NewsOrbit
జాతీయం న్యూస్

Mask Flashback: ఇప్పుడే కాదు.. అప్పట్లో కూడా మాస్కులు..! వందేళ్ల కిందటి కథ..!!

Mask Flashback: కరోనా మహమ్మారి గత 16 నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కోట్లాదిగా కేసులు, లక్షలాదిగా మరణాలు, లక్షల కోట్ల ఆర్థిక నష్టంతో జీవితాలను కోవిడ్ 19 మహమ్మారి చిన్నాభిన్నం చేసింది, చేస్తోంది. అయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరిశుభ్రత ప్రధాన మార్గాలుగా పాలకులు సూచిస్తున్నారు.  వ్యాక్సినేషన్ పూర్తి అయిన తరువాత కూడా ప్రజలు మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు పాటించాల్సిందే.

Mask Flashback 100 years back also
Mask Flashback 100 years back also

అయితే కరోనా మహమ్మారి రాకముందు చాలా వరకు ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఆపరేషన్ ధియేటర్లలోకి వచ్చి వెళ్లే వైద్యులు, సిబ్బంది మాస్కులు ధరించే వారు. ఆసుపత్రుల్లో బాధితులకు ఇన్ఫెన్షన్ లాంటివి సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటుండే వారు. అయితే ఇప్పుడు కరోనా మూలంగా ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Mask Flashback 100 years back also
Mask Flashback 100 years back also

ఇప్పుడు మాస్కులు ధరించడమే కాక గతంలోనూ ప్రపంచంలోని పౌరులంతా మాస్కులు ధరించారు. 1918లో స్పెయిన్ దేశంలో స్పానిష్ ఫ్ల్యూ వ్యాపించింది. ఈ ఫ్ల్యూ వల్ల ప్రపంచ వ్యాప్తంగా సుమారు అయిదు కోట్ల మంది మృత్యువాతపడ్డారనేది అంచనా. భారత్, చైనాలో దాదాపు కోటి మంది చనిపోయినట్లు సమాచారం. మొదటి ప్రపంచ యుద్ధం కంటే ఎన్నోరెట్లు ప్రాణనష్టం ఈ ఫ్ల్యూ కారణంగా జరిగిందట.  1986 – 1914 మధ్య 80 లక్షల మంది భారతీయులను బలితీసుకున్న ప్లేగు వ్యాధి కంటే భయకరమైనదిగా తేల్చారు. అప్పట్లో స్పానిష్ ప్ల్యూ 20 నుండి 30 ఏళ్ల మద్య వయస్సు వారిపై ఎక్కువగా ప్రభావం చూపిందని లక్షలాదిగా యువత చనిపోయినట్లు కథనాలు వచ్చాయి. స్పానిష్ ప్ల్యూ రెండు విడతలుగా వ్యాప్తి చెందగా మొదటి విడత కుంటే రెండవ విడతలో ఎక్కువ మంది మరణాలకు కారణమైంది.

ఈ మహమ్మారి నుండి తప్పించుకోవాలంటే ఇళ్లల్లో ఉండటం ఒక్కటే మార్గమని సూచిస్తూ సర్ ఆర్ధర్ రాసిన మెమొరాండం ఫర్ పబ్లిక్ యూజ్ను ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలూ ఉన్నాయి. నాడు ప్రపంచంలో యాంటీబయాటిక్స్ కూడా అందుబాటులోకి రాలేదు. విదేశీ వైద్య విధానాలు కూడా దేశాలకు పెద్దగా తెలియని పరిస్థితి. అప్పట్లో ప్రజలు క్లాత్ మాస్కులు ధరించడంతో శానిటైజర్ లుగా అప్పట్లో అందుబాటులో ఉన్న కిరోసిన్, కార్బైడ్ అధారిత లిక్విడ్ లను వాడేవారు. బ్రిటన్ లో ఈ ఫోటోలు ఇప్పటికీ ఉండడమే ఇందుకు సాక్షంగా నిలుస్తున్నాయి. అప్పట్లోనూ జన సమూహాలను నిరోధించేందుకు పార్కులు, నాట్యమండళ్లు, క్లబ్ లు, ప్రార్థనా మందిరాలను పాక్షికంగా  మూసేశారు.

1918కి ముందు ఆఫ్రికా దేశంలో తక్కువ వెడల్పు, పొడవుగా ఉండే ఆకులు, చెట్టు బెరడులతో తయారు చేసే మాస్కులు వాడినట్లు చరిత్ర చెబుతోంది. 1918 నుండి ప్రపంచ వ్యాప్తంగా సాధారణ కాటన్ మాస్క్ లు ధరించారు, అయితే పలు పరిశోధనల అనంతరం ఎన్ 95 మాస్క్ అందుబాటులోకి వచ్చింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju