23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న విక్ర‌మ్ `కోబ్రా`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Share

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్‌ విక్రమ్ నుంచి రీసెంట్‌గా వ‌చ్చిన చిత్రం `కోబ్రా`. అజయ్‌ జ్ఞానముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో `కేజీఎఫ్‌` బ్యూటీ శ్రీ‌నిధి శ్రీ‌ట్టి మీరోయిన్ గా న‌టించింది. ఇర్ఫాన్ పఠాన్, రోషన్‌ మాథ్యూ, మీనాక్షి , మృణాళిని తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. ఏఆర్‌ రెహమాన్ సంగీతం అందించారు.

సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం.. ఆగ‌స్టు 31 త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌లైంది. అయితే తొలి షో నుంచి ఈ మూవీకి మిశ్ర‌మ స్పంద‌న ద‌క్కింది. విక్ర‌మ్ డిఫరెంట్ గెటప్స్‌లో అద్భుతంగా అల‌రించారు. కానీ, సినిమా న‌డివి, రొటీన్ క్లైమాక్స్ పెద్ద మైన‌స్‌లుగా మారాయి.

cobra movie ott release date
cobra movie ott release date

భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద బొక్క బోర్లా ప‌డింది. దీంతో ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజులకే థియేటర్ల నుండి మాయమైంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతోంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం సోనీ లివ్ `కోబ్రా` డిజిటల్ రైట్స్‌ను సాలిడ్ ధ‌ర‌కు ద‌క్కించుకుంది. అయితే ఈ సినిమా థియేట‌ర్స్‌లో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌క‌పోవ‌డంతో.. ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే ఓటీటీలో దింపేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 23 లేదా సెప్టెంబర్ 31న కోబ్రాను స్ట్రీమింగ్ చేసేందుకు సోనీ లివ్ వారు ప్లాన్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంది.


Share

Related posts

Ramarao on duty : ‘రామారావు ఆన్ డ్యూటీ’ రవితేజ కెరీర్‌లోనే ఠఫ్ రోల్..రెండు డిఫ్రెంట్ వేరియేషన్స్

GRK

Nbk-Ntr: నందమూరి ఫ్యామిలీలో అదే అసలైన మల్టీస్టారర్..!!

Muraliak

Puspha 2: ఈ ఏడాది విడుదల కాదా..?

GRK