18.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
జాతీయం న్యూస్

Sardar Patel Death Anniversary: దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందించిన సేవలు నిరుపమానం

Share

భారతదేశానిక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలి హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి నేడు. 1875 అక్టోబర్ 31న గుజరాత్ లోని నాడియాడ్ లో జవేరీబాయి, లాడ్ లా పటేల్ లకు నాల్గవ సంతానంగా జన్మించిన వల్లభాయ్ పటేల్ ప్రాధమిక విద్యాబ్యాసం స్వగ్రామంలో పూర్తి చేశారు. ఇంగ్లాండ్ కు వెళ్లి న్యాయశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి ఆహ్మదాబాద్ లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. అనతి కాలంలో గొప్ప న్యాయవాదిగా కీర్తిని సంపాదించారు. నాడు భారత జాతీయ ఉద్యమ ప్రభావానికి లోనైయ్యారు. నాడు తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడైయ్యారు. బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి దేశ ప్రజల దృష్టికి ఆకర్షించారు. అప్పుడే ఆయనకు సర్దార్ అనే పేరు వచ్చింది. ఉప్ప సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమం తదితర ఉద్యమాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖ పాత్ర పోషించారు. భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడుగా వల్లభాయ్ పటేల్ మంచి సహకారాన్ని అందించారు. అంబేద్కర్ ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడుగా నియమించడంలో ముఖ్య పాత్ర పోషించారు.

Sardar Vallabhbhai Patel

 

దేశ స్వాతంత్రం కోసం విశేష కృషి చేసిన వల్లభాయ్ పటేల్ కు స్వాతంత్ర్యం అనంతరం సహజంగానే ముఖ్యమైన పదవులు వరించాయి. జవహర్ లాల్ నెహ్రూ కేబినెట్ లో హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించారు. దేశ రక్షణ, సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారు. 1947 నుండి 1950 డిసెంబర్ 15న మరణించే వరకూ సేవలు అందించారు. సర్దార్ పటేల్ అందరు నాయకుల మాదిరిగా ఒకరి ఆదేశాల ప్రకారం నడుచుకునే వ్యక్తికాదు. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని విజయాలను సాధిస్తుండే వారు అందుకే ఆయనను ఉక్కు మనిషి అనే గుర్తింపు వచ్చింది. పటేల్ హోం మంత్రిగా ఉన్న సమయంలో రాజుల పాలనలో ఉండే కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాలను దేశంలో కలిపేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సమగ్ర భారతదేశానికి పటేల్ తుది రూపు ఇచ్చారు. సుమారు 550 కిపైగా స్వతంత్ర్య రాజ్యాలను భారత్ లో కలిపి ఐక్య భారత్ నిర్మాణానికి అలుపెరగని కృషి చేశారు. తన ఆదేశాలు పాటించని నిజాం రాజు పై పటేల్ ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ పై సైనిక చర్య నిర్వహించి నిజాం పాలనకు అంతం పలికారు. దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించి అసలైన లౌకక దేశాన్ని పునః నిర్మించి దేశానికి అనేక విధాలుగా సేవలు అందించిన పటేల్ 1950 డిసెంబర్ 15న తుది శ్వాస విడిచారు.

Sardar Vallabhbhai Patel statue

పటేల్ దేశానికి అందించిన సేవలను నివాళిగా గుజరాత్ అహ్మదాబాద్ కు 200 కిలో మీటర్ల దూరంలో నర్మదా తీరంలో నిర్మించిన భారీ కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ 2018 లో ఆవిష్కరించారు. 2010లో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పటేల్ కోసం భారీ విగ్రహాన్ని నిర్మించనున్నట్లు ప్రకటించారు. 2013 లో విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ విగ్రహానికి దాదాపు రూ.2,389 కోట్ల ఖర్చు చేశారు. ఐక్యతా విగ్రహం( స్టాట్యూ ఆఫ్ యూనిటీ) ప్రపంచంలోనే అత్యంత ఎతైన ఈ విగ్రహం ఎత్తు 597 అడుగులు (182 మీటర్లు). సర్దార్ వల్లభాయ్ పటేల్ 72వ వర్థంతి సందర్భంగా ప్రధాన మోడీ సహా అనేక మంది నేతలు ఆయనకు నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు.

కేసిఆర్ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సీఎం జగన్ .. తెలంగాణపై సుప్రీం కోర్టుకెక్కిన ఏపీ


Share

Related posts

పాతబస్తీ లో అష్ఠదిగ్బంధం!

Siva Prasad

KCR: ఆ చెట్టు వద్దకు అధికారులు క్యూకట్టారు..! ఫోటోలు దిగారు..! విశేషమేమిటంటే..?

bharani jella

Samantha : సమంత కి బిగ్ బ్యాడ్ న్యూస్ చెప్పిన కృతి శెట్టి .. అమ్మో చిన్న పిల్ల అనుకుంటాం కానీ మామూలుది కాదు !

Ram