NewsOrbit
జాతీయం న్యూస్

Exit polls 2022: యూపిలో మళ్లీ పీఠం అధిష్టించేది బీజేపీనే..!

Exit polls 2022: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికలు తుది అంకానికి చేరాయి. ఉత్తరప్రదేశ్ లో ఏడవ దశ (చివరి విడత) ఎన్నికల పోలింగ్ ముగిసింది. అతి పెద్ద రాష్ట్రం యూపీిలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగ్గా, పంజాబ్ లో 117, ఉత్తరాఖండ్ లో 70, గోవాలో 40 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. మణిపూర్ లో 60 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో మెజార్టీ అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ శాతం తగ్గడంపై రకరకాల విశ్లేషనలు వస్తున్నాయి. ఫలితాల ధోరణిని అంచనా వేస్తూ పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. యూపిలో ఆత్మసాక్షి సర్వే సంస్థ ఎస్పీ అధికార పీఠాన్ని కైవశం చేసుకుంటుందని అంచనా వేయగా, పలు సర్వే సంస్థలు యూపీ ఓటర్లు మళ్లీ బీజేపీకే అధికారాన్ని కట్టిబెట్టినట్లు అంచనా వేశాయి.

Exit polls 2022 five state elections
Exit polls 2022 five state elections

Exit polls 2022: బీజేపీకీ 262 – 277..?

ఉత్తరప్రదేశ్ లో మ్యాట్రైజ్ పోల్ ప్రకారం బీజేపీకీ 262 – 277, సమాజ్ వాదీ కి 119 – 134, బీఎస్పీకి 7 -15. కాంగ్రెస్ 3- 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పింది. పి మార్క్ ప్రకారం యూపిలో బీజేపీకి 240, ఎస్పీకి 140, బీఎస్పీకి 17, కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు రానున్నాయి. ఇతరులు రెండు స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ అంచనా ప్రకారం బీజేపీ కూటమికి 262 – 277, ఎస్పీ కూటమికి 119 – 134, బీఎస్పీకి 7-15 సీట్లు వస్తాయని తెలిపింది. గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి ఈ సారి 90 సీట్లు కోల్పోయే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. 2017 ఎన్నికల్ల బీజేపీ 312 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. యూపీలో బీజేపీ, ఎస్పీ హోరా హోరీ తలపడినట్లు కనిపించినా క్షేత్ర స్థాయిలో బీఎస్పీ కూడా బలమైన ఉనికిని కనిపించింది అని అంటున్నారు.

 

ఉత్తరాఖండ్ లోనూ బీజేపీ అధిక్యంగా ఉన్నట్లు టైమ్స్ నౌ అంచనా వేసింది. ఈ రాష్ట్రంలో మొత్తం 70 స్థానాలకు బీజేపీకి 37, సమాజ్ వాదీ పార్టీకి 31, ఆప్ 1, ఇతరులు 1, వస్తాయని తెలిపింది. పంజాబ్ లో ఇండియా టూడే ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 19-31, బీజేపి 1-4, ఏఏపీ 76 -90, ఇతరులు 7-11 సీట్లు వస్తాయని అంచనా వేసింది.మణిపూర్ లో మొత్తం 60 స్థానాలకు గానూ జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 23 – 28, కాంగ్రెస్ 10-14, ఎన్ పీపీ 7-8, ఎన్పీఎఫ్ 5-7, జేడీయు 5-7, ఇతరుుల 2- 3 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. గోవాలో సీఎన్ ఎక్స్ అంచనా ప్రకారం బీజేపికి 11-16, కాంగ్రెస్ 11-17, ఆప్ 2, ఇతరులు 5-7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగా, జన్ కీ బాత్ ఇండియా న్యూస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 13-19, కాంగ్రెస్ 14 -19, ఆప్ 1-2, ఇతరులు 4-8 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపాయి.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N