NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Vaishnavi Chaitanya: ఆమె కెరియర్ నాశనం చేస్తున్నావు అంటూ “బేబీ” డైరెక్టర్ పై మండిపడుతున్న వైష్ణవి చైతన్య ఫ్యాన్స్..??

Vaishnavi Chaitanya: ప్రపంచ సినిమా రంగంలో తెలుగు సినిమా రంగానికి ప్రత్యేకమైన గుర్తింపు ఇటీవల లభించింది. బాహుబలి 2, RRR, పుష్ప సినిమాలు టాలీవుడ్ స్థాయిని పెంచేసాయి. ఇక ఇదే సమయంలో “పుష్ప” సినిమాకి గాను అల్లు అర్జున్ ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకోవటం.. టాలీవుడ్ కీర్తిని చాటేటట్టు చేసింది. దీంతో తెలుగు వాళ్ల టాలెంట్ కి బాగా ప్రాధాన్యత పెరిగింది. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్స్ విషయంలో.. ఉత్తరాది భామల పైన ఎక్కువగా ఆధారపడే వాళ్ళు. కానీ ఇటీవల రెండు సంవత్సరాల నుండి పరిస్థితి మారింది. చాలా వరకు లోకల్ అమ్మాయిలు సత్తా చాటుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే ప్రస్తుతం శ్రీలీలకి పెద్ద పెద్ద సినిమాలు పడుతున్నాయి. అగ్ర హీరోలు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి వారితో ప్రస్తుతం నటిస్తోంది.

Vaishnavi Chaitanya fans angry on Baby director Sai Rajesh

ఇక ఇదే రకంగా తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య కూడా సత్తా చాటుతూ ఉంది. “బేబీ” సినిమా వైష్ణవి చైతన్య తలరాతను మార్చేసింది. ఈ సినిమాలో ఆమె నెగటివ్ గా కనిపించినా గానీ నటనపరంగా అందరిని ఆకట్టుకుంది. “బేబీ” సినిమా చూసి ఐకాన్ స్టార్ బన్నీ.. తెలుగులో ఈ రకంగా వైష్ణవి చైతన్య మాదిరిగా అందరూ రాణించాలి అని ప్రత్యేకించి అభినందించారు. లోకల్ టాలెంట్ నీ సపోర్ట్ చేయడానికి ఇండస్ట్రీ రెడీగా ఉందని కూడా సంచలన ప్రకటన చేశారు. దీంతో వైష్ణవి చైతన్యకి భారీగా పెద్ద పెద్ద సినిమాల ఆఫర్స్ వస్తున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. కానీ ప్రజెంట్ పరిస్థితి చూస్తే వైష్ణవి చైతన్య చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే వైష్ణవి చైతన్య.. ఆ ప్రముఖ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి రెడీ అయినట్లు ఆ వార్త యొక్క సారాంశం. ఆ హీరో మరెవరో కాదు ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని.

Vaishnavi Chaitanya fans angry on Baby director Sai Rajesh

ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో “డబుల్ ఇస్మార్ట్” అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో వైష్ణవి ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ సినిమాలో ఆమెను సెకండ్ హీరోయిన్ గా తీసుకోవడానికి పూరి జగన్నాథ్ ఆలోచన చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆమెను ఐటెం సాంగ్ లో చూపించబోతున్నారట. కాగా ఈ ఐటెం సాంగ్ చేయడానికి వైష్ణవికి ఇష్టం లేకపోయినా “బేబీ” సినిమా దర్శకుడు సాయి రాజేష్.. దగ్గరుండి బలవంతంగా ఒప్పించి మరి సైన్ చేయించాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై వైష్ణవి చైతన్య అభిమానులు మండిపడుతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించే టాలెంట్ ఉన్న అమ్మాయిని.. అలా ఐటెం సాంగ్ కి ఒప్పించడం అన్యాయమని అంటున్నారు. వైష్ణవి చైతన్య హీరోయిన్ సత్తా చాటే కంటెంట్ కలిగిన అమ్మాయి. అలాంటి అమ్మాయిని ఐటెం సాంగ్ లకు ఒప్పించటం దుర్మార్గమని.. తాజా వార్తలు పై ఆమె అభిమానులు మండిపడుతున్నారు.

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu