న్యూస్ హెల్త్

Married Life: వివాహ జీవితం  గొడవలు లేకుండా సంతోషంగా సాగిపోవడానికి ఇలా చేసి చూడండి!!(పార్ట్-2)

Share

Married Life:  ఒకరు కోపం తో ఊగిపోతుంటే .. మరొకరు  మౌనంగా  ఉండటం మంచిది. అది  తగ్గడం కాదు గెలిచేందుకు మార్గం. అది ఎలా అంటారా.. మీ భాగస్వమి ఎంత గొడవ పడతారో  అంతా   పడనివ్వండి… కోపం తగ్గేక మీ వైపునుండి  వివరణ ఇవ్వండి ఇప్పుడు కచ్చితంగా వారు తాము చేసిన దానికి బాధ పడిపోతారు. అలా పడక పోయిన మీ మధ్య గొడవ పెద్దది కాకుండా ఉండి.. మీ బంధం దృఢం గా ఉంటుంది. సంసారం లో ఒకరు ఎక్కువ,ఒకరు తక్కువ అనుకునే రోజులు కాదు ఇవి.. ఆ విషయం  గుర్తు పెట్టుకుని  నడుచుకోవడం అన్ని విధాలా మంచిది. ఏదైనా పొరపాటు జరిగితే క్షమాపణ అడగడానికి వెనకాడకండి. అదే విధం గా  క్షమించడానికి కూడా సిద్ధం గా ఉండండి.

Read more : Married Life: వివాహ జీవితం  గొడవలు లేకుండా సంతోషంగా సాగిపోవడానికి ఇలా చేసి చూడండి!!(పార్ట్-1) 

మీ భాగస్వామి  ఏది చెప్తున్నా  శ్రద్ధగా వినడం వల్ల ఒకరికొకరు ఎంత విలువైన వారో పరస్పరం అర్థం అవుతుంది.  ఒకరినొకరు  చిన్న చిన్న విషయాలకు అభినందించుకోవటం వలన మంచి  ఆనందాన్ని  పొందవచ్చు.  ముఖ్యంగా భర్త భార్యను తన ఆస్తిగా లేదా  తనకుశృంగార సుఖాన్ని ఇచ్చే వస్తువులు గాని లేదా పిల్లల్ని కనే ఒక యంత్రంగా, ఇంటి పని, వంట పని చేసే ఒక పని మనిషిగా చూడడం మానేసి సమానమైన విలువ ఇవ్వాలి.  అలా అధికారం ప్రదర్శించడం వల్ల లేదా బానిసలా చూడటం వలన  ప్రేమ ఎప్పుడు నిలబడదు.పిల్లల పని, ఇంటి పని, వంట పని భార్యతో కలిసి  పంచుకోవడం  లాంటి  వి  భార్యకు భర్త పట్ల ఎనలేని గౌరవాన్ని, ప్రేమ ను పెరిగేలా చేస్తుంది.మీరు ఇలా ఉండడం వలన… మిమ్మల్ని చూస్తూ  పెరిగే పిల్లలకు తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరగడం తో పాటు…    పిల్లలు  మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దిన వారు అవుతారు.

Read more : Married Life: వివాహ జీవితం  గొడవలు లేకుండా సంతోషంగా సాగిపోవడానికి ఇలా చేసి చూడండి!!(పార్ట్-1)

భర్తతో శృంగారం విషయంలో, పిల్లల్ని కనే విషయంలో భార్య కు  పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం ఉండాలి. ఆ రకమైన వాతావరణాన్ని భర్త కల్పించాలి. ఆమె హక్కుల్ని గౌరవించాలి.  జీవితంలో ఇలాంటి వాటికి కాస్త సమయం కేటాయించి ఆలోచించి అడుగు వేయడం వలన జీవితం లో   విజయవంతంగా ముందుకు వెళ్లగలుగుతారు అని నిపుణులు తెలియచేస్తున్నారు.


Share

Related posts

వామ్మో, ఏంటిది.. నెలకి రూ.25 లక్షలు ఇచ్చేలా నరేష్‌తో పవిత్రా లోకేష్ డీల్..?

Ram

నిశ్శబ్ధం కంటే నాని వి సినిమానే వెయ్యిరెట్లు బెటర్ .. కారణం ఇదే ..!

GRK

Chiranjeevi: చిరంజీవి- బాబి ప్రాజెక్టుకు సంబంధించి కొత్త అప్ డేట్ ..??

sekhar