Janaki Kalaganaledu ఆగస్టు 14 ఎపిసోడ్ 657: జానకి కలగనలేదు ఈ రోజు ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది… మగవాళ్ళు అలాగే ఉంటారు రామా, ఎలాంటి పెళ్ళాం వస్తుందో అని భయం అని లీలావతి అంటుంది. మా వెన్నెల గురించి అలాంటి బెంగ పెట్టుకోకు అని అంటుంది జానకి. ఇదంతా మీరు గారాభం చేసే వరకే,మీరు గాని తన మాట వినకపోతే ఉగ్రవాది అయిపోతుంది అని వాళ్ళ అన్నయ్య అంటాడు.

అది విన్న కిషోర్ భయపడతాడు, చేతులు వణుకుతూ చేతిలో ఉన్న ఫోన్ కింద పడుతుంది.చూసావా ఉగ్రవాది అనగానే మా తమ్ముడు ఎలా భయపడిపోయాడు కాస్త జాగ్రత్తగా చూసుకో అమ్మ అని జానకి అంటుంది. మీరు మీ తమ్ముడు గారితో చెప్పండి మా చెల్లిని జాగ్రత్తగా చూసుకోమని అని రామా అంటాడు. అందరూ కలిసి మా అల్లుడిని భయపెట్టేస్తున్నారు అని అంటుంది జ్ఞానంబ. అల్లుడు నువ్వు వాళ్ళ మాటలు ఏమి పట్టించుకోకు నా కూతురు బంగారం. పెట్టిన ముహూర్తం కాయం చేద్దాం అని అందరు వెళ్ళిపోతారు. కట్ చేస్తే గోవిందరాజు గదిలో కూర్చుంటాడు, జ్ఞానాంబ వస్తుంది, ఏమో ఏమైపోయావ్ నీ గురించే ఎదురుచూస్తున్నాను అని అంటాడు గోవిందరాజు.

ఏమైనా అమ్మాయికి మంచి సంబంధం దొరికింది ఈ గొప్పతనం అంతా మీదే అని జ్ఞానాంబ అంటుంది. నాదేముంది అని అంటాడు గోవిందరాజు. ఈ సంబంధం తెచ్చింది మీరే కదా అని జ్ఞానాంబ అంటుంది. మనకు నీడనిచ్చిన ఈ ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఎట్టి పరిస్థితుల్లో బ్రతికుండగా ఈ ఇంటిని అమ్మనని అన్నాను, కానీ వేరే దారి కనిపించడం లేదు జ్ఞానం అని గోవిందరాజు అంటాడు. మనకి ముగ్గురు కొడుకులు ఉన్నారు,వాళ్ళు ఆ బాధ్యత తీసుకోలేరా అని జ్ఞానంబ అంటుంది.

చెల్లి పెళ్లికి నాకేం సంబంధం అంటే నేను తట్టుకోలేను జ్ఞానం. వాళ్లు మన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలండి వాళ్ళు అలా అనుకోరు నా మాట వినండి. కట్ చేస్తే, కళ్ళముందు ఉగ్రవాదు గురించి మానేసి ఎక్కడో ఉన్న ఉగ్రవాది గురించి ఆలోచిస్తారు ఏంటండీ అంటాడు రామా. ఏంటండీ మీ గోల అంటుంది జానకి. ఏంటంటే అంటారేంటని ఎత్తుకొని పడుకోబెడతాడు. ఇలా చేస్తే గాని నా మాట వినగానే మీరు అని రామా అంటాడు. నాకు భయమేస్తుందండి రామా అంటాడు. ఎందుకు భయం అని జానకి అంటుంది. మీరు ఇలా ఆఫీస్ పనుల్లో బిజీ అయిపోతే పెళ్లి పనులు ఎలాగండి అని రామా అంటాడు.

కట్ చేస్తే, గోవిందరాజు జ్ఞానంబ హాల్లో వచ్చి కూర్చుంటారు, పిల్లల్ని పిలుస్తాను వాళ్లతో మాట్లాడదాము అని జ్ఞానంబ అంటుంది. ఏమీ లేదమ్మా మన ఇంట్లో శుభకార్యం జరగబోతుంది పెళ్లంటే మామూలు విషయం కాదు అందరూ తలో పని చేస్తే కానీ తలో బాధ్యత పంచుకుంటే గాని జరగదు దాని గురించి మాట్లాడదామని ఆయన రమ్మన్నాడు. ఏం చేసినా మీ ఇష్టమే కదా మల్లిక అంటుంది. జరిగేది ఈ ఇంటి ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లి, దాని గురించి ఎక్కువ వాదోపవాదాలు కూడా మంచిది కాదు అని జానకి అంటుంది. అందరం కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి అనుకున్నప్పుడు వాదపవాదాలు కుదరవు అంటే ఎలా పెద్ద వదిన అని అంటాడు అఖిల్. నువ్వేం మాట్లాడవేంటి రా విష్ణు అంటాడు రామ. మా కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను కదా అండి అని మల్లిక అంటుంది.మీ కుటుంబం మా కుటుంబం ఏంటమ్మా మన అందరిదీ ఒకటే కుటుంబం నువ్వు ఇలా విడదీసి మాట్లాడకు బాధగా ఉంటుంది అని గోవిందరాజు అంటాడు.

మధ్యతరగతి వాళ్ళ ఇంటి కప్పు పైకి బాగానే కనిపిస్తుంది,లోపల ఉన్న కోపాలు బాధలు, బాధ్యతలు ఎవరికి కనిపించవు ఒక్క మోసే వాడికి తప్ప, మీ నాన్నగారికి కూడా వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులు ఏమీ లేవు రా కష్టపడి సంపాదించిన సొమ్ముని ఈ ఇంటి మీద పెట్టారు దాంతోనే మిమ్మల్ని ఈ సంసారాన్ని పోషించారు కూతురి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి మీ సంపాదన లేకుండా పోయిందా దాచుకున్న డబ్బు మీ అవసరాలకు హరించకపోయిందా ఆయన చేతిలో డబ్బే ఉంటే మీ ముందు ఇలా తలవంచుకొని కూర్చునే వారు కాదు అనే జ్ఞానంబ అంటుంది.

చేతిలో డబ్బు లేనప్పుడు రిజిస్టర్ పెళ్లి చేస్తామని ఒప్పుకుంటే సరిపోయేది కదా గొప్పగా చేస్తామని ఎందుకు ఒప్పుకున్నారు అని మల్లిక అంటుంది. అది మన సంప్రదాయం కూతురు పెళ్లి అనగానే ప్రతి మధ్యతరగతి తండ్రి పడే బాధే అది,డబ్బున్న వాడు ఆకాశమంత పందిరేసి పెళ్లి చేస్తే, డబ్బు లేని వాడు ఇంటి ముందు పందిరి వేసి పెళ్లి చేస్తాడు, అటు ఇటు కాని మధ్యతరగతి వాళ్ళమే ఎటు కాకుండా ఇబ్బంది పడతాం, మధ్యతరగతి వాడి కలలు సముద్రపు అలలు లాంటివి తీరం చేరినట్టే చేరతాయి ముగిసిపోయేలోపు ఆగి వెనక్కి పడతాయి, అది మధ్యతరగతి వాళ్ళకి ఇచ్చిన శాపం. ఇలా ఎపిసోడ్ ముగుస్తుంది.