NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

Ganga River: ఆకు పచ్చగా గంగానది నీరు..! కారణం ఇదేనంట..!!

Ganga River: గంగానదీ జలాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా పూజిస్తారు. గంగాజలాన్ని చల్లుకుంటే పునీతులు అవుతారనే నమ్మకం. అందుకే చాలా మంది గంగాజలాన్ని తమ ఇళ్లలోని దైవ సన్నిధిలో ఉంచి పూజిస్తారు. ఈ జలం ఎన్ని రోజులైనా స్వచ్చందంగా ఉంటుంది. ఇది అంతా కరోనాకు పూర్వం. గత కొన్ని సంవత్సరాలుగా గంగానది మురికికూపంగా తయారు అయ్యింది. ఇది భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. గంగా నదీ పరివాహక ప్రాంతంలోని అనేక నదీ తీరాలు ఆకుపచ్చగా మారుతున్నాయి. గంగానది నీరు కలుషితం అయి తీవ్ర దుర్ఘంధం వెదజల్లుతోంది. చెరువులు, సరస్సుల నుండి నాచు అధికంగా రావడం వల్ల వర్షాకాలంలో లేత ఆకుపచ్చ గా మారుతుంది. అయితే ఈ సారి ఆ రంగు అధికంగా కనబడుతోంది. గతంలో కొన్ని ఘాట్ లలో మాత్రమే ఆకుపచ్చగా కనబడేది కానీ ఇప్పుడు దాదాపు వారణాసిలోని 84 ఘాట్ లలో నీరు ఆకుపచ్చగా దర్శనమిస్తోంది. ఈ నీటి నుండి దుర్వాసనకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Ganga River water turns green color
Ganga River water turns green color

నది నీరు ఆకుపచ్చగా మారడానికి మైక్రోసిస్టిస్ ఆల్కే కారణం అయి ఉండవచ్చని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని మాలవియా గంగా పరిశోధనా కేంద్రం అధ్యక్షుడు డాక్టర్ బిడి త్రిపాఠి పేర్కొంటున్నారు. పారే నీటిలో ఆల్గేను కనుగొనవచ్చని చెప్పారు. కానీ ఇది సాధారణంగా గంగానదిలో కనిపించదన్నారు. ఎక్కడ నీరు ప్రవాహం లేకుండా నిలిచిపోతుందో అక్కడ పోషక స్థితి ఏర్పడుతుందన్నారు. దీని వల్ల మైక్రోసిస్టమ్స్ పెరుగుతాయని పేర్కొన్నారు. సాధారణంగా ఇది చెరువులు, కాలువల నీటిలో మాత్రమే పెరుగుతుందన్నారు.

Read More: Crime News: అవ్వనూ వదలని కామాంధుడు – గ్రామస్తుల చేతిలో సజీవ దహనం..! చిత్తూరు జిల్లాలో గగుర్పొడిచే ఘటన

పర్యావరణ శాస్త్రవేత్త కృపా రామ్ మాట్లాడుతూ నీరు విషపూరితం అయ్యిందా ఆకుపచ్చ రంగు చాలా కాలం పాటు ఉంటుందా అనే విషయాలపై పరిశోధించాలన్నారు. గంగానది నీరు ఆకుపచ్చ రంగు మారడానికి ప్రధాన కారణంలో వర్షం కూడా ఒకటి కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డాక్టర్ కృపారామ్. నీటిలో లవణాలు పెరిగినప్పుడు ఆకుపచ్చ ఆల్గే ఎక్కువగా కనిపిస్తుందన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N