టీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు.బ్లాక్ టీ, గ్రీన్ టీ, వైట్ టీ, ఊలాంగ్ టీ లనుచుస్తూఉంటాం. టీ లో మరో కేటగిరీ హెర్బల్ టీ. ఇది వివిధ రకాల మొక్కల సారం, దినుసులు లేదా మొక్కల భాగాలను వేడినీటిలో మరగబెట్టి,నానబెట్టి తయారయ్యే డికాక్షన్ తో చేసేది. ఇవి మామూలు టీ ల వంటివి కాదు, మామూలు తేయాకు ఉండదు, కెఫీన్ కూడా ఉండదు. కానీ నిజమైన టీ లాగా, హెర్బల్ టీలను కూడా మీ మూడ్ ప్రకారం చల్లగా లేదా వెచ్చగా తాగవచ్చు!
ఇకపోతే కొన్నిఅనారోగ్య.మానసిక సమస్యల కి గురవుతున్న వారు చామంతి పూలతో టీ చేసుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది అని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. మరి ఆ టీ ఎలా చెయ్యాలి? దాని వల్ల లాభాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుని రోజు ఈ టీ తాగి ఒత్తిడిని తరిమేద్దాం . చామంతి టీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం .
కావాల్సిన పదార్ధాలు.. కప్పు నీళ్ళు, కొద్దిగా టీ పొడి, ఎండిన చామంతి రేకులు ,ఒక చెక్క నిమ్మరసం, ఒకటి లేదా రెండు స్పూన్ల తేనే, తీసుకోవాలి .
తయారీ విధానం…
కప్పు నీళ్లు ఒక గిన్నిలో పోసి అందులోకి కాస్త టీ పొడి వేసి బాగా మరిగించాలి .మరొక కప్పులో తాజా లేదా ఎండిన చామంతి రేకలు వేసి ముందు కాచిన వేడివేడి టీ ని అందులో పోసి కలిపి 2 నిమిషాల పాటు మూతపెట్టాలి. ఇంకా ఆ తర్వాత దాన్ని మరో కప్పులోకి వడగట్టి కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుంటే సువాసనతో కూడిన చామంతి టీ రెడీ అవుతుంది . ఇంకా ఈ టీ తాగితే అధిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా నిద్రపోతారు. చర్మ సమస్యలను నయం చేస్తుంది. చర్మం రంగు మెరుగుపరుస్తుంది. మొటిమల తో పాటు మొటిమల మచ్చలను తొలగిస్తుంది.వయస్సు మీరే లక్షణాలనుండి రక్షిస్తుంది.కంటి చుట్టూ వాపును, నల్ల వలయాలను తగ్గిస్తుంది.ఇది సహజమైన స్క్రబ్ గా పని చేస్తుంది . అది ఎలా అంటే చామంతి టీ ని ,పాలపొడి తో కలిపి మీ ముఖం, శరీరానికి స్క్రబ్ గా ఉపయోగించవచ్చు. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.ఇది జలుబుకి కూడా మంచి చిట్కా ఇది .కండరాల,నొప్పులు పిరియడ్స్ నెప్పులు తగ్గుతాయి.జీర్ణసమస్యలను నివారిస్తుంది. మానసిక వత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది.రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించి, ఇన్సులిన్ ను రెగ్యులేట్ చేస్తుంది. కాబట్టి చామంతి టీని డయాబెటిస్ పేషంట్లు తీసుకోవటం చాలా మంచిది.నాలుగు చెంచాల గోరింటాకు పొడికి, చామంతి టీని చేర్చి నానబెట్టాలి. దీన్ని నాలుగైదు గంటల తరువాత తలకు పట్టించి గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టుకి పోషణ అందుతుంది. పట్టులా మారుతుంది.నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి చామంతి పూల టీ ఎంతగానో దోహదం చేస్తుంది. నిత్యం చామంతి పూల టీ తాగుతుంటే రాత్రి పూట చక్కగా నిద్ర పడుతుంది.