Insomnia: ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.. కంటినిండా నిద్రపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ ఇంటి చిట్కాల తో చక్కని నిద్ర ను సొంతం చేసుకోవచ్చు. వీటిని రెగ్యులర్ గా పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఈ జ్యూస్ తాగితే కనీసం 8 గంటలు నిద్ర నుంచి లెగవరు..!
పొట్లకాయ నిద్రలేమి సమస్యకు అద్భుతంగా చెక్ పెడుతుంది. పొట్లకాయ రసంలో విటమిన్ బి6 ఉంటుంది. ఇందులో పిరాడాక్సిన్ కంటెంట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. నరాలను ఉత్తేజపరుస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు రాత్రి ఒక గ్లాస్ పొట్లకాయ రసం తీసుకోవటం వలన త్వరగా నిద్ర పడుతుంది. ఇందులో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్లు ను తగ్గించి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. పొట్ల కాయ రసాన్ని తాగిన కొద్ది క్షణాల లోనే హాయిగా నిద్ర పడుతుంది ప్రతిరోజు ఈ రసాన్ని తాగడం వలన ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు నిద్ర పోతారు. ఎటువంటి ఆటంకం లేకుండా చక్కటి నిద్ర పడుతుంది.
గోరు వెచ్చటి పాలు తాగినా కూడా హాయిగా నిద్ర పడుతుంది. గోరు వెచ్చటి పాలలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతి రోజు ఒక చక్కటి టైం పెట్టుకుని నిద్ర పోవాలి.