Dehydration Health Tips: మానసిక ఉల్లాసం కోసం చాలా మంది మద్యం సేవిస్తుంటారు. ఆల్కహాల్ మితంగా తీసుకున్నప్పుడు మెదడు ఉత్తేజితమవుతుంది. శరీరంలో డోపమైన్, ఎండార్ఫిన్ లాంటి హార్మోన్లు ఉత్పన్నమై మెదడును తాత్కాలికంగా ఉత్తేజపరుస్తాయి. మద్యం సేవించడం వల్ల అప్పటివరకే ఆనందం పొందినప్పటికీ ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మెదడులో నాడులు దెబ్బతింటాయి. గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది. శ్వాస క్రియ నెమ్మదిస్తుంది.

రక్తం ద్వారా మెదడుకు వ్యాప్తి..
ఇతర పదార్థాల కంటే ఆల్కహాల్ చాలా వేగంగా శరీరంలోి వెళ్తుంది. మద్యం వెంటనే జీర్ణం కాదు. ఇది రక్తంలోకి కలిసి మెదడు, కాలేయం సహా శరీరంలోని ప్రతి అవయవానికి వ్యాపిస్తుంది. మద్యం అతిగా తాగేవారికి ఆల్కహాల్ నుంచి ఎక్కువ మొత్తంలో కెలరీలు అందుతాయి. ఎసిటాల్డిహైడ్ వల్ల కాలేయం దెబ్బ తింటుంది. హెపటైటిస్, కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Dehydration With Alcohol: డీహైడ్రెషన్‌కు దారి..
అధిక మద్యం సేవించిన మరుసటి రోజు హ్యాంగోవర్ వస్తుందనే విషయం తెలిసిందే. హ్యాంగోవర్‌కు ప్రధాన కారణాలలో డీహైడ్రేషన్ ఒకటి. ఆల్కహాల్ తాగడం వల్ల దీని ప్రభావం మూత్ర విసర్జనపై చూపుతుంది. దాంతో డీహైడ్రేషన్ వస్తుంది. మద్యం తాగినప్పుడు శరీరంలో వాసోప్రెసిస్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మూత్ర విసర్జన అవసరాన్ని తగ్గిస్తుంది.
Dehydration Hangover: హ్యాంగోవర్ రాకుండా ఏం చేయాలి?
మద్యం తాగాలనుకుప్పుడు కొన్ని టిప్స్ ఫాలొ అవ్వాలి. ఖాళీ కడుపుతో ఎప్పుడు మద్యం సేవించకూడదు. ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల శరీరంలో ఆల్కహాల్ స్థాయి వేగంగా పెరుగుతుంది. త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతాము. అలాగే మద్యాన్ని ఎన్ని గ్లాసులు తాగాలని అనుకుంటున్నారో ముందే డిసైడ్ అవ్వాలి. తక్కువగా మద్యం సేవించడం వల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం చూపదు. అలాగే వైన్, విస్కీ వంటి రంగు, రుచి పెంచే ఆల్కహాల్ శరీరాన్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తుంది. ఇవి అధిక ఆల్కహాల్ స్థాయిని కలిగి ఉంటాయి.

తక్కువ ఆల్కహాల్ ఉన్న పానీయాలు తాగాలి..
ఆల్కహాల్ కంటెంట్ తక్కువగా ఉన్న మద్యంను తీసుకోవాలి. తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న మద్యం శరీరంపై తక్కువ ప్రభావాన్ని చూపించాలి. హైడ్రేట్‌కు గురైనప్పుడు నీరును ఎక్కువగా తాగాలి.
హ్యాంగోవర్ దిగేదెలా?
హ్యాంగోవర్‌ను తగ్గించేందుకు ప్రస్తుతం మందులు లేవు. రెడ్ వైన్ వల్ల తీవ్రమైన హ్యాంగోవర్‌కు దారి తీస్తుంది. రెడ్‌వైన్‌లో ఉండే రసాయనాల వల్ల రక్తనాళాలు కుచించుకుపోతాయి. దాంతో తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. హ్యాంగోవర్ తగ్గలాంటే ఓ గ్లాస్ పెరుగు, నీరు తాగి కాసేపు నిద్రపోవాలి. అలాగే శరీరంలో మత్తు దిగేవరకు మద్యం సేవించడకూడదు. కాలేయం ఒక గంటలో 8 నుంచి 12 గ్రాముల ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేయగలదు. హ్యాంగోవర్ తగ్గేంత వరకు ఆల్కహాల్ తాగకుండా ఉండాలి.
ఆల్కహాల్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్..
ఆల్కహాల్ తగ్గడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థపై ప్రభావితం చూపుతుంది. అధికంగా మద్యం సేవించడం వల్ల డీహైడ్రేషన్, కడుపు సంబంధిత వ్యాధులు వస్తాయి. కాలేయం, గుండె సమస్యలు వస్తాయి.
మద్యం వ్యసనాన్ని ఎలా వదిలించుకోవాలి..
మద్యం వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టం. ఒక్కసారి అలవాటు పడిన తర్వాత దాన్ని వదులుకోలేరు. అయితే మెల్లమెల్లగా మద్యం నుంచి దూరమవ్వొచ్చు. మద్యం తాగాలని అనిపించినప్పుడు 4-5 ఎండు ద్రాక్షలు తినాలి. ఇది మద్యం తాగాలనే కోరికను తగ్గిస్తుంది. అలాగే రాత్రి పూట ఓ గ్లాసు నీటిలో ఎండు ఖర్జూరం నానబెట్టాలి. ఉదయం పరిగడుపున ఆ నీటిని తాగాలి. కలబంద రసం, క్యారెట్ రసం తాగాలి. ఇవి కాలేయాన్ని శుద్ధి చేస్తాయి. తులసి ఆకులు తినడం కూడా ఆరోగ్యానికి మంచింది. ఆల్కహాల్ వ్యసనాన్ని తులసి ఆకులు తగ్గిస్తాయి. ఇందులో ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర నిర్విషీకరణకు దారి తీస్తాయి.