Romance: అన్ని రకాల భావోద్వేగాలను పరిపూర్ణం గా వ్యక్తం చేయగలిగే భాష ఏదైనా ఉంది అంటే అది కచ్చితం గా కౌగిలింత.కౌగిలింత ఒక ఒక రక్షణ,నమ్మకం, ఒక భరోసా. ఈ కౌగిలింత వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వాటిగురించి తెలుసుకుందాం.కౌగిలి ఓ థెరఫీలా పని చేస్తుంది. శరీరం అంతా పులకించి పోయేలా కౌగిలించుకుంటే… ఇంకా చెప్పాలంటే ఇద్దరి చర్మాలఒకరికి ఒకరు తగలటం వలన ఒకలాంటి అనుభూతి ఒకరి లోంచి ఇంకొకరికి చేరి నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందట.
నవ్వు చేసినట్టే అనేక వ్యాధుల ను తగ్గించుకోవటానికి బిగి కౌగిలి అమృతం లాంటి ఔషదం అని చెప్పక తప్పదు. ఆత్మవిశ్వాసాన్ని ,నమ్మకాన్ని, పెంచుతుంది. డిప్రెషన్,ఒత్తిడి, భయాందోళనలను పోగొడుతుంది. చిన్నిపిల్లల్ని ఎత్తుకుని ప్రేమగా హత్తుకునే ఆ స్పర్శలోని కమ్మదనం పెద్దయిన నరాల్లో అంతర్లీనంగా ఉంటుంది. చిన్నతనం లో అలాంటి ప్రేమ పూర్వక కౌగిలింతలు పొందలేని పిల్లల్లో ఐక్యూ మందగించి నడవడం, మాట్లాడటం, చదవడం, ఆలస్యమవుతాయని ఒక పరిశోధనలో తేలింది. కౌగిలి వల్ల పాజిటివ్ ఎనర్జీ ఒకరి నుంచి మరొకరికి వెళ్తుంది. దాంతో థైమస్ అనే గ్రంధి ఆక్టివ్ అయి తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెంచటం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
కౌగిలించుకున్నపుడు కండరాలు వ్యాకోచించడంతో రక్తప్రసారణ మెరుగై కణజాలాలు మృదువుగా మారి గుండెజబ్బులు రాకుండా ఉంటాయి. మీకిష్టమైన సాప్ట్ టాయ్‌ని హత్తుకున్నా,పెంపుడు జంతువులను దగ్గరకు తీసుకోవటం కూడా మంచిదే అంటున్నారు నిపుణులు.కాబట్టి మీ పిల్లల్ని చిన్నప్పటినుండి మీ వెచ్చని కౌగిలి లో పెరిగేలా చేస్తూ వారికీ చక్కని భరోసా కల్పించండి.