొన్ని.. అన్ని కారణాలవల్ల.. చివరి నిమిషంలో అవకాశం వదులుకున్నట్లు ప్రచారం జరిగింది.

Advertisements

Another trans gender in Bigg Boss season seven

అయితే ఇప్పుడు ఏడవ సీజన్ లో తన్మయి పోటీ పడటానికి రెడీ అయినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా షో నిర్వాహకులు ప్రకటించబోతున్నట్లు టాక్. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోగో రిలీజ్ అయింది. ఆ తరువాత హోస్ట్ గా మళ్లీ నాగార్జున అని ఒక యాడ్ ద్వారా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక త్వరలోనే షోలో పాల్గొనబోయే సభ్యులకు సంబంధించి కీలక అప్ డేట్ రాబోతున్నట్లు సమాచారం.


Share
Advertisements

Related posts

Bigg Boss Season 7: ఈసారి సీజన్ సెవెన్ లో ఆ ఫేమస్ కపుల్స్ ఎంట్రీ కన్ఫామ్..?

sekhar

BrahmaMudi 193 ఎపిసోడ్ : అపర్ణని రెచ్చగొట్టిన రుద్రాణి.. చిన్న సంతోషానికే పొంగిపోయిన కావ్య..

bharani jella

Kajal Aggarwal: హీరోయిన్ జ్యోతిక స్థానంలో కాజల్ అగర్వాల్..?

sekhar