NewsOrbit
Entertainment News సినిమా

Indian 2: అదరగొట్టే సోషల్ మీడియా కాన్సెప్ట్ తో “ఇండియన్ 2” మూవీ..?

Indian 2: 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన “భారతీయుడు” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. స్టోరీ పరంగా మరియు మ్యూజిక్ పరంగా అన్ని రకాలుగా ఈ సినిమా అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమాజంలో అవినీతిని నిర్మూలించే పాత్రలో ముసలివాడిగా కమల్ పాత్ర సినిమాకే హైలైట్ అయింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్… మనిషా కొయిరాలా, ఊర్మిళ, కస్తూరి శంకర్ హీరోయిన్ లుగా తమ నటనతో ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. కాగా దాదాపు మళ్లీ 26 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న “ఇండియన్ 2” సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో శంకర్ తెరకేక్కిస్తున్నారు.

shankar and kamala hassan Indian 2 movie concept
Bharatiyudu

1920 బ్యాక్ డ్రాప్ తో పాటు ఇప్పటి పరిస్థితుల ఆధారంగా శంకర్ తెరకేక్కించడం జరిగిందట. ఇంకా 90 ఏళ్ల వృద్ధుడిలో కమల్ పాత్ర ఉండబోతుందట. ఈ క్రమంలో ఆ పాత్రకి తగ్గట్టు ప్రోస్థటిక్.. మేకప్ వాడటంతో షూటింగ్ సమయంలో కమల్ నోరు మెదపలేకపోతున్నారు. ఆహారం తీసుకోవడం కూడా కష్టంగా ఉందంట. దీంతో కేవలం జ్యూసులు రూపంలో మేనేజ్ చేస్తున్నాడట. భారతీయుడు మొదటి పార్ట్ లో అవినీతి చేసే వారిని చంపుతూ వీడియో రూపంలో  దూరదర్శన్ ద్వారా టెలికాస్ట్ చేస్తు అవినితిపరులకు వార్నింగ్ ఇచ్చే తరహ కాన్సెప్ట్. అయితే ప్రస్తుతం సమాజంలో సోషల్ మీడియా విభాగంలో రకరకాల ప్లాట్ ఫాం లు ఉన్నాయి. ఈ క్రమంలో అదే అవినీతి కాన్సెప్ట్ తోనే ఈసారి సోషల్ మీడియాకి పెద్ద పీట వేస్తూ … సమాజంలో అవినీతిపరుల బరతం పట్టే రీతిలో స్టోరీ ఉండనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

shankar and kamala hassan Indian 2 movie concept
Indian 2

కమల్ ఒకపక్క పొలిటికల్ రంగంలో మరోపక్క సినిమా రంగంలో రాణిస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది సంవత్సరాల క్రితం సినిమా హిట్ లేక బాధపడుతున్న కమల్…ఈ ఏడాది “విక్రమ్”తో హిట్ అందుకొన్నాడు. ఈ సినిమా తమిళ సినిమా రంగంలో బాహుబలి రికార్డులను బ్రేక్ చేసి… సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ఊపులో “ఇండియన్ 2” కంప్లీట్ చేసే పనిలో కమల్ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా “విక్రమ్” కంటే ముందే రిలీజ్ కావాల్సి ఉంది. నిర్మాతలతో డైరెక్టర్ శంకర్ కి గొడవ కావడంతో పాటు ఆ గొడవ న్యాయస్థానం దాకా వెళ్లడంతో సినిమా ఆగిపోయింది. కానీ విక్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో కమల్ చొరవ తీసుకొని.. శంకర్ మరియు నిర్మాతల మధ్య రాజీ కుదరచడం జరిగింది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri