Pakistan: పాక్ బుద్ది మారే చాన్సేలేదా … కొంప కాలిపోతున్నా అదే మాట‌

Share

Pakistan: పాకిస్థాన్ అంటేనే ఉగ్ర‌వాదుల‌కు అండ‌గా ఉండే దేశం. ఉగ్ర‌వాదాన్ని పెంచి పోషించే దేశం. అలాంటి పాక్‌ వారిపై సానుభూతిని ప్ర‌ద‌ర్శించ‌డం స‌హ‌జ‌మే. అంత‌ర్జాతీయంగా ప‌రువు పోతున్నా.. వాళ్ల ఆలోచ‌న‌ల్లో, మాట‌ల్లో మార్పు రావ‌ట్లేదు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో 70 శాతానికి పైగా భూభాగాన్ని ఆక్ర‌మించుకున్నామ‌ని ఇప్ప‌టికే తాలిబ‌న్లు చెప్తూ వ‌స్తున్నాయి. చిన్నారుల‌ను, మ‌హిళ‌ల‌ను హింసిస్తున్నారు. వేలాది మంది అమాయ‌క ప్ర‌జ‌ల‌ను తాలిబ‌న్లు పొట్ట‌న పెట్టుకుంటున్నారు. ఇలాంటి వారిపై పాక్ త‌న ద‌యాగుణం ప్ర‌ద‌ర్శిస్తోంది. తాజాగా ఆ దేశాధ్య‌క్షుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Read More : Modi: మోడీ పై విరుచుకుప‌డే ఏ చాన్స్ వ‌దులుకోని మ‌మ‌త‌

పాక్ అధ్య‌క్షుడి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…
తాలిబన్లకు పాక్ ఆర్థిక సాయం చేస్తోందా అని ఓ అమెరికన్ న్యూస్ చానల్‌ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఇమ్రాన్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఎలాంటి నిజం లేదని, ఒకవేళ ఈ వాదన సత్యమని భావిస్తే ఆధారాలు చూపించాలని ఇమ్రాన్ చెప్పారు. ‘మేం తాలిబన్లకు సాయం చేస్తున్నామని నిరూపించాలి. మమ్మల్ని నిందించేవారు దీన్ని నిరూపిస్తూ ఆధారాలు చూపించాలి. తాలిబన్లు తలదాచుకోవడానికి, పట్టుబడకుండా ఉండటానికి మేం సేఫ్ హౌజ్‌లు ,సేఫ్ హెవెన్స్, అభయారణ్యాలను కేటాయించామని అంటున్నారు. అలాంటి సేఫ్ హెవెన్స్ ఎక్కడున్నాయో చూపించాలి. పాక్‌లో 30 లక్షల మంది అఫ్గాన్ శరణార్థులు ఉన్నారు. తాలిబన్లను మిలిటెంట్లుగా చూడొద్దు. వాళ్లు కూడా సాధారణ పౌరులే. ఒకవేళ శరణార్థుల క్యాంపుల్లో తాలిబన్లు ఉన్నా వారిని పాకిస్థాన్ ఎలా వేటాడుతుంది? ఎందుకు చంపుతుంది?’ అని ఇమ్రాన్ ఖాన్ ప్రశ్నించారు.

Read More : BJP: దూసుకువ‌స్తున్న మాయావ‌తి.. యూపీలో బీజేపీకి బీపీ?

పాక్‌లో రేప్‌లు ఎందుకు పెరుగుతున్నాయంటే..
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివాదాస్పద కామెంట్లు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. తమ దేశంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడానికి మహిళల డ్రెస్సింగ్ కారణమంటూ ఇటీవల ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఇదే ఒర‌వ‌డిలో తాజాగా ఆయన తాలిబన్ల గురించి చేసిన కామెంట్లు కూడా కాంట్రవర్షియల్‌గా ఉన్నాయి. మ‌రోవైపు అమెరికా సైన్యం ఆఫ్ఘ‌నిస్తాన్ నుంచి త‌ప్పుకున్నాక తాలిబ‌న్లు రెచ్చిపోతున్నారు. తాలిబ‌న్ల‌కు పాక్ సుర‌క్షిత ప్రాంతంగా మారింద‌ని అమెరికా మాజీ సైనికాధికారి పేర్కొన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలీబాన్ల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు పాక్ ఇప్ప‌టికే ప‌దివేల మందికి పైగా ముష్క‌రుల‌ను ఆ దేశం పంపిన‌ట్టు ఇప్ప‌టికే మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.


Share

Related posts

బ్రేకింగ్: కరోనా నుండి కోలుకున్న జనాలకు 5,000 నగదు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

Vihari

Covid charges: ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు చెల్లించిన వారికి డబ్బులు తిరిగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

arun kanna

బ్రేకింగ్ : ప్రైవేట్ కాలేజీల పై ఏపీ ప్రభుత్వం కొరడా

arun kanna