NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

ISRO Chandrayan 3: స్వతంత్ర దినోత్సవంకి ఒక్కరోజు ముందు అద్భుత ఘట్టానికి చేరుకున్న చంద్రయాన్ 3…ఆగస్టు 14న చంద్రుడి కక్షలో కీలక మార్పు!

India's ISRO Chandrayan 3 to Make Key Manoeuvre on August 14 Ahead of Independence Day 2023
Advertisements
Share

ISRO Chandrayan 3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జూన్ 14న ప్రయోగించిన చంద్రయాన్ – 3 వ్యోమనౌక ప్రస్తుతం చంద్రుడి కక్షలో పరిభ్రమిస్తొంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెల (ఆగస్టు) 23న చంద్రుడిపై ల్యాండింగ్ నిర్వహించనున్నారు. ల్యాండర్ విక్రమ్, అన్ని సెన్సార్లు, దాని రెండు ఇంజన్లు పని చేయకపోయినా ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయగలమని ఇటీవల ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్ విక్రమ్ ను ఫెయిల్యూర్ విధానంలో రూపొందించినట్లు ఆయన వెల్లడించారు.

Advertisements

మరో పది రోజుల్లో జాబిల్లిపైకి

Advertisements

ఆగస్టు 5న చంద్ర కక్షలోకి ప్రవేశించిన చంద్రయాన్ – 3 జాబిల్లికి మరింత చేరువ కావడానికి మూరో రెండు డి ఆర్బిటింగ్ విన్యాసాలు నివహించనున్నారు. తద్వారా ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండ్ అవుతుంది. చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలో మూడో సారి కక్షను మార్చుకున్న చంద్రయాన్ – 3 .. ఇవేళ (ఆగస్టు 14) ఉదయం 11.30 గంటల నుండి 12.30 గంటల మధ్య మరో సారి కక్ష మార్చుకోనున్నది. మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 16న చంద్రయాన్ – 3 చంద్రుడి వంద కిలో మీటర్ల వృత్తాకార కక్షలోకి ప్రవేశించనున్నది. ఆగస్టు 17న ఆర్బిటర్ నుండి విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లతో ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్షన్ విడిపోనుంది.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలాన్ని చంద్రయాన్ – 3 ముద్దాడనుంది. ఈ సారి పక్కాగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి తీరుతామన్న నమ్మకంతో ఇస్రో ఉంది. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ – 2 చివరి మెట్టుపై విఫలమై క్రాష్ ల్యాండింగ్ జరిగింది. దీంతో ఇస్రో ప్రయోగం విఫలమైంది. ఇదిలా ఉండగా, ఇస్రోకు పోటీగా రష్యా కూడా చంద్రుడిపై లునా -25 అనే వ్యోమనౌకను చంద్రుడిపైకి పంపింది. ఇది కేవలం అయిదు రోజుల్లోనే  చంద్రుడి కక్షలోకి చేరుకోనుండగా, మన చంద్రయాన్ – 3 కంటే రెండు రోజుల ముందు ల్యాండింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కాగా, ఆగస్టు 5న చంద్రుడి కక్షలోకి ప్రవేశించిన చంద్రయాన్ – 3 వ్యోమనౌక .. అప్పటి నుండి చంద్రుడి ఫోటోలు తీసి పంపుతుండగా ఇస్రో తన అధికారిక ట్విట్టర్ లో షేర్ చేస్తొంది. చంద్రయాన్ – 3 బ్లాండర్ ఇమేజ్ కెమెరా ద్వారా తీసిన పలు చిత్రాలను కూడా ఇస్రో తన ట్విట్టర్ హ్యాండిల్ లో షేర్ చేస్తున్నది.

Tirumala: బాలిక మృతికి కారణమైన చిరుత చిక్కింది


Share
Advertisements

Related posts

మంగళగిరిలో మహిళా గర్జన

somaraju sharma

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం… బాబు తో పాటు వారంతా షాక్ ?

sridhar

Immunity Power: ఆహారంతోనే కాదు ఇలా కూడా ఇమ్యూనిటీపవర్ ను పెంచుకోవచ్చు..!!

bharani jella